Saif ali khan: సైఫ్‌పై దాడి.. నిందితుడు బంగ్లాదేశీయుడు
Saif ali khan: సైఫ్‌పై దాడి.. నిందితుడు బంగ్లాదేశీయుడు"
Play all audios:
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు శనివారం పట్టుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం డీసీపీ దీక్షిత్ తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించారు.
నిందితుడి గురించి పలు విషయాలు వెల్లడించారు. ముంబయి: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి కేసులో ప్రధాన నిందితుడిని శనివారం అర్ధరాత్రి పోలీసులు థానేలో అరెస్టు చేశారు. ఆదివారం
ఉదయం డీసీపీ దీక్షిత్ ప్రెస్‌మీట్ పెట్టి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. * సూర్య నో చెప్పడం నన్ను బాధించింది: గౌతమ్ మేనన్ ‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్
అలీఖాన్‌పై దాడి జరిగింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించాం. అతడిని నిన్న అరెస్ట్ చేశాం. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అతడు సైఫ్
నివాసంలోకి వెళ్లాడు. అతడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి కస్టడీ కోరుతాం. దీనికి సంబంధించిన తదుపరి విచారణ చేపడతాం. ప్రాథమిక విచారణలో అతడిని బంగ్లాదేశీయుడిగా గుర్తించాం. నిందితుడు అక్రమంగా
భారత్‌లోకి ప్రవేశించాడు. భారత్ వచ్చాక విజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడు. ఆరు నెలల క్రితం ముంబయి వచ్చాడు. భారతీయుడని చెప్పడానికి అతడి వద్ద సరైన ఆధారాలు లేవు’’ అని తెలిపారు. బాంద్రాలోని
సైఫ్ నివాసంలో గురువారం (జనవరి 16) తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లాడు. దుండగుడిని
చూసిన జేహ్ కేర్‌టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకొన్న సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలో సైఫ్ గాయపడ్డారు. ఆరుచోట్ల కత్తి గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన లీలావతి
ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. ప్రస్తుతం సైఫ్ లీలావతి ఆస్పత్రిలోనే ఉన్నారు. దాడి ఘటనపై
కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు దాదాపు 20 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. దాదాపు మూడు రోజుల తర్వాత థానేలో అతడిని అరెస్ట్ చేశారు.
Trending News
20 వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...
నేత కార్మికులకు అండగా సీఎం జగన్'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...
Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగోAP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...
Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...
నాలుగేళ్ల ప్రేమ విషాదాంతంశిరీష, వెంకటేష్ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...
Latests News
Saif ali khan: సైఫ్‌పై దాడి.. నిందితుడు బంగ్లాదేశీయుడుబాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు శనివారం పట్టుకున్నారు. ప్రాథమిక ...
Abha: ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ బెనిఫిట్స్ ఇవే.. మెడికల్ రికార్డులపై ఇక నో టెన్షన్Published by: Last Updated:June 20, 2024 4:30 PM IST కేంద్ర ప్రభుత్వం డిజిటల్ హెల్త్ లాకర్ ఫెసిలిటీ ప్రారంభించింది. ద...
Punjab: కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..ఇంటర్నెట్‌డెస్క్: పంజాబ్ (Punjab)లో ఘోరం చోటుచేసుకుంది. కల్తీ మద్యం (Spurious Liquor) తాగి 14 మంది ప్రాణాలు కోల్పోయారు...
Meet Rasha Thadani, Raveena Tandon's glamorous daughterBorn on March 16, 2005, Rasha will turn 17 next month. She cleared the IGCSE (International General Certificate of Secon...
Supreme court: ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ధర్మసత్రం కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుదిల్లీ: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ఉచిత సత్రం కాదని సుప్రీం కోర్టు (Supreme Cou...