Taiwan: తైవాన్‌ దేశమా కాదా అని నిర్ణయించే హక్కు చైనాకు లేదు: విదేశాంగ మంత్రి లిన్చియా-లుంగ్

Eenadu

Taiwan: తైవాన్‌ దేశమా కాదా అని నిర్ణయించే హక్కు చైనాకు లేదు: విదేశాంగ మంత్రి లిన్చియా-లుంగ్"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: తైవాన్‌ (Taiwan) ఒక దేశమా కాదా అని నిర్ణయించే హక్కు చైనాకు లేదని తైవాన్‌ విదేశాంగ మంత్రి లిన్ చియా-లుంగ్ (Lin Chia-lung) అన్నారు. ప్రపంచ దేశాలన్నీ తమను ఒక దేశంగా


పరిగణిస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించుకుంటున్న తమ దేశాన్ని చైనా తమ సొంత భూభాగంగా చూస్తోందని..దానిని నిరూపించుకోవడానికి తమపై సైనిక, రాజకీయ ఒత్తిడిని


పెంచుతోందని ఆయన అన్నారు. తరచూ తమను బెదిరించడానికి యుద్ధవిన్యాసాలు నిర్వహిస్తూ..బీజింగ్‌ విపరీత చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.   ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి చైనాతో అనేకసార్లు చర్చలు


జరపడానికి ముందుకొచ్చినప్పటికీ ఆ దేశం అందుకు తిరస్కరించిందని పేర్కొన్నారు. తమది శాంతికాముక దేశమని..ఇప్పటికీ తాము చైనాతో స్నేహపూర్వక బంధాలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.   తైవాన్‌


విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై చైనా స్పందిస్తూ తైవాన్‌ ఎప్పటికీ చైనాకు చెందిన భూభాగమే అని స్పష్టం చేసింది.  తైవాన్‌ తమ దేశంలో భాగమని బీజింగ్‌ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇటీవల తైవాన్‌పై బీజింగ్‌


తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. ద్వీపదేశమైన తైవాన్‌కు ప్రపంచ దేశాలతో ఎలాంటి సంబంధాలు లేకుండా చేసేందుకు బీజింగ్‌ ప్రయత్నిస్తోంది. గతేడాది మే నెలలో తైవాన్‌ అధ్యక్షుడిగా లాయ్‌ చింగ్‌ తె ఎన్నికైన


తర్వాత ఆ దేశ ప్రాదేశిక జలాల్లో చైనా ఇప్పటివరకు మూడుసార్లు భారీ మిలటరీ విన్యాసాలు చేపట్టింది. నిజానికి చైనా, తైవాన్‌ దేశాలు పరస్పర విరుద్ధమైన జీవన విధానాన్ని కలిగి ఉంటాయి. తైవాన్‌


ప్రజాస్వామ్యదేశం కాగా, చైనా కమ్యూనిస్టు దేశం. ‘‘ తైవాన్‌ స్వాతంత్ర్యానికి మేము మద్దతు ఇవ్వం’’ అని అమెరికా విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ఉన్న స్టేట్‌మెంట్‌ను ఆ దేశం తొలగించడంతో అగ్రరాజ్యంపై చైనా


తీవ్ర ఆగ్రహం కలిగించింది. దీంతో బీజింగ్‌ విదేశాంగశాఖ అగ్రరాజ్యంపై మండిపడింది. డ్రాగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. 


Trending News

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌పై నీలినీడలు

ఇప్పటికే 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు స్తంభించిపోగా, నిధుల లేమి కారణంగా ఆగిపోయిన రెండో దశ పనులు  పూర్తవుతాయా అనే సందేహం నెలక...

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

Game changer: ‘గేమ్‌ఛేంజర్‌’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్‌ కీలక వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

Latests News

Taiwan: తైవాన్‌ దేశమా కాదా అని నిర్ణయించే హక్కు చైనాకు లేదు: విదేశాంగ మంత్రి లిన్చియా-లుంగ్

ఇంటర్నెట్‌ డెస్క్‌: తైవాన్‌ (Taiwan) ఒక దేశమా కాదా అని నిర్ణయించే హక్కు చైనాకు లేదని తైవాన్‌ విదేశాంగ మంత్రి లిన్ చియా-ల...

Sitaare zameen par: ఆమిర్‌ఖాన్‌ కొత్త చిత్రం.. బాయ్‌కాట్‌ అంటోన్న నెటిజన్లు

ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’ (Sitaare Zameen Par). ఈ చిత్రాన...

Katrina kaif and vicky kaushal: నెల‌కు రూ. 8ల‌క్ష‌ల అద్దె.. కొత్త జంట ఎక్క‌డ ఉండ‌బోతుందో తెలుసా?

Published by: Last Updated:December 07, 2021 4:44 PM IST KATRINA KAIF AND VICKY KAUSHAL: బాలీవుడ్‌ (BOLLYWOOD) లో విక్కీ...

Anant ambani and radhika merchant's wedding: అనంత్, రాధిక పెళ్లి వేళ.. ధీరూభాయ్ అంబానీకి ముఖేష్ అంబానీ నివాళులు

ధీరూభాయ్ అంబానీ జూలై 6, 2002న కన్నుమూశారు. ముఖేష్ అంబానీ, ఆయన సోదరుడు అనిల్ అంబానీ తరచుగా కుటుంబ ప్రత్యేక సందర్భాలలో తమ ...

Batti gul meter chalu trailer launch: shahid kapoor and shraddha kapoor make a fashionable entry

Shahid Kapoor and Shraddha Kapoor &nbsp We still remember the buzz Shahid Kapoor and Shraddha Kapoor stirred with th...

Top