Saw vs indw: ముక్కోణపు వన్డే సిరీస్‌.. సౌతాఫ్రికాపై విజయం.. ఫైనల్‌కు భారత్

Eenadu

Saw vs indw: ముక్కోణపు వన్డే సిరీస్‌.. సౌతాఫ్రికాపై విజయం.. ఫైనల్‌కు భారత్"

Play all audios:

Loading...

కొలంబో: శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు ఫైనల్‌కు చేరింది. ఇవాళ సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 23 పరుగుల తేడాతో విజయం


సాధించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన సౌతాఫ్రికా.. శ్రీలంకతో జరగాల్సి ఉన్న సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌లో గెలిచినా ఫైనల్‌కు చేరదు. ఆదివారం జరగనున్న ఫైనల్‌లో శ్రీలంకతో భారత్‌ తలపడనుంది. మ్యాచ్


విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. జేమిమా రోడ్రిగ్స్ (123; 101 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ బాదేసింది. దీప్తి


శర్మ (93; 84 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం అవకాశాన్ని చేజార్చుకుంది. స్మృతి మంధాన (51; 63 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ శతకం చేసింది.  భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా పోరాడి ఓడింది. 50


ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. అన్నరీ డెర్క్సెన్ (81; 80 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), క్లో ట్రయాన్ (67; 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) రాణించారు. మియాన్ స్మిత్


(39), నొందుమిసో షాంగసే (36), తజ్మిన్ బ్రిట్స్ (26), నాడిన్ డి క్లర్క్ (22*), సినాలో జాఫ్తా (21) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అమన్‌జ్యోత్ కౌర్ 3, దీప్తి శర్మ 2... శ్రీ చరణి, ప్రతీకా రావల్


ఒక్కో వికెట్ పడగొట్టారు.


Trending News

Italy: ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటలీ (Italy)లోని సిసిలీ తూర్పు తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం (Mount Etna volcano) ఒక్కసారిగా బద్ద...

Aita under-16 tennis: pranav, amodini emerge champions

Bengaluru, Feb 19 : Rethin Pranav and Amodini Vijay, seeded No.4 in the boys and girls respectively, emerged champions i...

Ali: రాజేంద్ర ప్రసాద్‌ ఉద్దేశపూర్వకంగా అనలేదు: అలీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనపై రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని అలీ (Ali) అభిప్రాయపడ్డార...

Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులు

పిఠాపురంలో రేషన్‌ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో స...

Stock market: భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

Stock Market| ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా భారీ నష్టాల్లో ట్...

Latests News

Saw vs indw: ముక్కోణపు వన్డే సిరీస్‌.. సౌతాఫ్రికాపై విజయం.. ఫైనల్‌కు భారత్

కొలంబో: శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు ఫైనల్‌కు చేరింది. ఇవాళ సౌతాఫ్రిక...

Naina ganguly : అర్థనగ్న ఫోటోషూట్‌లతో నైనా గంగూలీ అందాల అరాచకం...

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Bangladesh: బంగ్లాదేశ్‌లోనూ ఆర్థిక సంక్షోభం మొదలైందా?.. అదే సంకేతమా?

Published by: Last Updated:July 29, 2022 4:16 PM IST BANGLADESH: బంగ్లాదేశ్ ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేం...

Afrika bambaataa's universal zulu nation change leadership

The Universal Zulu Nation announced Friday that they have undergone extensive changes in their leadership a month after ...

Gaddar film awards: ‘గద్దర్‌’ అవార్డులు: ఉత్తమ చిత్రం కల్కి.. ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను (Gaddar Film Awards) జ్యూరీ ఛైర్‌పర...

Top