Ipl 2025: ఐపీఎల్‌ అభిమానులకు శుభవార్త.. క్వాలిఫయర్‌- 1 మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం లేనట్లే

Eenadu

Ipl 2025: ఐపీఎల్‌ అభిమానులకు శుభవార్త.. క్వాలిఫయర్‌- 1 మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం లేనట్లే"

Play all audios:

Loading...

మరి కొన్ని గంటల్లో క్వాలిఫయర్‌- 1లో పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వాన ముప్పు లేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ (IPL) 2025


సీజన్‌లో భాగంగా చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bengaluru) క్వాలిఫయర్‌- 1లో మరికొన్ని గంటల్లో


తలపడనున్నాయి. 11 సంవత్సరాల తర్వాత పంజాబ్‌ కింగ్స్‌.. శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) సారథ్యంలో మొదటిసారి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఈ జట్టు ఇంతకు ముందు చివరగా 2014లో ప్లేఆఫ్స్‌నకు


చేరుకుంది. మరో వైపు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ కూడా బలంగా కనిపిస్తోంది. క్వాలిఫయర్‌- 1 నేపథ్యంలో అభిమానులందరి కళ్లు వరుణుడి మీదే ఉన్నాయి. ఈ సీజన్‌లో వాన వల్ల పలు మ్యాచ్‌లు


ప్రభావితమ్యాయి. కానీ ఈ సారి అలాంటి ముప్పేమీ ఉండబోదని వాతావరణ శాఖ భరోసా ఇస్తోంది. ‘ముల్లాన్‌పూర్‌లో వర్షం కురిసే అవకాశాలు దాదాపు లేవు. ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలకు అటూఇటుగా నమోదయ్యే అవకాశం ఉంది.


మ్యాచ్‌ సమయంలో గాలి వీచే వేగం గంటకు 20కి.మీ.ల వరకు ఉండనుంది’ అని వాతావరణ నివేదిక చెబుతోంది. ఇవేవీ మ్యాచ్‌కు ఆటంకం కాదు. దీంతో పంజాబ్‌ కింగ్స్‌, ఆర్సీబీ మధ్య జరిగే రసవత్తర పోరును


వీక్షించాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్వాలిఫయర్‌ - 1 మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేని నేపథ్యంలో ఇది నిజంగా శుభపరిణామమే.  ఒక వేళ వర్షం కురిసి, మ్యాచ్‌ రద్దైతే మాత్రం పంజాబ్‌ కింగ్స్‌


నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. అప్పుడు ఆర్సీబీ.. ముంబయి, గుజరాత్‌ మధ్య జరగనున్న ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్‌- 2లో తలపడాల్సి వస్తుంది. అందులో గెలిస్తేనే ఫైనల్‌లో తలపడే అవకాశాన్ని


బెంగళూరు చేజిక్కించుకుంటుంది. క్వాలిఫయర్‌- 1 మ్యాచ్‌కు వర్ష సూచనలు లేకపోవడం ఒక విధంగా ఆర్సీబీకి కలిసి వచ్చే అంశమే. ఈ అవకాశాన్ని ఆర్సీబీ ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుందో మరి కాసేపట్లోనే


తేలనుంది.   


Trending News

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగు

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Latests News

Ipl 2025: ఐపీఎల్‌ అభిమానులకు శుభవార్త.. క్వాలిఫయర్‌- 1 మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం లేనట్లే

మరి కొన్ని గంటల్లో క్వాలిఫయర్‌- 1లో పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వాన ముప్పు ల...

Peru | WSCOM

Peru | WSCOM Menu PERU ------------------------- 04/07/2019 ------------------------- WSCOM PLAY...

Pralhad joshi: అంతర్గత కలహాలతో కాంగ్రెస్‌ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

నటి రన్యారావు కేసులో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై ఈడీ చేస్తున్న దాడులను ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్య...

Trump tariffs: ట్రంప్‌ టారిఫ్‌లకు కోర్టు బ్రేక్‌.. విచారణలో భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల ప్రస్తావన

వాషింగ్టన్‌: ‘లిబరేషన్‌ డే’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల...

Pak spy: జ్యోతి మల్హోత్రా గ్యాడ్జెట్లలో 12టెరా బైట్ల డేటా..

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Ma...

Top