Spacex starship: వరుసగా మూడోసారి.. గాల్లోనే పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ మెగా రాకెట్‌

Eenadu

Spacex starship: వరుసగా మూడోసారి.. గాల్లోనే పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ మెగా రాకెట్‌"

Play all audios:

Loading...

బ్రౌన్స్‌విల్‌: అంతరిక్ష రంగంపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోన్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుదూర


అంతరిక్ష యాత్రల కోసం ఈ సంస్థ రూపొందించిన స్టార్‌షిప్‌ మెగా రాకెట్‌ (SpaceX Starship) మళ్లీ విఫలమైంది. తొలుత ఇది విజయవంతంగానే నింగిలోకి దూసుకెళ్లినా.. దాదాపు అరగంట తర్వాత అది గాల్లోనే


పేలిపోయింది. స్టార్‌షిప్‌ రాకెట్‌ ఇలా పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి 7.36 గంటలకు టెక్సాస్‌ (Texas)లోని బ్రౌన్స్‌విల్‌ తీరంలోని వేదిక


నుంచి స్పేస్‌ఎక్స్ దీన్ని (Starship Mega Rocket) ప్రయోగించింది. పునర్వినియోగం కోసం అభివృద్ధి చేసిన 123 మీటర్ల పొడవైన ఈ భారీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత తొలిదశలో


బూస్టర్‌ ఈ రాకెట్‌ నుంచి విడిపోయి భూమికి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. కానీ, స్పేస్‌ఎక్స్‌ (SpaceX) కంట్రోలర్స్‌కు బూస్టర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రణాళిక ప్రకారం.. నియంత్రిత్వ రీతిలో


భూమిని తాకకుండా.. సముద్రంలో పడిపోయింది. * వాయుసేనకు నూతన శక్తి!.. ఐదో తరం యుద్ధవిమానం తయారీలో ముందడుగు మరోవైపు స్టార్‌షిప్‌ తన ప్రయాణాన్ని కొనసాగించి.. అంతరిక్షాన్ని చేరుకుంది. కానీ,


నిర్ణీత కక్ష్యలోకి చేరుకున్న తర్వాత స్టార్‌షిప్‌ పేలోడ్‌లోని శాటిలైట్లను ప్రవేశపెట్టేందుకు వీలుగా తలుపులు తెరుచుకోలేదు. దాదాపు అరగంట తర్వాత స్టార్‌షిప్‌ కూడా నియంత్రణ కోల్పోయింది. గింగిరాలు


తిరుగుతూ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. కాసేపటికే హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది. దీనిపై స్పేస్‌ఎక్స్‌ స్పందించింది. దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపింది. కాగా.. స్టార్‌షిప్‌ మెగా


రాకెట్‌ పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరి, మార్చిలో చేపట్టిన ప్రయోగాల్లోనూ ఈ భారీ రాకెట్లు గాల్లోనే పేలిపోయాయి. అయితే, గత రెండు సార్ల కంటే ఈ దఫా రాకెట్‌ ఎక్కువ దూరం


ప్రయాణించిందని స్పేస్‌ఎక్స్‌ వెల్లడించింది.


Trending News

Pm modi: ఇది పేదల ప్రభుత్వం.. ఆత్మనిర్భర్‌కు కట్టుబడ్డాం: ప్రధాని మోదీ

ఇంటర్నెట్‌డెస్క్‌: పేద ప్రజల సంక్షేమానికి ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సామాజిక మాధ్యమం...

Health Tips: మీకు కోపం ఎక్కువగా వస్తుందా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!

Health Tips: మీకు కోపం ఎక్కువగా వస్తుందా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!Published by:Sultana Shaiknews18-teluguLast Update...

Vikram Murthi – Rolling Stone

Vikram MurthiReporter70 Greatest Comedies of the 21st Century From rom-coms to raunch-coms, 'Anchorman' to 'Girls Trip' ...

పార్లమెంటుకు కోవిడ్‌ దెబ్బ 

బీజింగ్‌: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో పార్లమెంటు వార్షిక సమావేశాలను వాయిదా వేసేందుకు చైనా ప్రభుత్వం నిర్ణయించింది. మర...

IPL 2023 : చెన్నై పాలిట విలన్ గా రూ.14 కోట్ల ఆటగాడు.. 4 ఓవర్లలో 55 పరుగులు ఏంటి సామీ!

IPL 2023 : చెన్నై పాలిట విలన్ గా రూ.14 కోట్ల ఆటగాడు.. 4 ఓవర్లలో 55 పరుగులు ఏంటి సామీ!Published by:Sridhar Reddynews18-te...

Latests News

Spacex starship: వరుసగా మూడోసారి.. గాల్లోనే పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ మెగా రాకెట్‌

బ్రౌన్స్‌విల్‌: అంతరిక్ష రంగంపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోన్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ (Elon Mus...

Fd rates: ఈ బ్యాంకులో ఎఫ్‌డీలపై 7. 80 శాతం వడ్డీ..

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందించడంలో ముందున్నాయి. యూనిటీ బ్యాంకు ఎంతిస్తుందంటే.. ఇ...

Astrology 2023 : ఈ 4 రాశుల పిల్లలు ప్రతి పనిలోనూ నంబర్ 1.. టార్గెట్ ఫిక్స్ అయితే రీచ్ అవ్వాల్సిందే

Astrology 2023 : ఈ 4 రాశుల పిల్లలు ప్రతి పనిలోనూ నంబర్ 1.. టార్గెట్ ఫిక్స్ అయితే రీచ్ అవ్వాల్సిందేPublished by:N SUJAN K...

Raj Tarun: లావణ్యతో పాటు మరికొందరు అమ్మాయిలతో రాజ్ తరుణ్ రిలేషన్ షిప్... సంచలన నిజాలు వెల్లడి..!

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Horoscope: సెప్టెంబర్ 24 రాశి ఫలాలు.. ఈ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి!

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Top