Us education: పార్ట్ టైమ్ ఆలోచనొద్దు.. చదువులకోసమైతేనే రండి
Us education: పార్ట్ టైమ్ ఆలోచనొద్దు.. చదువులకోసమైతేనే రండి"
Play all audios:
అమెరికాలో చదువు, ఉద్యోగాల కోసం రావాలనుకుంటే విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని పలువురు ఎన్నారైలు సూచిస్తున్నారు. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకోవాలన్న ఆలోచన ఉంటే దాన్ని
విరమించుకోవాలని చెబుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో చదువు, ఉద్యోగాల కోసం రావాలనుకుంటే విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని పలువురు ఎన్నారైలు సూచిస్తున్నారు. పార్ట్‌టైమ్
ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకోవాలన్న ఆలోచన ఉంటే దాన్ని విరమించుకోవాలని చెబుతున్నారు. టాప్ యూనివర్శిటీల్లో అడ్మిషన్, ఆర్థిక స్థోమత ఉంటేనే అమెరికా చదువుల కోసం రావడం మంచిదని చెబుతున్నారు. ఇక్కడికి
వచ్చాక కూడా స్థానిక చట్టాలు, నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఉద్యోగాలకు అనువైన వాతావరణం లేదని, హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డ్ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని
భారతదేశంలో కెరీర్ అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మరికొందరు చదువుల కోసం యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చదువుకొనేందుకు మెరుగైన పరిస్థితులు ఉన్నాయని కొందరు
పేర్కొంటున్నారు. అమెరికాలో చదువుల విషయమై ఈనాడు.నెట్ పిలుపునకు అమెరికాలో ఉంటున్న వందలాది మంది ఎన్నారైలు స్పందించారు. వారందరికీ ధన్యవాదాలు!. పాఠకుల్లో నెలకొన్న సగటు ప్రశ్నలకు కొందరు విపులంగా
సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తే.. మరికొందరు పరిస్థితులకు అద్దం పట్టేలా సంక్షిప్తంగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి పాఠకులకు ఒకచోట అందిస్తున్నాం. ఈ క్రమంలో
కొందరి పేర్లను మాత్రమే ప్రచురిస్తున్నాం. ప్రచురణలో ఇబ్బందుల దృష్ట్యా పేర్లను ప్రస్తావించలేనందుకు చింతిస్తున్నాం. పేర్లు ప్రచురించని వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ దిగువన
ప్రచురిస్తున్నాం. * మేం అడిగిన సమాచారం: అమెరికా రావాలనుకుంటున్న విద్యార్థులకు మీరిచ్చే సలహా? ‘పార్ట్‌టైమ్’పై ఆశలొద్దు * మంచి అకడమిక్ ప్రొఫైల్ ఉండి, ఇక్కడి యూనివర్సిటీలపై పూర్తి రీసెర్చ్
చేశాకే రండి. ఆర్థికంగానూ ఇబ్బందులు లేకుండా చూసుకోండి. చదువు మీద దృష్టి సారించండి. మీ మనసులో పార్ట్‌టైమ్ ఆలోచన ఉంటే వెంటనే తీసేయండి. సోషల్‌మీడియాలో అనవసర వివాదాల జోలికి వెళ్లకండి. - స్వరూప్
రెడ్డి * టైర్- 1 విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకు ఢోకా ఉండకపోవచ్చు. క్యాంపస్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయొచ్చు. బయటి ఉద్యోగాలపై ఆధారపడొద్దు. తగినంత అనుభవం
లేకుండా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను మాత్రమే లక్ష్యంగా చేసుకునే వారు రావొద్దు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. - ప్రొఫెసర్ శ్రీనివాస్ పెదపాటి * ఒకప్పుడు అమెరికా
రావడం, పార్ట్‌టైమ్ జాబ్ చేయడం, ఫుల్ టైం జాబ్‌కు మారడంతో జీవితం సెట్ అయ్యేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏఐ టూల్స్ కోడ్‌ను సమకూరుస్తున్నాయి. వీసాల కోసం గట్టి పోటీ ఉంది. వీసా, ఉద్యోగం
కోసం నిరంతరం తపిస్తూ ఉంటే ఓ వయసు వచ్చాక గానీ అమెరికా కల నెరవేరని పరిస్థితి. - వేణు * భారత్‌లో కొంత పని అనుభవం సంపాదించిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు రావడం ఉత్తమం. అప్పటికి పరిస్థితులు
కూడా కుదుటపడతాయి. - సునీల్ * కెరీర్‌లో ఎదగాలనే దృఢ సంకల్పం ఒక్కటే సరిపోదు. సరిపడా డాక్యుమెంట్లు, మీ చదువుకు అయ్యే ఖర్చులను భరించగలిగ ఆర్థిక స్థోమత ఉంటేనే రండి. వచ్చే ముందు ఇక్కడి నిబంధనలను
తెలుసుకోండి. - సదానందం * చదువుకుంటూ క్యాంపస్ బయట పార్ట్‌టైమ్ జాబ్ చేయడం చట్టరీత్యా ఇక్కడ నేరం. కాబట్టి ఆన్‌లైన్‌లో ట్యూషన్లు వంటివి చెప్పేందుకు ప్రయత్నించండి. అందుకోసం మంచి నెట్‌వర్క్
ఏర్పాటు చేసుకోవాలి. - శైలేంద్ర * భారత్‌లో 2-3 ఏళ్లపాటు ఎక్స్‌పీరియన్స్ సంపాదించాకే ఇక్కడ మాస్టర్స్ చేయడానికి రండి. అలాగే, మీరు చదువుకోబోయే యూనివర్సిటీ కూడా మంచిది ఎంచుకోండి.- నరేంద్ర *
టాలెంటెండ్ స్టూడెంట్స్‌కి అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉన్నవాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడి చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉంటూ.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు
ప్లాన్-బి ఉంటే తప్పకుండా రావొచ్చు. - సాయిదీప్ * అమెరికా అపారమైన అవకాశాలను అందిస్తుంది. కానీ కష్టపడి పనిచేయడానికి, దృష్టి పెట్టడానికి, ఆ అవకాశాలను తెలివిగా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా
ఉన్నవారికి మాత్రమే. - రమేశ్ ఓరుగంటి జాబ్ మార్కెట్ అంతంత మాత్రమే! * ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. అమెరికాలో ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఏ క్షణంలోనైనా లేఆఫ్‌కు గురవ్వొచ్చు. 60 రోజుల్లో
ఉద్యోగం సాధించకుంటే దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి. ఒకవేళ ఇండియాలో ఇది వరకే ఉద్యోగం చేస్తూ ఉంటే స్కిల్స్ పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. - తులసి * ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఆశించిన స్థాయిలో
లేదు. ఏడాదిగా ఇదే పరిస్థితి. రెండేళ్ల తర్వాత ఆశించిన స్థాయిలో ఉండొచ్చు. చాలా మంది విద్యార్థులు పార్ట్ టైం జాబ్ అవకాశాలు లేక ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి వచ్చి చదువుకునే
వారికి ఇది సరైన సమయం కాదు. ఇటీవల మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉంటే ఓ రెండేళ్లు భారత్‌లోనే ఎక్స్‌పీరియన్స్ సంపాదించి రావడం మంచిది. చదువు తర్వాత ఉద్యోగానికి అది ఉపయోగపడుతుంది. - రఘు వర్రె
* కష్టపడి పనిచేసి, ఇక్కడే స్థిరపడాలన్న దృఢమైన సంకల్పం, తెలివితేటలున్న వారికి ఆకాశమే హద్దు.- వెంకటరెడ్డి * ఏఐతో జాబ్ మార్కెట్‌లో పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఏఐలో ఏదైనా నైపుణ్యాన్ని
నేర్చుకోవడానికి మాస్టర్స్‌లో కష్టపడి పనిచేస్తే తప్ప ఫ్రెషర్లకు ఉద్యోగాలు కష్టం. -నవీన్ * అమెరికాలో ఎంఎస్ చేసినంత మాత్రం ఉద్యోగాలు వచ్చేస్తాయన్న అపోహ వద్దు. స్కిల్స్ సంపాదించడంపై దృష్టి
పెట్టండి. - గౌరి * మాస్టర్స్ పూర్తి చేసిన వేలాది మంది హెచ్1-బీ వీసా ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. పోటీ ఆ స్థాయిలో ఉంది. ఇక్కడకొచ్చి స్థిరపడాలనుకునే వారు ఈ విషయం గురించి ఆలోచించండి - సంతోష్
* ఇరవై ఏళ్ల కిందటి పరిస్థితి వేరు. ఇప్పుడు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. రాబడి తగ్గింది. భారత్‌లోనూ మంచి అవకాశాలు ఉన్నాయి. - దుర్గా ప్రసాద్ * అమెరికాలో ఉద్యోగం చేయాలన్న కల
నెరవేర్చుకోవాలంటే.. భారత్‌లోనే ఏదైనా మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం పొంది తర్వాత హెచ్-1బీ లేదా ఎల్1 వీసాపై రావడం మంచిది. - చంద్రశేఖర్ * ఇక్కడ అధిక వేతనం పొందొచ్చన్న ఆశతో రావొద్దు. ఇక్కడి
ఖర్చులూ అలానే ఉంటాయి. రెండింటినీ బేరీజు వేసుకున్నాకే ఆలోచన చేయండి- శ్రవణ్ * రాబోయే నాలుగేళ్లు జాబ్ మార్కెట్ కొంత స్తబ్దుగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికీ లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. మరికొన్ని
ఏళ్లు ఆగాల్సిందే - సురేశ్ * అమెరికాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. మారుతున్న వీసా నిబంధనలతో పాటు హెచ్1బీ వీసా, గ్రీన్ కార్డు దొరకడం కష్టం అవుతోంది. ఉద్యోగాలు దొరకడమూ
కష్టంగానే ఉంది. - సుజీత్ వివాదాల జోలికెళ్లొద్దు * అమెరికా వచ్చాక హుందాగా మెలగడం అలవాటు చేసుకోవాలి. ఇంగ్లిష్‌పై పట్టు సంపాదించాలి. ఇక్కడికొచ్చాక తాగి వాహనం నడపడం వంటివి చేయకూడదు - రఘు * వీసా
నిబంధనలు, అమెరికా చట్టాలను గౌరవించండి. యూనివర్సిటీ గురించి పూర్తిగా తెలుసుకోండి. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండొద్దు. ఎవరితోనూ వాదనకు దిగొద్దు. చదువుపైనే దృష్టి కేంద్రీకరించడం మంచిది.
-దీపక్ * అనవసర విషయాల్లో తల దూర్చకండి. పూర్తిగా చదువులో ధ్యాస పెట్టుకోండి. రాజకీయాలకు దూరం అవసరం. సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి. రూల్స్ పాటించండి. ఇవన్నీ పాటిస్తే ఏ ఇబ్బందులూ ఉండవు. -
సుబ్రహ్మణ్యం
Trending News
Urvashi rautela: కేన్స్ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలాకేన్స్ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్ విడుదల చ...
Upcoming telugu movies: ఈ వారం థియేటర్‌లో వినోదాలను పంచే చిత్రాలివేఇప్పుడు తెలుగులోనూ.. kesari chapter 2 Telugu || అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ కోర్ట...
Subramanya Swamy: నాగుల చవితి రోజు ఇక్కడ సుబ్రమణ్య స్వామిని దర్శిస్తే సంతానం కలుగుతుందట!Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...
Ayodhya ram mandir | latest ayodhya ram mandir - eenaduయాత్రల్లో.. ఎన్ని జ్ఞాపకాలో.. కొత్త జ్ఞాపకాలకు పెద్దపీట వేశారు... ప్రకృతి అందాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. హాయిగా విశ్రాంతి ...
Ipl 2025: లఖ్‌నవూ ఆటగాడు దిగ్వేశ్ రాఠీని సస్పెండ్ చేసిన బీసీసీఐలఖ్నవూ, హైదరాబాద్ మధ్య సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో దిగ్వేశ్ రాఠీ.. అభిషేక్ శర్మతో వాగ్వాదానికి దిగాడు. దీంతో బీ...
Latests News
Us education: పార్ట్ టైమ్ ఆలోచనొద్దు.. చదువులకోసమైతేనే రండిఅమెరికాలో చదువు, ఉద్యోగాల కోసం రావాలనుకుంటే విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని పలువురు ఎన్నారైలు సూచిస్తున్...
Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in teluguEe Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (03-06-2025) పెద్దల సహకారం తోడ్పడుతుంది. ప్రారంభించిన పనుల...
China: భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతలు.. మరోసారి స్పందించిన చైనాభారత్- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరుదేశాలు సంయమనం పాటించాలని చైనా ప్రతిపాదించింది. ఇంటర్నెట్...
Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/2025)మేషం ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటా...
Ipl 2025: లఖ్‌నవూ ఆటగాడు దిగ్వేశ్ రాఠీని సస్పెండ్ చేసిన బీసీసీఐలఖ్నవూ, హైదరాబాద్ మధ్య సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో దిగ్వేశ్ రాఠీ.. అభిషేక్ శర్మతో వాగ్వాదానికి దిగాడు. దీంతో బీ...