Donald trump: ఓ గొప్ప దేశంతో వాణిజ్య ఒప్పందం జరగబోతోంది.. ట్రంప్ కీలక ప్రకటన

Eenadu

Donald trump: ఓ గొప్ప దేశంతో వాణిజ్య ఒప్పందం జరగబోతోంది.. ట్రంప్ కీలక ప్రకటన"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారీ టారిఫ్‌లతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump).. ఆ తర్వాత వాణిజ్య ఒప్పందాలకు సిద్ధమయ్యారు. సుంకాల భారం నుంచి ఉపశమనం


కావాలంటే తమతో ట్రేడ్‌ డీల్‌ (Trade Deal) చేసుకోవాలని సూచించారు. దీంతో అనేక దేశాలు అగ్రరాజ్యంతో చర్చలు జరుపుతున్నాయి. ఈక్రమంలోనే ట్రంప్‌ తాజాగా ఓ ఆసక్తికర ప్రకటన చేశారు.   ఓ గొప్ప దేశంతో భారీ


డీల్‌ జరగబోతోందంటూ టీజర్‌ పోస్ట్‌ చేశారు. ‘‘రేపు ఉదయం 10 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ఓవల్‌ ఆఫీసులో అతిపెద్ద మీడియా సమావేశం జరగనుంది. ఓ గొప్ప, గౌరవప్రదమైన దేశంతో వాణిజ్యఒప్పందం


కుదుర్చుకోబోతున్నాం. ఆ దేశం అందరికంటే ముందుంది’’ అని అధ్యక్షుడు ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో రాసుకొచ్చారు. అయితే, ఆ దేశం ఏదనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. దీంతో ఈ పోస్ట్‌పై ఉత్కంఠ


నెలకొంది. * భారత్‌, పాక్‌లు దాడులను ఆపేయాలి: ఇరు దేశాలకు ట్రంప్‌ ఆఫర్‌ భారత్‌, చైనా సహా పలు దేశాలపై ట్రంప్‌ భారీఎత్తున టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైనా మినహా ఇతర దేశాలకు ఈ


సుంకాల నుంచి 90 రోజుల మినహాయింపు కల్పించారు. దీంతో పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలు జరిపాయి. ఈక్రమంలోనే భారత్, జపాన్‌, దక్షిణ కొరియా దేశాలతో త్వరలో డీల్‌ కుదరొచ్చని ట్రంప్ యంత్రాంగం ఇటీవల


సూచనప్రాయంగా వెల్లడించింది. తాజాగా అధ్యక్షుడు కూడా మెగా డీల్‌ అంటూ పోస్ట్ చేయడంతో.. ఈ మూడు దేశాల్లో ఏదో ఒక దానితో వాణిజ్య ఒప్పందం ఖరారై ఉంటుందని సమాచారం. మరోవైపు, టారిఫ్‌ల నేపథ్యంలో


అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాలు చర్చలకు సిద్ధమయ్యాయి. చైనాకు చెందిన అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందంతో అమెరికా ఉన్నతాధికారులు ఈ


వారం చివర్లో స్విట్జర్లాండ్‌లో సమావేశం అయ్యే అవకాశం ఉంది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెస్సెంట్, ఆ దేశ వాణిజ్య ప్రతినిధి జెమిసన్‌ గ్రీర్‌.. జెనీవాలో చైనా ఉన్నతాధికారులతో సమావేశం


అవుతారని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. వినియోగ వస్తువుల ధరలు, సరఫరాపై టారిఫ్‌లు ప్రభావం చూపించొచ్చనే ఆందోళనలు అమెరికా విపణిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యం


సంతరించుకుంది.


Trending News

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

Stock market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 25 వేల ఎగువన నిఫ్టీ

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో, మెటల్‌ స్టాక్స్‌ అండతో సూచీల...

Latests News

Donald trump: ఓ గొప్ప దేశంతో వాణిజ్య ఒప్పందం జరగబోతోంది.. ట్రంప్ కీలక ప్రకటన

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారీ టారిఫ్‌లతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump).. ఆ ...

Israel: ఇలాగే కొనసాగితే.. ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరి: ఫ్రాన్స్‌ హెచ్చరిక

Israel ఇంటర్నెట్‌ డెస్క్‌: గాజాపై ఇజ్రాయెల్‌ వైఖరి విషయంలో ఫ్రాన్స్‌ తీవ్ర అసహనంతో ఉంది. మానవీయ సాయం అందకుండా అడ్డుకుంటే...

Hanuman pooja : మంగళ మరియు శనివారాల్లో ఆంజనేయ స్వామిని ఈ విధంగా ఆరాధించండి.. ఈ 6 రకాల దోషాలు తొలిగించుకోండి..

జై హనుమాన జయతి బల-సాగర । సుర-సమూహ-సమరథ భట-నాగర ॥ ఓం హను హను హను హనుమన్త హఠీలే । బైరిహి మారు బజ్ర కీ కీలే ॥ ఓం హ్నీం హ్నీ...

Sri potti sriramulu nellore news | latest sri potti sriramulu nellore news - eenadu

రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన మాలేపాటి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమితులైన కావల...

ఓటీటీలో కాజల్‌ హార్రర్ మూవీ.. చందమామ వికృత రూపాన్ని చూసి తట్టుకోగలరా...

కాజల్ ప్రస్తుతం ఇండియన్2 మూవీ లో నటిస్తుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై కాజల్ అగర్వాల్...

Top