Donald trump: ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటన మొదలు..

Eenadu

Donald trump: ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటన మొదలు.."

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటనలో భాగంగా నేడు సౌదీ అరేబియాకు చేరుకొన్నారు. ఆయనకు యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ స్వాగతం పలికారు. ట్రంప్‌ రెండో సారి అధికారం


చేపట్టిన తర్వాత చేపట్టిన తొలి పెద్ద పర్యటన ఇదే. దీనిలో భాగంగా ఆయన సౌదీ, యూఏఈ, ఖతార్‌ను సందర్శించనున్నారు.     నేటి ఉదయం ఆయన విమానం రియాద్‌కు చేరుకొంది. ట్రంప్‌ వెంట అమెరికా విదేశాంగ మంత్రి


మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌, వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌, ఇంధనశాఖ మంత్రి క్రిస్‌ రైట్‌ ఉన్నారు.  పశ్చిమాసియా పర్యటన నాలుగు రోజుల పాటు జరగనుంది. నేడు ట్రంప్‌ కోసం


ఏర్పాటు చేసిన విందులో పలు కంపెనీల సీఈవోలు పాల్గొననున్నారు. వీటిల్లో అమెజాన్‌, ఎన్విడియా,ఓపెన్‌ ఏఐ,ఉబర్‌,కోకాకోలా,గూగుల్‌,బోయింగ్‌ సీఈవోలు ఉంటన్నారు. దీనికి టెస్లా సారథి మస్క్‌ కూడా


హాజరుకానున్నారు.  తాను తుర్కియేకు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. ఈ నెల 15 నుంచి ఉక్రెయిన్‌, రష్యా మధ్య చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పుతిన్‌, జెలెన్‌స్కీతో


నేరుగా చర్చించే అవకాశాలున్నాయి. విమానం తాత్కాలికంగా బదిలీనే.. తనకు ఖతార్‌ రాజకుటుంబం అత్యంత విలువైన బోయింగ్‌ 737 విమానం గిఫ్ట్‌గా ఇవ్వనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెబుతున్నారు. మరోవైపు


ఆ బహుమతి తీసుకోవడం అనైతికం.. అన్న అంశాన్ని ఆయన కొట్టిపారేశారు.  దాదాపు 400 మిలియన్‌ డాలర్ల విలువైన విలాసవంతమైన విమానాన్ని కానుకగా అందించనున్నట్లు ప్రచారం మొదలైంది. దీనిని ఎయిర్‌ ఫోర్స్‌వన్‌


కింద వాడుకోవాలని ట్రంప్‌ ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులకు అందిన అత్యంత విలువైన  బహుమతి ఇదే కావొచ్చు. దీనిని స్వీకరించడంపై  వచ్చిన విమర్శలను తోసిపుచ్చారు. ‘‘అంత ఉదారంగా ఖతర్‌


రాజకుటుంబం ఇచ్చే బహుమతిని వద్దనడానికి నేను మూర్ఖుడిని కాదు’’ అని పశ్చిమాసియా పర్యటనకు వెళ్లే ముందు వ్యాఖ్యానించారు. చివర్లో దీనిని ప్రెసిడెన్షియల్‌ లైబ్రరీకి ఇచ్చేస్తానన్నారు. వ్యక్తిగత


అవసరాలకు వాడుకొనే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. మరోవైపు ఖతార్‌ ప్రతినిధి మాత్రం తాము విమానం ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు. తాత్కాలికంగా ఓ విమానాన్ని బదిలీ చేసే అంశం మాత్రమే


చర్చల్లో ఉందని వెల్లడించారు. 


Trending News

Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండి

Published by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...

Kolleru lake must be protected: andhra cm chandrababu naidu

VIJAYAWADA: Chief Minister Nara Chandrababu Naidu emphasised the urgent need to protect Kolleru Lake, a vital ecological...

Lik: నయన్‌ భర్త కొత్త చిత్రం.. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..?

నటి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ రూపొందిస్తోన్న చిత్రం ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ (LIK). ఈ సినిమా రిలీజ్‌ డేట్...

Urvashi rautela: కేన్స్‌ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలా

కేన్స్‌ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్‌ విడుదల చ...

Stock market: లాభాల్లో దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్‌ దాటిన నిఫ్టీ

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో మొదలయ్యాయి. కార్పొరేట్‌ కంపెనీల ఆర్థి...

Latests News

Donald trump: ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటన మొదలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పశ్చిమాసియా పర్యటనలో భాగంగా నేడు సౌదీ అరేబియాకు చేరుకొన్నారు. ఆయనకు యువరాజ...

Paytm: నెలవారీ ఖర్చులకు అప్పు ఇవ్వనున్న పేటీఎం.. ఎంత వరకు ఇస్తుందంటే..

Published by: Last Updated:July 05, 2021 6:06 PM IST కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు స్వల్ప మొత్తంలో నిధులు ...

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

Icc champions trophy 2025: పాక్‌ క్రికెట్‌ స్థాయి ఏంటో ఐసీసీ ఈవెంట్‌లో ప్రతిబింబించింది: కమ్రాన్ అక్మల్

ICC Champions Trophy 2025: దుబాయ్‌ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే...

‘mera time aagya’: neena gupta recites poem reflecting on career

“_Bhagwan ko sabse pahle shukriya ada kaurugi ki mera time aagya hai, Der se but aagya _(First of all, I would like to t...

Top