Rrr: లండన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌ లైవ్‌ కాన్సర్ట్‌’.. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఫొటోలు వైరల్‌

Eenadu

Rrr: లండన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌ లైవ్‌ కాన్సర్ట్‌’.. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఫొటోలు వైరల్‌"

Play all audios:

Loading...

లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌ లైవ్‌ కాన్సర్ట్‌’ నిర్వహించారు. ఈ వేడుకలో స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు.  ఇంటర్నెట్‌


డెస్క్‌: ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్‌ అందుకుని ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది తెలుగు సినిమా ‘ఆర్ఆర్‌ఆర్‌’ (RRR). ఇప్పుడు మరోసారి ఆ పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. తాజాగా లండన్‌లోని


ప్రతిష్ఠాత్మక రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌ లైవ్‌ కాన్సర్ట్‌’ నిర్వహించారు. రాయల్‌ ఫిల్‌ హార్మోనిక్‌ కాన్సర్ట్‌ ఆర్కెస్ట్రాతో కలిసి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తన ప్రదర్శనతో


అతిథులను మంత్రముగ్దుల్ని చేశారు. ఈవెంట్‌కు మూవీ హీరోలు ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (Ram Charan), డైరెక్టర్‌ రాజమౌళి (Rajamouli) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కి ముందస్తుగా రామ్‌చరణ్‌


జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. దీంతో అభిమానులు కేకలతో హోరెత్తించారు.  ఒకే వేదికపై ఇద్దరు అగ్ర హీరోలు, దర్శకుడు రాజమౌళి కనిపించడంతో అక్కడి అతిథులు, సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు ఆనందం


వ్యక్తం చేశారు. ఈ స్టార్‌ హీరోల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం రాజమౌళి- మహేశ్‌బాబు కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్‌ సినిమా (#SSMB29) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 


‘బాహుబలి 2’ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో లైవ్‌ కాన్సర్ట్‌ చేసిన తొలి విదేశీ చిత్రంగా ‘బాహుబలి 2’ రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచింది. రెండూ రాజమౌళి


దర్శకత్వం వహించిన సినిమాలే కావడం విశేషం. 


Trending News

Bhatti vikramarka: పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు: భట్టి విక్రమార్క

అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం: అ...

Uttam kumar reddy: బనకచర్ల ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం: మంత్రి ఉత్తమ్‌

ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది...

Nvidia: మైక్రోసాఫ్ట్‌ను దాటేసిన ఎన్విడియా.. అత్యంత విలువైన కంపెనీల్లో మళ్లీ టాప్‌

Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. Nv...

Ktr: మిస్‌ ఇంగ్లాండ్‌ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలి: కేటీఆర్‌

మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) డిమాండ్‌ చ...

Mock drill: పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌ డ్రిల్‌

 అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరుపై సరిహద్దు జిల్లాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.  ఇంటర్...

Latests News

Rrr: లండన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌ లైవ్‌ కాన్సర్ట్‌’.. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఫొటోలు వైరల్‌

లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌ లైవ్‌ కాన్సర్ట్‌’ నిర్వహించారు. ఈ వేడుకలో స్టార్‌ హీరోలు...

SHOOTER MOVIE: షూటర్‌ వస్తున్నాడు రవిబాబు, సుమన్‌, రాశి, ఆమని, అన్నపూర్ణమ్మ, ఎస్తేర్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘షూటర్‌’. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్

SHOOTER MOVIE: షూటర్‌ వస్తున్నాడు రవిబాబు, సుమన్‌, రాశి, ఆమని, అన్నపూర్ణమ్మ, ఎస్తేర్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘షూట...

Kuldeep yadav | latest kuldeep yadav - eenadu

ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు: రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌, ఫైనల్స్‌లో భారత స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ...

Google i/o 2025: గూగుల్ మీట్‌లో రియల్‌ టైమ్‌ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌.. ఎలా పని చేస్తుందంటే?

Google I/O 2025 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెక్‌ సంస్థ గూగుల్ కొత్త సదుపాయాలతో ముందుకొచ్చింది. గూగుల్‌ తన వార్షిక డెవల...

Quad summit : పరస్పర విశ్వాసమే క్వాడ్ బలం: pm modi | మనమే శక్తిమంతులం: biden

Published by: Last Updated:May 24, 2022 10:28 AM IST నాలుగు దేశాలతో ఏర్పడిన క్వాడ్ కూటమి అనతికాలంలోనే ప్రపంచం ముందు తనదై...

Top