Operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్.. ఉగ్ర శిబిరాల ఉపగ్రహ చిత్రాలు వైరల్‌

Eenadu

Operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్.. ఉగ్ర శిబిరాల ఉపగ్రహ చిత్రాలు వైరల్‌"

Play all audios:

Loading...

దాడి తర్వాత బహవల్‌పూర్‌లోని జైషే స్థావరం పరిస్థితి ఇది.. ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడికి భారత్‌ గట్టిగా బదులు తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని


ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌ (Pakistan)లో మెరుపు దాడులు చేసింది. లష్కరే తయ్యిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ను విజయవంతంగా చేపట్టింది. ఈ మెరుపుదాడుల్లో


తొమ్మిది ఉగ్ర శిబిరాలను ధ్వంసమయ్యాయి. వీటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటికొచ్చాయి. మురీద్కేలోని లష్కరే స్థావరం ఇలా.. ఈ దాడుల్లో బహవల్‌పూర్‌లోని జైషే మహ్మద్‌ ప్రధాన కార్యాలయం,


మురీద్కేలోని లష్కరే తయ్యిబా ఉగ్ర క్యాంప్‌లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటి శాటిలైట్‌ చిత్రాలను మాక్సర్‌ టెక్నాలజీ తీసింది. భారత్‌ జరిపిన క్షిపణి దాడితో బహవల్‌పూర్‌లోని మర్కజ్‌ సుబాన్‌ డోమ్‌


కూలిపోయింది. ఇక, మురీద్కేలోని లష్కరే శిబిరం పూర్తిగా నేలమట్టమైనట్లు ఆ చిత్రాల్లో ఉంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత దాదాపు 25 నిమిషాల పాటు భారత్‌ ఈ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. పాక్‌


సైనిక స్థావరాలు, నివాసాలపై దాడి చేయకుండా కేవలం ఉగ్ర శిబిరాల లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత


పెరిగాయి. ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతిచర్యగా పాకిస్థాన్‌ దాడులు చేసే అవకాశం ఉండటంతో భారత్‌ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా పంజాబ్‌లో హై అలర్ట్‌


ప్రకటించారు. అన్ని ప్రజా కార్యక్రమాలను రద్దు చేశారు. విమానాశ్రయాన్ని మూసివేశారు.


Trending News

Amar Deep: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ 'నా నిరీక్షణ' మూవీ షురూ...!

Amar Deep: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ 'నా నిరీక్షణ' మూవీ షురూ...!Published by:Bhanuprasad Rangaiahgarinews18-teluguLast Up...

Prabhas: షూటింగ్‌లో గాయపడ్డ ప్రభాస్... కాలికి స్వల్పగాయం..!

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

సీఎం జగన్‌ దాడిపై సజ్జల కీలక వ్యాఖ్యలు

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Aadhaar: ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..

Aadhaar: ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..Published by:Veera Babutrending deskLast Updated:January 04, 2025 9:...

Pensioners deadline: హెచ్చరిక!.. నవంబర్ 30లోగా ఇది చేయకపోతే మీ పెన్షన్ ఆగిపోతుంది.

Published by: Last Updated:November 16, 2024 7:19 PM IST PENSION DEADLINE: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పదవీ విరమణ ఉద్యోగులు...

Latests News

Operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్.. ఉగ్ర శిబిరాల ఉపగ్రహ చిత్రాలు వైరల్‌

దాడి తర్వాత బహవల్‌పూర్‌లోని జైషే స్థావరం పరిస్థితి ఇది.. ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశ...

Real cast away: 32 ఏళ్లుగా.. ఒంటరిగా.. దీవిలో జీవించిన 81 ఏళ్ల పెద్దాయన

Published by: Last Updated:April 28, 2021 12:05 PM IST REAL CAST AWAY: మనిషి సంఘజీవి. ఒంటరిగా బతకడం కష్టం. మరి అతను ఎలా ...

Us: సౌత్ కరోలినాలో కాల్పుల కలకలం.. 11 మందికి గాయాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని దక్షిణ కరోలినాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. లిటిల్ రివర్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి 9.30 గ...

Subodh kumar goel: యూకో బ్యాంక్‌ మాజీ సీఎండీ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ అరెస్ట్‌

Subodh Kumar Goel | ఇంటర్నెట్‌ డెస్క్‌: యూకో బ్యాంక్‌ (UCO Bank) మాజీ సీఎండీ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ...

South west monsoon: నాలుగైదు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు: ఐఎండీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింద...

Top