Operation sindoor: ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్‌కు ఉంది: బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్
Operation sindoor: ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్‌కు ఉంది: బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్"
Play all audios:
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన మెరుపు దాడులను గురించి బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ అక్కడి హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడారు. ఇంటర్నెట్‌డెస్క్: పహల్గాం ఉగ్రదాడిలో
అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాద సంస్థలపై దాడి చేసే హక్కు భారత్‌కు పూర్తిగా ఉందని బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ (Priti Patel) పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పాక్
ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె అక్కడి హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడారు. ఈసందర్భంగా పహల్గాం బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు (India-Pakistan) . ‘పహల్గాం
ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను అన్యాయంగా, క్రూరంగా చంపేశారు. ఈ దాడిలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇది ఉగ్రవాద చర్య. భారత్‌లో ఉగ్రవాద చర్యల కారణంగా దెబ్బతిన్న ముంబయి,
న్యూదిల్లీల జాబితాలో ఇప్పుడు పహల్గాం కూడా చేరింది. ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్‌కు ఉంది. అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రవాదుల స్థావరాలనే భారత్
లక్ష్యంగా చేసుకుంది. యూకే, భారత్ (India-UK)ల మధ్య దీర్ఘకాలిక భద్రతా సహకార ఒప్పందాలు ఉన్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్‌కు బ్రిటన్ (UK) ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి’
అని ఆమె పిలుపునిచ్చారు. పాక్ ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తయ్యిబా భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు చరిత్ర స్పష్టం చేస్తోందని పటేల్ అన్నారు. ఈ ఉగ్రవాద సంస్థకు హమాస్‌తో
సంబంధాలు ఉన్నాయని ఇటీవల నివేదికలు వెలువడినట్లు వెల్లడించారు. యూకే దాని మిత్రదేశాల ప్రయోజనాలకు ముప్పు కలిగించేలా ఏ ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం పాక్‌లో చురుకుగా ఉన్నాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని
కోరారు. * ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ఉగ్ర శిబిరాల ఉపగ్రహ చిత్రాలు వైరల్ పాక్ ప్రతీకారానికి ప్రయత్నించొద్దు భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా చట్టసభ సభ్యుడు రో ఖన్నా స్పందించారు.
ఈసందర్భంగా పాకిస్థాన్ ప్రతీకారానికి ప్రయత్నించొద్దని పిలుపునిచ్చారు. భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గి శాంతి నెలకొనాలని కోరారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికా సిద్ధంగా
ఉందన్నారు. పాక్‌లో ప్రస్తుతం నిజాయతీ కలిగిన స్వరం లేదని విమర్శించిన ఆయన ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌ను నియంతగా అభివర్ణించారు.
Trending News
Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeatTo Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...
మత్తు మాయలో పడి ఇంటికి వచ్చిన స్నేహితురాలి శీలాన్ని తాకట్టు పెట్టి...Last Updated:September 21, 2019 8:30 PM IST నవ్వుతూ మోనాను పలకరించిన దీపక్ ఆమెకు జ్యూస్ కలిపి ఇచ్చాడు. జ్యూస్ తాగిన మోనా...
Delhi capitals | latest delhi capitals - eenaduముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్ జట్టు.. విల్‌జాక్స్, రికెల్‌టన్, కార్బిన్ బాష్ స్థ...
నాటకరంగ ఘనాపాఠి పీసపాటిఆంధ్ర రంగస్థలంలో పద్యనాటకాల స్థానం శిఖరాయమానం. ఈ వైభవానికి ఎందరో మహానటులు పునాదులై నిలిచారు. వారిలో పీసపాటి నరసింహమూర్తి...
‘aatmanirbharta’ named oxford hindi word of 2020 | dynamite news‘AATMANIRBHARTA’ IMPLYING SELF-RELIANCE HAS BEEN NAMED BY OXFORD LANGUAGES AS ITS HINDI WORD OF THE YEAR 2020 AS IT “VAL...
Latests News
Operation sindoor: ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్‌కు ఉంది: బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన మెరుపు దాడులను గురించి బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ అక్కడి హౌ...
కష్టాలు తొల‘గంగ’తెలుగుగంగ..గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. వర్షాలు సమృద్ధిగా కురిసి..సాగునీరు పుష్కలంగా ఉన్నా రైతులు రెం...
Ekadanta sankashti chaturthi 2023: date, timings, significance and ritualsKrishna Paksha Chaturthi tithi of Jyeshtha month is called 'Ekadanta Sankashti Chaturthi'. Worshipping Lord Ga...
Amit shah: ఉగ్రవాదాన్ని సహించేదే లేదు.. దీనికి నిదర్శనమే ‘ఆపరేషన్ సిందూర్’: అమిత్ షాఇంటర్నెట్ డెస్క్: ఉగ్రవాదాన్ని సహించేదే లేదన్నది మోదీ ప్రభుత్వ విధానమని, ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ దీనికి ...
Thopudurthi prakash reddy: పోలీసు విచారణకు హాజరైన వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డివైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (Thopudurthi Prakash Reddy) శ్రీసత్యసాయి జిల్లా సీకేపల్లి పీఎస్‌లో పోలీస...