Hazlewood: భారత్-పాక్ వివాదంలో హేజిల్‌వుడ్.. ఏం జరిగింది?
Hazlewood: భారత్-పాక్ వివాదంలో హేజిల్‌వుడ్.. ఏం జరిగింది?"
Play all audios:
Hazlewood: ఆసీస్ క్రికెటర్ హేజిల్ వుడ్ ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. గుర్తు తెలీని వ్యక్తులు భారత్- పాక్ ఉద్రిక్తతల్లోకి ఆయన్ను లాగారు. Hazlewood | ఇంటర్నెట్ డెస్క్: భారత్- పాక్
మధ్య ఉద్రిక్తతలు ప్రస్తుతానికి చల్లారినప్పటికీ.. రాజకీయంగా మాత్రం ఆ వేడి ఇంకా కొనసాగుతోంది. మరోవైపు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల తలెత్తినప్పటి నుంచి ఫేక్ పోస్టుల పరంపర కొనసాగుతోంది. సామాజిక
మాధ్యమాల్లో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఫేక్‌న్యూస్ బారిన పడ్డారు. ఆ కామెంట్స్ భారత్‌కు అనుకూలంగా, పాక్‌కు
వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. ఫేక్ అని తెలీడంతో హేజిల్‌వుడ్ వ్యక్తిగత సిబ్బంది, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ టీమ్ తక్షణమే స్పందించాల్సి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఐపీఎల్
మ్యాచులను తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో హేజిల్‌వుడ్ సహా ఆసీస్ క్రికెటర్లంతా స్వదేశానికి పయనమయ్యారు. ఈ క్రమంలో హేజిల్‌వుడ్ పేరిట ఓ ఫేక్ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిప్పటికీ.. పాక్ ఉగ్రవాదులపై ధైర్యంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలకు మద్దతు ఇస్తున్నట్లు అందులో ఉంది. ‘మీ పోరాటం కేవలం భారత్ కోసమే కాదు.. సురక్షితమైన ప్రపంచం కోసం’
అనేది ఆ పోస్టు సారాంశం. ఈ ఫేక్‌న్యూస్‌పై ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై హేజిల్‌వుడ్ మేనేజర్ మీడియాకు వివరణ ఇచ్చారు. ఆయనకు ట్విటర్, ఇన్‌స్టా వంటి అధికారిక సోషల్‌మీడియా
ఖాతాలేవీ లేవని పేర్కొన్నారు. మరోవైపు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా తక్షణమే స్పందించింది. ఫేక్ అకౌంట్ నుంచి పోస్ట్‌ను డిలీట్ చేయించడంతో పాటు ఆ అకౌంట్‌ను కూడా
తొలగించేలా చేసింది.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Pakistan attack: ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి ప్రచారం నమ్మొద్దు: భారత రక్షణశాఖజమ్మూకశ్మీర్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులు జరిపినట్లు భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది. ఇంటర్న...
Murali naik: అమర వీరుడు మురళీనాయక్‌కు నివాళులర్పించిన మంత్రులు లోకేశ్, అనగానిదేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, అనిత నివాళులర్పించారు గో...
Vijayshanthi:‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు... చిరంజీవిని కూడా అన్నట్లే!భారత్‌లో అసహనం పెరిగిపోయిందని, ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల యక్రమంలో...
Latests News
Hazlewood: భారత్-పాక్ వివాదంలో హేజిల్‌వుడ్.. ఏం జరిగింది?Hazlewood: ఆసీస్ క్రికెటర్ హేజిల్ వుడ్ ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. గుర్తు తెలీని వ్యక్తులు భారత్- పాక్ ఉద్రిక్తతల...
Nirav modi: నీరవ్ మోదీకి మరోసారి యూకే కోర్టులో చుక్కెదురుభారతీయ బ్యాంకులను రూ.వేల కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి తాజాగా లండన్ కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస...
గుడిపేట శివారులో పులి సంచారంగుడిపేట అటవీ ప్రాంతంలో కనిపించిన పులి అడుగులు మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండలంలోని గుడిపేట అటవీ శివారు ప్రాంతంలో పులి అ...
Maruti suzuki: మారుతీ సుజుకీ కీలక నిర్ణయం.. ఆ కార్లలోనూ 6 ఎయిర్‌బ్యాగులుMaruti Suzuki | దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంట్రీ లెవల్ మోడ...
ఇకపై జిల్లాకు మరింత దగ్గరగా..సాక్షి, నెల్లూరు: ముఖ్యమంత్రి ఆలోచన పరిశ్రమల మంత్రి ఆచరణతో ఏపీలో పారిశ్రామిక విప్లవం ఊపందుకుంది. మంత్రి మేకపాటి ఇలాకాలో ...