Asia cup 2025: ఆసియా కప్‌నకు దూరమంటూ వార్తలు.. ఖండించిన బీసీసీఐ

Eenadu

Asia cup 2025: ఆసియా కప్‌నకు దూరమంటూ వార్తలు.. ఖండించిన బీసీసీఐ"

Play all audios:

Loading...

ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్‌ (Asia Cup 2025) టోర్నీ నుంచి టీమ్‌ఇండియా వైదొలగాలని నిర్ణయించినట్లు వార్తలు రాగా.. వీటిని బీసీసీఐ ఖండించింది. ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల భారత్‌, పాకిస్థాన్‌ మధ్య


(INDIA vs PAKISTAN) నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్‌ (Asia Cup 2025) టోర్నీ నుంచి టీమ్‌ఇండియా వైదొలగాలని నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. అయితే, వీటిని బీసీసీఐ


ఖండించింది. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే పురుషుల ఆసియా కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన టీమ్‌ఇండియా ఆడే అవకాశాలు లేవని ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాకుండా జూన్‌ నెలలో జరిగే మహిళల


ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ నుంచి కూడా వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆసియా క్రికెట్‌ మండలికి పాకిస్థాన్‌ మంత్రి, పీసీబీ ఛైర్మన్‌ మోసిన్‌ నఖ్వీ అధ్యక్షుడిగా


ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది.  ‘ఈ రోజు ఉదయం నుంచి ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీల్లో  


పాల్గొనకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు జరుగుతున్న ప్రచారం మా దృష్టికి వచ్చింది. అటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇప్పటి వరకు బీసీసీఐ ఏసీసీ ఈవెంట్‌ల గురించి చర్చించలేదు. ప్రస్తుతం మా


దృష్టి అంతా ఐపీఎల్‌ను సజావుగా నిర్వహించడం, టీమ్‌ఇండియా పురుషుల, మహిళల జట్ల ఇంగ్లాండ్ పర్యటనపైనే ఉంది. ఆసియా కప్ విషయం లేదా మరేదైనా ఏసీసీ ఈవెంట్ గురించి ఏ స్థాయిలోనూ చర్చ జరగలేదు. దీని


గురించి ఏవైనా వార్తలు వస్తే అవన్నీ పూర్తిగా ఊహాజనితం. ఏసీసీ ఈవెంట్‌ గురించి ఏదైనా చర్చగాని, ముఖ్యమైన నిర్ణయంగాని తీసుకుంటే మీడియాకు వెల్లడిస్తాం’ అని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా


తెలిపారు.


Trending News

Technology | latest tech news today - eenadu

ఐఫోన్‌ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్‌ కొన్నారా? పాత ఐఫోన్‌ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగు

సాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రె...

India operations: ఆపరేషన్‌ ‘మేఘ్‌దూత్‌ నుంచి సిందూర్‌’ వరకు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌పై దశాబ్దాలుగా వివాదాన్ని కొనసాగిస్తున్న పాకిస్థాన్‌ (Pakistan).. సీమాంతర ఉగ్రవాదాన్ని ...

Latests News

Asia cup 2025: ఆసియా కప్‌నకు దూరమంటూ వార్తలు.. ఖండించిన బీసీసీఐ

ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్‌ (Asia Cup 2025) టోర్నీ నుంచి టీమ్‌ఇండియా వైదొలగాలని నిర్ణయించినట్లు వార్తలు రాగా.. వీటిని బీ...

Mari selvaraj's vaazhai to have direct ott release: reports - news18

Curated By : Last Updated:November 21, 2023, 17:36 IST VAAZHAI STARS KALAIYARASAN, NIKHILA VIMAL, DHIVYA DURAISAMY AND P...

హలో.. మేము ఏసీబీ!  

నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడుతున్న పోలీసులు అధికారులు కర్నూలు (టౌన్‌): ‘హలో..  నేను ఏసీబీ డీఎస్పీ..  విజ...

ఆలయంలో బెంబేలెత్తించిన బాబా..  

భువనేశ్వర్‌/పూరీ : జగతినాథుని దర్శనం కోసం భక్తజనం తహతహలాడుతోంది. ఈనెల 23 నుంచి అంచెలంచెలుగా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్...

Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/05/2025)

మేషం చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యమవుతాయి. శ్రమ అధికమౌతుంది. కీలక విషయాల్లో సమయస్ఫూర్తిగా ఆలోచించాలి. ఆరోగ్యాన్ని కాపాడు...

Top