Mock drill: మాక్‌డ్రిల్‌ అలర్ట్‌ 2 నిమిషాల పాటు సైరన్‌ మోగుతుంది: సీవీ ఆనంద్‌

Eenadu

Mock drill: మాక్‌డ్రిల్‌ అలర్ట్‌ 2 నిమిషాల పాటు సైరన్‌ మోగుతుంది: సీవీ ఆనంద్‌"

Play all audios:

Loading...

మాక్‌డ్రిల్‌ నిర్వహణకు హైదరాబాద్‌ అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ సాయంత్రం 4గంటల నుంచి ఐసీసీసీ నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారందరికీ మెసేజ్‌ వెళ్తుందని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌


వెల్లడించారు. హైదరాబాద్‌: మాక్‌డ్రిల్‌ నిర్వహణకు హైదరాబాద్‌ అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ సాయంత్రం 4గంటల నుంచి ఐసీసీసీ నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారందరికీ మెసేజ్‌ వెళ్తుందని నగర పోలీస్‌


కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. రెండు నిమిషాల పాటు సైరన్‌ మోగుతుందని చెప్పారు. ఈ సైరన్‌ మోగిన వెంటనే ప్రజలు స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్న


ఆయన.. అత్యవసర పరిస్థితి వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన విధానంపై అవగాహన కోసమే ఈ మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై ప్రజల్ని


మానసికంగా సన్నద్ధం చేయడమే దీని ఉద్దేశమన్నారు.  బయటకు రావొద్దు.. సురక్షిత ప్రదేశంలోనే ఉండండి! ‘‘సైరన్‌ మోగిన వెంటనే ప్రజలు ఇళ్లల్లో ఉంటే ఇంటికే పరిమితం కావాలి. బయటకు రావొద్దు. బయట ఉన్నవారు


సమీప ప్రాంతంలో ఏవైనా నిర్మాణాల్లోకి వెళ్లాలని కోరుతున్నాం. వాహనాలపై ప్రయాణిస్తున్న వారైతే తమ వాహనాలను పార్క్‌ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. ప్రజల్ని అప్రమత్తం చేయడానికే ఈ


మాక్‌డ్రిల్‌. 15 నిమిషాల తర్వాత మరో మెసేజ్‌ ఐసీసీసీ నుంచి వెళ్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇలాంటి ఘటన జరిగిన సందర్భంలో సివిల్‌ డిఫెన్స్‌ పరంగా ప్రభుత్వ విభాగాల అప్రమత్తత ఎలా ఉందో చెక్‌


చేయడానికి నాలుగు ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్‌ జరుగుతుంది. గోల్కొండలోని నానల్‌నగర్‌, కంచన్‌బాగ్‌, సికింద్రాబాద్‌, ఈసీఐఎల్‌ ఎన్‌ఎఫ్‌సీలలో జరిగే మాక్‌ డ్రిల్‌లో పోలీస్‌ , ట్రాఫిక్‌, హెల్త్‌,


రెవెన్యూ, ఫైర్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, రవాణా విభాగాలు పాల్గొంటాయి. వారు వ్యవహరించాల్సిన తీరుపై ఆదేశాలు వెళ్తాయి. మొత్తం ప్రక్రియకు ఐసీసీసీ ఒక నోడల్‌ సెంటర్‌గా ఉంటుంది. ఐసీసీసీ


నుంచి పరిస్థితిని మానటరింగ్‌ చేస్తాం. రాబోయే కొన్ని రోజుల పాటు సంబంధిత విభాగాల్లో ఎవరూ సెలవులు తీసుకోవద్దని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. భద్రతా దళాలకు సంఘీభావం తెలుపుతూ గురువారం ర్యాలీ


నిర్వహిస్తాం’’ అని సీవీ ఆనంద్‌ వివరించారు.


Trending News

Jyoti malhotra: ‘పాక్‌లో నన్ను పెళ్లి చేసుకో’.. జ్యోతి మల్హోత్రా చాటింగ్‌ లీక్‌

తనను పెళ్లి చేసుకోవాలని పాకిస్థాన్‌ హైకమిషన్‌కు చెందిన ఓ వ్యక్తిని యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా కోరింది. ఇందుకు సంబంధించి...

North korea | latest north korea - eenadu

రష్యా, ఉత్తర కొరియాలపై ట్రంప్‌ సుంకాల్లేవ్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల నుంచి రష్యా, ...

Anand deverakonda: శ్రీనిధి కాలేజ్ ఫెస్ట్‌‌లో బేబీ మూవీ టీమ్ సందడి.. స్టూడెంట్ హ్యుజ్ రెస్పాన్స్

Published by: Last Updated:April 25, 2023 2:12 PM IST BABY TEAM: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్ల...

Praggnanandhaa | latest praggnanandhaa - eenadu

PRAGGNANANDHAA: అమ్మ దిద్దిన ప్రజ్ఞ అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో చెస్‌ ప్రపంచకప్‌ జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి...

విస్తరిస్తున్న నోకియా: త్వరలో మరిన్ని ఉత్పత్తులు

సాక్షి, ముంబై: ప్రముఖ సంస్థ నోకియా వ్యాపార విస్తరణలో దూకుడును ప్రదర్శిస్తోంది. భారతదేశంలో, నోకియా స్మార్ట్  టీవీలు, ఏసీల...

Latests News

Mock drill: మాక్‌డ్రిల్‌ అలర్ట్‌ 2 నిమిషాల పాటు సైరన్‌ మోగుతుంది: సీవీ ఆనంద్‌

మాక్‌డ్రిల్‌ నిర్వహణకు హైదరాబాద్‌ అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ సాయంత్రం 4గంటల నుంచి ఐసీసీసీ నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలోన...

Astrology: 2023 జనవరి వరకు వీరికి అద్భుతంగా ఉంటుంది.. శని దయతో అన్నీ విజయాలే

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Revanth reddy: కాళేశ్వరం ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

కాళేశ్వరం ఆలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం...

Pm modi: త్రివిధ దళాల అధిపతులతో మోదీ హైలెవల్‌ మీటింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈనేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధ...

Ragananthini vethasalam | the malaysian insight

Saturday, 08 Jan 2022 07:00 AM BUSINESSES STILL WEATHERING HEADWINDS TO STAY AFLOAT __ Companies will take awhile to reb...

Top