Sitaare zameen par: ఆమిర్‌ఖాన్‌ కొత్త చిత్రం.. బాయ్‌కాట్‌ అంటోన్న నెటిజన్లు

Eenadu

Sitaare zameen par: ఆమిర్‌ఖాన్‌ కొత్త చిత్రం.. బాయ్‌కాట్‌ అంటోన్న నెటిజన్లు"

Play all audios:

Loading...

ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’ (Sitaare Zameen Par). ఈ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేయాలంటూ నెటిజన్లు వరుస పోస్టులు పెడుతున్నారు. ముంబయి:


బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’ (Sitaare Zameen Par). స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో ఆర్‌.ఎస్‌ ప్రసన్న


రూపొందిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. దీనిపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాస్కెట్‌బాల్‌ కోచ్‌ గుల్షన్‌ పాత్రలో ఆమిర్‌ ఖాన్‌ నటన బాగుందని,


ట్రైలర్‌లోని సన్నివేశాలు మనసుని హత్తుకునేలా ఉన్నాయని పలువురు అంటున్నారు. మరికొంతమంది మాత్రం  ‘ఛాంపియన్స్‌’తో దీనిని పోల్చి చూస్తున్నారు. ‘ఛాంపియన్స్‌’లోని సన్నివేశాలు ఈ ట్రైలర్‌లోని సీన్స్‌


ఒకేలా ఉన్నాయని కామెంట్స్‌ చేస్తున్నారు. ‘ఛాంపియన్స్‌’ను కాపీ కొట్టారంటూ విమర్శిస్తున్నారు. బాయ్‌కాట్‌ అంటోన్న నెటిజన్లు..: ‘సితారే జమీన్‌ పర్‌’ ట్రైలర్‌ విడుదల నేపథ్యంలోనే ఆమిర్‌ ఖాన్‌


పెట్టిన పోస్ట్‌ అంతటా చర్చకు దారి తీసింది. భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల వేళ మౌనంగా ఉన్న ఆమిర్‌ ఖాన్‌ ఈ సినిమా ట్రైలర్‌ విడుదలకు కొన్ని గంటల ముందు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ గురించి పోస్ట్‌ చేయడాన్ని


నెటిజన్లు తప్పుపడుతున్నారు. ‘‘ఎంతో కీలకమైన ఈ విషయం గురించి మీరు చాలా త్వరగా మాట్లాడారు కదా’’ అని కామెంట్స్‌ పెట్టారు. సినిమా ప్రమోషన్స్‌ కోసమే ఆయన ఇప్పుడు స్పందించారన్నారు. ఈ మేరకు ఆయన


నటించిన ఈ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేయాలంటూ ఎక్స్‌ వేదికగా వరుస సందేశాలు పెడుతున్నారు. * ‘కింగ్‌డమ్‌’ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే! ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ తర్వాత ఆమిర్‌ ఖాన్‌ నటిస్తోన్న


చిత్రమిది. 2018లో విడుదలైన స్పానిష్‌ చిత్రం ‘ఛాంపియన్స్‌’ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారు. దివ్య నిధి శర్మ కథ అందించారు. ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.


జెనీలియా కీలక పాత్రలో నటిస్తున్నారు. బాస్కెట్‌బాల్‌ కోచ్‌ అయిన గుల్షన్‌ (ఆమిర్‌ఖాన్‌) మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న కొంతమందిని ప్లేయర్స్‌గా తీర్చిదిద్దాల్సి వస్తుంది? మరి గుల్షన్‌ వాళ్లకు


ఎలా శిక్షణ ఇచ్చాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? అన్నది చిత్ర కథ. జూన్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Trending News

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌పై నీలినీడలు

ఇప్పటికే 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు స్తంభించిపోగా, నిధుల లేమి కారణంగా ఆగిపోయిన రెండో దశ పనులు  పూర్తవుతాయా అనే సందేహం నెలక...

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

Game changer: ‘గేమ్‌ఛేంజర్‌’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్‌ కీలక వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

Latests News

Sitaare zameen par: ఆమిర్‌ఖాన్‌ కొత్త చిత్రం.. బాయ్‌కాట్‌ అంటోన్న నెటిజన్లు

ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’ (Sitaare Zameen Par). ఈ చిత్రాన...

Katrina kaif and vicky kaushal: నెల‌కు రూ. 8ల‌క్ష‌ల అద్దె.. కొత్త జంట ఎక్క‌డ ఉండ‌బోతుందో తెలుసా?

Published by: Last Updated:December 07, 2021 4:44 PM IST KATRINA KAIF AND VICKY KAUSHAL: బాలీవుడ్‌ (BOLLYWOOD) లో విక్కీ...

Anant ambani and radhika merchant's wedding: అనంత్, రాధిక పెళ్లి వేళ.. ధీరూభాయ్ అంబానీకి ముఖేష్ అంబానీ నివాళులు

ధీరూభాయ్ అంబానీ జూలై 6, 2002న కన్నుమూశారు. ముఖేష్ అంబానీ, ఆయన సోదరుడు అనిల్ అంబానీ తరచుగా కుటుంబ ప్రత్యేక సందర్భాలలో తమ ...

Batti gul meter chalu trailer launch: shahid kapoor and shraddha kapoor make a fashionable entry

Shahid Kapoor and Shraddha Kapoor &nbsp We still remember the buzz Shahid Kapoor and Shraddha Kapoor stirred with th...

Astrology ఈ రాశుల వారికి త్వరలో విదేశి యానం యోగం.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Top