Rajat patidar: ఈ ట్రోఫీకి అందరికంటే ఎక్కువ అర్హుడు కోహ్లీనే: రజత్ పటీదార్
Rajat patidar: ఈ ట్రోఫీకి అందరికంటే ఎక్కువ అర్హుడు కోహ్లీనే: రజత్ పటీదార్"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఐపీఎల్ (IPL) ఛాంపియన్‌గా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru). ఈసారి కొత్త కెప్టెన్‌గా వచ్చిన రజత్ పటీదార్
(Rajat Patidar).. ఆ జట్టు చిరకాల స్వప్నాన్ని సాకారం చేశాడు. దీంతో ఆర్సీబీ (RCB) అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక జట్టు విజయంపై రజత్ పటీదార్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ (Virat
Kohli)ని ఆకాశానికెత్తాడు. ఇది తనకు లభించిన గొప్ప అవకాశమని పేర్కొన్నాడు. ‘‘విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకోవడానికి ఇది నాకు లభించిన గొప్ప అవకాశం. ఐపీఎల్‌లో ఈ ట్రోఫీని పొందడానికి ఇతరుల కంటే
ఎక్కువగా విరాట్ కోహ్లీ అర్హుడు. ఎందుకంటే 18 సీజన్లుగా ఒకే ఫ్రాంచైజీకి అతడు ఆడుతున్నాడు’’ అని పటీదార్ అన్నాడు. ‘‘ఈ విజయం నాకు, విరాట్ కోహ్లీకి, మా జట్టు అభిమానులకు నిజంగా ఎంతో ప్రత్యేకం.
అభిమానులు మాకు సంవత్సరాలుగా మద్దతు ఇస్తున్నారు. ఇక స్లో పిచ్‌పై 190 పరుగులు కూడా మంచి స్కోరే. ఓ సమయంలో ఈ పిచ్‌పై మా బ్యాటర్లు పరుగులు త్వరగా ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నలు వచ్చాయి. అయితే.. ఆ
తర్వాత పంజాబ్ కూడా ఈ పిచ్‌పై ఇబ్బంది పడింది. మా బౌలర్లు జట్టు ప్రణాళికలను చక్కగా అమలు చేశారు’’ అని పటీదార్ తెలిపాడు. ఇక రెండు వికెట్లు తీసి పంజాబ్‌ను నిలువరించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
కృనాల్ పాండ్య బౌలింగ్‌పై కూడా పటీదార్ ప్రశంసల వర్షం కురిపించాడు.
Trending News
NTR Biopic Kathanayakudu movie review: Nandamuri Balakrishna-Vidya Balan stand out completely but that's itIt’s no secret that NT Rama Rao is a legend who not only ruled Indian cinema but was also famous for his philanthropist ...
Dhaula kuan remains delhi's nightmareThanks to crowds from the metro station, bus stops, road dividers, the stretch is one of the slowest but most important ...
Vishal Krishna's 'Poojai' slated for Diwali releaseHow much salary did Gautam Adani draw this year? Here's how it compares with Mukesh Ambani, Sunil Mittal, Rajiv Bajaj, o...
Fd rates: ఈ బ్యాంకులో ఎఫ్‌డీలపై 7. 80 శాతం వడ్డీ..స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందించడంలో ముందున్నాయి. యూనిటీ బ్యాంకు ఎంతిస్తుందంటే.. ఇ...
Pm modi: ఇది పేదల ప్రభుత్వం.. ఆత్మనిర్భర్‌కు కట్టుబడ్డాం: ప్రధాని మోదీఇంటర్నెట్డెస్క్: పేద ప్రజల సంక్షేమానికి ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సామాజిక మాధ్యమం...
Latests News
Rajat patidar: ఈ ట్రోఫీకి అందరికంటే ఎక్కువ అర్హుడు కోహ్లీనే: రజత్ పటీదార్ఇంటర్నెట్ డెస్క్: 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఐపీఎల్ (IPL) ఛాంపియన్‌గా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Chall...
Ishana night shyamalan archivos - zelebpor Antonio Sánchez | Feb 18, 2023 | People & Trends Parece que a M. Night Shyamalan le ha salido competencia en su ...
Wealth report: భారత్‌లో ధనికులు @ 85 వేలు.. బిలియనీర్లు ఎంతమందంటే?Wealth Report | దిల్లీ: దేశంలో ధనికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 10 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారి సంఖ్య 20...
Andhra pradesh news: గ్రేడ్ 2 మున్సిపాలిటీలుగా గిద్దలూరు, ఎర్రగుంట్లరాష్ట్రంలో పలు నగర పంచాయతీలు, మున్సిపాలిటీల స్థాయిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి: రాష్ట్రంలో పలు ...
Tspsc new notification: గుడ్ న్యూస్.. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల..Published by: Last Updated:December 23, 2022 8:28 PM IST నిరుద్యోగులకు శుభవార్త. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడు...