Miss canada: పాతబస్తీ అగ్నిప్రమాద ఘటన.. హృదయం బరువెక్కింది: మిస్‌ కెనడా

Eenadu

Miss canada: పాతబస్తీ అగ్నిప్రమాద ఘటన.. హృదయం బరువెక్కింది: మిస్‌ కెనడా"

Play all audios:

Loading...

హైదరాబాద్‌: చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌హౌజ్‌ చౌరస్తా వద్ద ఓ భవనంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై మిస్‌ కెనడా ఎమ్మా మారిసన్‌ (Miss Canada Emma Morrison)


స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ప్రమాదం వార్త విని తన గుండె బద్దలైందన్నారు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె భావోద్వేగభరిత పోస్ట్‌ పెట్టారు. ‘‘పాతబస్తీ అగ్నిప్రమాద ఘటన (Old City


Fire Accident)లో 17 మంది ప్రాణాలు కోల్పోయారన్న వార్త విని నా హృదయం బరువెక్కింది. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండటం మరింత బాధాకరం. ఈ ప్రమాదం కారణంగా ఆయా కుటుంబాలు ఎదుర్కొంటున్న బాధ వర్ణణాతీతం.


పోటీల కోసం భారత్‌కు వచ్చిన మమ్మల్ని ఈ ప్రాంత వాసులు చాలా ఆత్మీయంగా, సాదరంగా ఆహ్వానించారు. ఇప్పుడు వారు తీవ్ర వేదనలో ఉండటం చూసి నా గుండె బద్దలైంది. ఈ విషాద ఘటనలో ప్రియమైన వారిని కోల్పోయిన


కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుటుంబాల కోసం మనమంతా ప్రార్థిద్దాం’’ అని మిస్‌ కెనడా ఎమ్మా విచారం వ్యక్తంచేశారు. * ఏం జరిగింది?ఎలా జరిగింది?..


పాతబస్తీలో అగ్నిప్రమాదంపై అధికారుల దర్యాప్తు ఎమ్మా మారిసన్‌ ప్రపంచ సుందరి పోటీల్లో కెనడా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం మిస్‌ వరల్డ్‌ పోటీల నిమిత్తం ఆమె హైదరాబాద్‌లోనే ఉన్నారు.


ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముత్యాల వ్యాపారి ప్రహ్లాద్‌ మోదీ నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఆయన కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందారు. షార్ట్‌


సర్క్యూట్‌ కారణంగా ఏసీలు పేలి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.


Trending News

Trump-musk: ఆ విషయంలో మస్క్‌ కత్తి వాడాలి.. గొడ్డలి కాదు: ట్రంప్‌

వృథా ఖర్చులను అరికట్టే సాకుతో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారంటూ మస్క్‌పై వస్తున్న విమర్శలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ...

తొలుత లాభాలు- తుదకు నష్టాలు

కోవిడ్‌-19 సృష్టిస్తున్న కల్లోలంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనట్లు ఆర్‌బీఐ తాజాగా పేర్కొంది. దీంతో ఆర్థిక పురోగతికి వీలుగా రె...

Technology | latest tech news today - eenadu

ఐఫోన్‌ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్‌ కొన్నారా? పాత ఐఫోన్‌ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...

హలో.. మేము ఏసీబీ!  

నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడుతున్న పోలీసులు అధికారులు కర్నూలు (టౌన్‌): ‘హలో..  నేను ఏసీబీ డీఎస్పీ..  విజ...

‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగు

సాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రె...

Latests News

Miss canada: పాతబస్తీ అగ్నిప్రమాద ఘటన.. హృదయం బరువెక్కింది: మిస్‌ కెనడా

హైదరాబాద్‌: చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌హౌజ్‌ చౌరస్తా వద్ద ఓ భవనంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ...

Operation sindoor: ఈసారి భారత్‌ ఏం చేస్తుందో పాకిస్థాన్‌కు తెలుసు - వైస్‌ అడ్మిరల్‌

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)ను పాక్‌ సైన్యం దాటలేదని భారత త్రివిధ దళాలు స్పష్టంచేశాయి. ఆపరేషన్‌ సమయంలో లక్ష్యాలను ...

Robinhood: నితిన్‌ ‘రాబిన్‌హుడ్‌’ వచ్చేస్తోంది..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సంక్రాంతి వస్తున్నాం’, తదితర చిత్రాలను ఒకే సమయంలో అటు ఛానల్‌లో, ఇటు ఓటీటీలోకి తీసుకొచ్చింది ‘జీ 5’ ...

Israel-hamas: ఆగని మృత్యఘోష.. గాజాలో 60 మంది మృతి

డెయిర్‌ అల్‌-బలా: ఇజ్రాయెల్‌ భారీగా దాడులకు పాల్పడుతుండడంతో గాజాలో మరణమృదంగం మోగుతోంది. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో పాలస్తీన...

Prakasam | latest news on prakasam district - eenadu

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, w...

Top