Benjamin netanyahu: గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
Benjamin netanyahu: గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు"
Play all audios:
ఇంటర్నెట్డెస్క్: గాజా (Gaza) మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) వెల్లడించారు. ఇజ్రాయెల్- హమాస్ (Israel-Hamas)ల మధ్య ఉద్రిక్తతల
వేళ గాజాలో మరోసారి దాడుల తీవ్రతను పెంచిన నేపథ్యంలో ప్రధాని నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. దౌత్య కారణాలకు లోబడి గాజాలో క్షామాన్ని నివారించాల్సి అవసరాన్ని తాము గుర్తించామని చెప్పారు. ‘‘మా
పోరాటం తీవ్రస్థాయిలో ఉంది. మేం పురోగతి సాధిస్తున్నాం. ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటాం. ఇందులో వెనక్కి తగ్గేదేలేదు. విజయం సాధించాలంటే.. మనల్ని అడ్డుకోలేరనే విధంగా వ్యవవహరించాలి’’
అని టెలిగ్రామ్ వేదికగా నెతన్యాహు ఒక వీడియోను పోస్టు చేశారు. మరోసారి ఇజ్రాయెల్ (Israel-Hamas Conflict) గాజాపై దాడుల తీవ్రతను పెంచింది. శనివారం అర్థరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న
పలు నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరిపింది. ఖాన్యూనిస్లో 29 మంది, ఉత్తర గాజాలో 48 మంది, జబాలియాలోని శరణార్థి శిబిరంలో 26మంది.. మొత్తంగా 103 మంది మరణించారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ
శాఖ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులను తీవ్రం చేసినట్లు ఇటీవల నెతన్యాహు వెల్లడించిన సంగతి తెలిసిందే. * పాక్ ప్రజల దైన్యం.. ఆ దేశ సైన్యం!
తాజాగా గాజాలోని రెండో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్, సమీప ప్రాంతాలను ఖాళీ చేయాలని స్థానిక ప్రజలకు ఇజ్రాయెల్ మిలిటరీ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. వాటిని ప్రమాదకరమైన పోరాట ప్రాంతాలుగా
పరిగణిస్తునట్లు పేర్కొంది. మరోవైపు దోహాలో జరుగుతున్న చర్చల్లో హమాస్ బహిష్కరణ అంశాన్ని ఇజ్రాయెల్ తెరపైకి తీసుకొచ్చిందని తెలుస్తోంది. యుద్ధం శాశ్వతంగా ఆగాలంటే గాజా పాలన నుంచి హమాస్
వైదొలగాలని, ఆయుధాలు అప్పగించాలని, ఆ సంస్థ ఉగ్రవాదులంతా ఇతర దేశాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. అయితే గాజా నుంచి వెళ్లడానికి, ఆయుధాల అప్పగింతకు తాము సిద్ధంగా లేమని హమాస్
చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల పశ్చిమాసియా పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గాజా గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గాజాలోని పాలస్తీనియన్లు ఖాళీ చేయాలని
గతంలో ప్రతిపాదించిన ట్రంప్.. దానిని అమెరికా నియంత్రణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘గాజా ఫొటోలను చూశాను. అక్కడ ఒక్క భవనమూ లేదు. అన్నీ కుప్పకూలాయి. ఆ శిథిలాల కిందే ప్రజలు ఉంటున్నారు.
ఇది అంగీకారయోగ్యం కాదు. గాజాను అమెరికా తీసుకోవాలని అనుకుంటున్నాను. స్వేచ్ఛా మండలంగా దాన్ని మలచాలి. గాజాకు సంబంధించి నాకు మంచి ఆలోచనలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
Trending News
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Andhra pradesh: వీర జవాన్ల కుటుంబాలకు అండగా సీఎం జగన్... భారీ ఆర్ధికసాయంPublished by: Last Updated:April 05, 2021 3:06 PM IST ఛత్తీస్గఢ్ ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన...
Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు..Reported by: Published by: Last Updated:January 14, 2025 3:47 PM IST కాకినాడ జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం'...
Vivek plays a retired police officer in 'vellai pookkal'The technical crew of _Vellai Pookkal_ includes Ramgopal Krishnaraju for music composition, with Jerald Peter cranking t...
Murti latest news in hindi, photos, videos on murti inextlive jagranदेश को दिल देने वाली कविता कृष्णमूर्ति का आज है जन्मदिन bollywood-masala7 years ago बॉलीवुड में अपने जबरदस्त गानों से लो...
Latests News
Benjamin netanyahu: గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలుఇంటర్నెట్డెస్క్: గాజా (Gaza) మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netan...
Telangana news | latest telangana news - eenaduINDIA'S RICHEST VILLAGES: ఈ ఊళ్లు చాలా రిచ్ గురూ! పల్లెటూరనగానే- పెంకుటిళ్లూ అక్కడక్కడా పూరిపాకలూ, పెరట్లో పాడి పశ...
Women health tips and beauty tips in telugu - eenadu vasundharaఅందానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి? అందానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి?...
IRCTC Tour: ఫ్లైట్లో దక్షిణ భారతదేశ యాత్ర... హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీIRCTC Tour: ఫ్లైట్లో దక్షిణ భారతదేశ యాత్ర... హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీPublished by:Santhosh Kumar Snews18-teluguLas...
Dhawan: ఆ ఇద్దరి కుర్రాళ్ల దెబ్బకి టీమిండియా వెటరన్ ప్లేస్ గల్లంతు.. ఇక, టీమిండియా జెర్సీలో చూడటం కష్టమే భయ్యా!CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...