Pralhad joshi: అంతర్గత కలహాలతో కాంగ్రెస్‌ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

Eenadu

Pralhad joshi: అంతర్గత కలహాలతో కాంగ్రెస్‌ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి"

Play all audios:

Loading...

నటి రన్యారావు కేసులో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై ఈడీ చేస్తున్న దాడులను ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్‌డెస్క్‌: నటి రన్యారావు (Ranya Rao) గోల్డ్‌


స్మగ్లింగ్‌ కేసులో కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర (G Parameshwara)కు చెందిన విద్యాసంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు జరిపిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర మంత్రి


ప్రహ్లాద్‌ జోషి  (Pralhad Joshi) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వర్గపోరుతో కాంగ్రెస్‌లోని కొందరు నేతలే పరమేశ్వరపై ఈడీకి ఫిర్యాదు చేశారన్నారు.  ‘‘కాంగ్రెస్‌లోని ఓ వర్గం పరమేశ్వరపై ఈడీకి


ఫిర్యాదు చేసి.. వారే ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. పరమేశ్వర మంచి నాయకుడు.. ఆయనపై మాకు గౌరవం ఉంది. కానీ, ఆ పార్టీలోనే ఫిర్యాదులు పంపే వ్యక్తులు ఉన్నారు. సీఎం సిద్ధరామయ్యకు ఈ విషయాలూ తెలుసు.


నిఘా విభాగం ఆయన కిందే ఉంది. ఇప్పుడు ఆయన కూడా డ్రామాలాడుతున్నారు. ఈడీకి సమాచారం ఉంది కాబట్టే పరమేశ్వరపై దాడులు చేస్తున్నారు తప్ప.. ఆయన కాంగ్రెస్‌ నాయకుడనో, హోంమంత్రి అనో కాదు’ అని ప్రహ్లాద్‌


జోషి పేర్కొన్నారు.  * బహుమతులతో గ్రహపాటు.. ఈడీ దాడుల వెనుక రన్యారావు వ్యవహారం? దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ నటి రన్యారావు కొన్ని రోజుల క్రితం అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆమె


వివాహ సమయంలో పరమేశ్వర రూ.25 లక్షల వరకు నగదు, బహుమతులను ఇచ్చారని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఛైర్మన్‌గా ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య


కళాశాలల్లో ఈడీ దాడులు చేసింది. రన్యారావుకు, కళాశాలకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో రన్యారావు వివాహానికి పరమేశ్వర బహుమతిగా నగదు ఇచ్చి


ఉండవచ్చని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తండ్రి ఐపీఎస్ అధికారి కావడం, పరమేశ్వర హోం మంత్రిగా ఉండడంతో ఆ అనుబంధంతో బహుమతి ఇస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు.


పరమేశ్వర ఎటువంటి తప్పు చేయరన్న నమ్మకం తనకు ఉందన్నారు.


Trending News

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగు

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Latests News

Pralhad joshi: అంతర్గత కలహాలతో కాంగ్రెస్‌ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

నటి రన్యారావు కేసులో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై ఈడీ చేస్తున్న దాడులను ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్య...

Trump tariffs: ట్రంప్‌ టారిఫ్‌లకు కోర్టు బ్రేక్‌.. విచారణలో భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల ప్రస్తావన

వాషింగ్టన్‌: ‘లిబరేషన్‌ డే’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల...

Pak spy: జ్యోతి మల్హోత్రా గ్యాడ్జెట్లలో 12టెరా బైట్ల డేటా..

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Ma...

Mani ratnam: నవీన్‌ పొలిశెట్టితో సినిమా? : స్పందించిన మణిరత్నం

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ నటుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా మణిరత్నం ఓ సినిమా చేసే అవకాశాలున్నాయంటూ...

Mea: తుర్కియేకి బలమైన సందేశం పంపాం - భారత్‌

పాకిస్థాన్‌కు మద్దతిస్తే సీమాంతర ఉగ్రవాదాన్ని తుర్కియే ప్రోత్సహించినట్లు భావించాల్సి వస్తుందనే సందేశాన్ని పంపించినట్లు భ...

Top