Kcr: మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు
Kcr: మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు"
Play all audios:
హైదరాబాద్: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, భాజపా ఎంపీ ఈటల రాజేందర్‌కూ జారీ చేసింది. 15 రోజుల్లో
కమిషన్ ఎదుట హాజరుకావాలని పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హరీశ్‌రావు
నీటిపారుదల శాఖ మంత్రి, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ జూన్ 5న, హరీశ్‌రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న విచారణకు
హాజరుకావాలని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో దీంతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్.. నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీకంట్రోల్, పే అండ్ ఎకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల
ఉన్నతాధికారులు, నిర్మాణసంస్థల ప్రతినిధులు.. ఇలా అందరినీ విచారించింది. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్లుగా ప్రభుత్వం 7 సార్లు కమిషన్ గడువును పొడిగించింది. గత నెలాఖరులో ఒక నెల మాత్రమే గడువు
పొడిగించింది. దీనిప్రకారం ఈ నెలాఖరుకు కమిషన్ గడువు పూర్తికావాలి. ఈ నెల 21న లేదా 22న జస్టిస్ పీసీ ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారనే ప్రచారం జరిగింది. అయితే విచారణలో.. సీనియర్
ఇంజినీర్లు, అధికారుల్లో ఎక్కువమంది గత ముఖ్యమంత్రి సమక్షంలో నిర్ణయాలు జరిగాయని, ఆయన ఆదేశాల మేరకే పలు నిర్ణయాలను అమలుచేశామని చెప్పిన నేపథ్యంలో.. వీటిపై కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ల
అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలనే నిర్ణయంతో కమిషన్ ఉన్నట్లు సమాచారం.
Trending News
Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలిమరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...
Archana Udaranga – MediumTOP 10 TYPESCRIPT TIPS TODAY I’M GOING TO DISCUSS THE TOP 10 TYPESCRIPT TIPS EVERYONE SHOULD KNOW BEFORE TYPESCRIPT PROG...
Bjp fields sriramulu in badami, to take on siddaramaiahReports say that in Badami, which has a voter base of 2.5 lakh people, 55,000 are from the CM’s own Kuruba community. An...
పంట నష్టం అంచనాలో వ్యవసాయ శాఖపశ్చిమ గోదావరి జిల్లా ముక్కామలలో నీట మునిగిన పంటలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వరదలతో పంట...
Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..Russia | ఇంటర్నెట్‌డెస్క్: రష్యాలోని బ్రయాన్స్క్‌లో వంతెన కూలి రైలు బోల్తాపడిన ఘటన చోటు చేసుకుని 24 గంటలు గడవక ముందే.. అ...
Latests News
Kcr: మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులుహైదరాబాద్: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు మాజీ మంత్ర...
Actress: అక్క మాజీ మిస్ ఇండియా, బావ సూపర్ స్టార్.. టీవీ షో ప్రమోషన్ కోసం స్టార్ హీరోయిన్ పాట్లుశిల్పాశిరోద్కర్ తో పాటు బిగ్ బాస్ 18లో నైరా బెనర్జీ, అవినాష్ మిశ్రా, వివియన్ ద్సేనా, షెహజాదా ధామి, గుణరత్న, సారా అర్ఫిన్...
R ashwin: రోహిత్‌ను టార్గెట్ చేశారని విమర్శలు.. సమాధానమిచ్చిన అశ్విన్ఇంటర్నెట్ డెస్క్: ఓటమే లేకుండా అద్భుత ప్రదర్శన కొనసాగించిన టీమ్‌ఇండియా మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Troph...
Ola electric shares: 52 వారాల కనిష్ఠానికి ఓలా ఎలక్ట్రిక్ షేర్లు.. కారణం ఇదే..Ola Electric shares | దిల్లీ: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ (Ola Electric) షేర్ల...
Naucandi Latest News in Hindi, Photos, Videos on Naucandi InextLive Jagraninextlive के साथ रहिए खबरों की दुनिया से जुड़े। यहां पढ़िए Naucandi से जुड़ी हिन्दी न्यूज़ Naucandi Hindi News और ताजा ख...