Ipl 2025: మళ్లీ మొదటి నుంచి పంజాబ్, దిల్లీ మ్యాచ్
Ipl 2025: మళ్లీ మొదటి నుంచి పంజాబ్, దిల్లీ మ్యాచ్"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ (IPL)ను మే 17 నుంచి పున: ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆరు వేదికల్లో (బెంగళూరు, జైపుర్,
దిల్లీ, లఖ్‌నవూ, అహ్మదాబాద్, ముంబయి) లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ జూన్ 3న జరుగుతుంది. ప్లే ఆఫ్స్ వేదికలను త్వరలో ప్రకటిస్తారు. ఇక, ఈ నెల 8న ధర్మశాల వేదికగా పంజాబ్, దిల్లీ (PBKS vs
DC) మ్యాచ్ జరగాల్సి ఉండగా.. పంజాబ్ (Punjab Kings) ఇన్నింగ్స్‌లో 10.1 ఓవర్ల ఆట తర్వాత మ్యాచ్‌ను అర్ధంతరంగా రద్దు చేశారు. భద్రతా కారణాల రీత్యా ఈ మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు. సాధారణంగా
మ్యాచ్ రద్దయితే ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. కానీ, ఈ రెండు టీమ్‌లకు పాయింట్లను కేటాయించకపోవడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. అయితే, కొత్తగా ప్రకటించిన షెడ్యూల్‌తో దీనిపై
క్లారిటీ వచ్చింది. మే 24న జైపుర్ వేదికగా పంజాబ్, దిల్లీ మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలో జరిగిన 10.1 ఓవర్ల ఆటతో సంబంధం లేకుండా మళ్లీ మొదటి నుంచి మ్యాచ్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఒకరకంగా పంజాబ్‌కు ఇబ్బంది కలిగించే విషయమే. ఎందుకంటే ధర్మశాలలో ఆ జట్టు 10.1 ఓవర్లు పూర్తి అయ్యేసరికి ఒకే వికెట్ నష్టపోయి 122 పరుగులు చేసింది. ఇప్పుడు మళ్లీ మొదటి బంతి నుంచి మ్యాచ్ ఆడితే
పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. పంజాబ్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 15 పాయింట్లతో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం ఖాయం. అహ్మదాబాద్‌లో ఫైనల్?
ఏప్రిల్ 29న క్వాలిఫయర్-1, 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే, ఈ మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలను అధికారికంగా ఖరారు చేయలేదు. ముంబయిలో ప్లే ఆఫ్
మ్యాచ్, అహ్మదాబాద్‌లో ఫైనల్ నిర్వహించే అవకాశమున్నట్లు వార్తలొస్తున్నాయి.
Trending News
Ekadanta sankashti chaturthi 2023: date, timings, significance and ritualsKrishna Paksha Chaturthi tithi of Jyeshtha month is called 'Ekadanta Sankashti Chaturthi'. Worshipping Lord Ga...
Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...
Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bailKOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...
Pawan kalyan - shruti hassan: పవన్ కల్యాణ్ ఆ విషయంలో తోపు అంటున్న శ్రుతి!Published by: Last Updated:February 27, 2021 9:59 PM IST PAWAN KALYAN - SHRUTI HASSAN: మీరేమైనా చెప్పండి! ఎన్నయినా చెప్...
Arjun kapoor and parineeti chopra wrap up punjab schedule of namaste englandArjun Kapoor, Parineeti Chopra on the poster of Namaste England  The much-loved pair of _Ishaqzaade_ - Arjun Kap...
Latests News
Ipl 2025: మళ్లీ మొదటి నుంచి పంజాబ్, దిల్లీ మ్యాచ్ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ (IPL)ను మే 17 నుంచి పున: ప్రారంభించాలని...
Revanth reddy: ఇందిర సౌర గిరి జల వికాసం.. రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు: సీఎం రేవంత్అమ్రాబాద్: ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకంలో భాగంగా రైతులకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (Re...
దైవ దర్శనాలకు ట్రయల్ రన్రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో దర్శనానికి భక్తులను అనుమతించే క్రమంలో సోమవారం నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. ఆలయాల ...
Bhargavastra: మన భార్గవాస్త్రం సిద్ధం.. శత్రు డ్రోన్ల దండుకు గండం..Bhargavastra: డ్రోన్ల సమూహాన్ని పక్కాగా ఛేదించే స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించారు...
Paris olympics 2024: వినేష్ ఫోగట్‌పై వేటు.. వైరలవుతున్న ప్రధాని మోదీ రియాక్షన్..Published by: Last Updated:August 07, 2024 3:18 PM IST PARIS OLYMPICS 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు భారీ షాక్...