Google i/o 2025: గూగుల్ మీట్‌లో రియల్ టైమ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్.. ఎలా పని చేస్తుందంటే?
Google i/o 2025: గూగుల్ మీట్‌లో రియల్ టైమ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్.. ఎలా పని చేస్తుందంటే?"
Play all audios:
Google I/O 2025 | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ కొత్త సదుపాయాలతో ముందుకొచ్చింది. గూగుల్ తన వార్షిక డెవలపర్ సమావేశం Google I/O 2025లో వీటిని పరిచయం చేసింది. ఇందులో భాగంగా
గూగుల్ మీట్ కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. రియల్ టైమ్ ట్రాన్స్‌లేట్ సదుపాయాన్ని జోడించినట్లు వెల్లడించింది. ఈ కొత్త సాంకేతికత జెమినీ ఏఐ మోడల్స్ ఆధారంగా
పనిచేస్తుందని పేర్కొంది. డెవలపర్ సమావేశంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రియల్ టైమ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌కు సంబంధించి చిన్న డెమో వీడియోను పంచుకున్నారు. ఈ ఫీచర్ కేవలం క్యాప్షన్లను
అనువదించడమే కాకుండా వ్యక్తుల స్వరం, భావోద్వేగం, మాట్లాడే శైలి ఆధారంగా వాయిస్‌ను సైతం అనువాదం చేస్తుందని తెలిపారు. వీడియో కాల్స్‌లో విభిన్న భాషలు మాట్లాడేవారు మాటల్ని సులభంగా అర్థం
చేసుకునేందుకు ఈ ఫీచర్ సాయపడుతుందన్నారు. * ఐటీఆర్.. నాలుగేళ్ల వరకు అప్‌డేట్ చేయొచ్చు ఉదాహరణకు.. గూగుల్ మీట్‌లో మీరు ఆంగ్లంలో మాట్లాడుతుంటే టీమ్‌లో మరో వ్యక్తి స్పానిష్‌లో
స్పందిస్తాడనుకుందాం. అలాంటి సమయంలో ఈ సరికొత్త సాంకేతికత మీకు సాయం చేస్తుంది. ఆ వ్యక్తి మాటలను ఏఐ ఆంగ్లంలోకి అనువదించి కేవలం టెక్ట్స్ రూపంలోనే కాకుండా ఇంగ్లిష్ ఆడియో రూపంలోనూ అందిస్తుంది.
అలానే మీరు చెప్పే తెలుగులో సమాధానాన్ని కూడా స్పానిష్‌లో మార్చి అచ్చం మీ స్వరంలానే అందిస్తుంది. ఇదంతా రియల్ టైమ్‌లోనే జరుగుతుంది. గూగుల్ ఏఐ ప్రో, అల్ట్రా ప్లాన్ సబ్‌స్క్రైబర్లకు
రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్ టూల్‌ను గూగుల్ రోలవుట్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లిష్, స్పానిష్ భాషల అనువాదానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని భాషలకు ఈ ఫీచర్‌ను
విస్తరించనున్నారు. గూగుల్ వర్క్‌స్పేస్ బిజినెస్ కస్టమర్ల కోసం ఈ ఫీచర్ ఎంటర్‌ప్రైజ్ వెర్షన్‌ను పరీక్షిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది చివరికి ఎంపిక చేసిన కార్పొరేట్ క్లయింట్‌లతో
ట్రయల్స్ ప్రారంభించాలని చూస్తున్నట్లు పేర్కొంది. జీమెయిల్‌లో స్మార్ట్ సమాధానాలు.. జీమెయిల్‌లో సమాధానం పంపాలంటే దాని కింద సజెషన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఏఐ సాంకేతికత మీకు అనేక
సజెషన్లు డిస్‌ప్లే చేస్తుంది. మెయిల్‌లో ఉండే సమాచారాన్ని మొత్తం అర్థం చేసుకొని సందర్భోచితంగా ఈ ప్రత్యుత్తరాలు తయారుచేసి మీ ముందు ఉంచుతుంది. అర్థవంతంగా, స్మార్ట్‌గా, సరైన ముగింపుతో సమాధానాలు
రూపొందించి వాటిని మీకు చూపుతుంది. అందులో నచ్చిన వాటిని ఎంచుకొని సులభంగా సమాధానాలు పంపొచ్చు. [embedded content] రెండు కొత్త ఏఐ మోడళ్లు.. గూగుల్ తాజా ఈవెంట్‌లో ఇమేజ్‌న్4, వీయో 3 మోడళ్లను
విడుదల చేసింది. ఈ కొత్త జనరేటివ్ ఏఐ మోడళ్లు టెక్స్ట్ ప్రాంప్ట్‌ల సాయంతో అధిక నాణ్యత గల చిత్రాలు, వీడియోలను రూపొందించడమే కాకుండా ఆటోమెటిక్‌గా ఆడియోను జనరేట్ చేసి ఇస్తుంది. వీయో 3 వీడియో
జనరేషన్ మోడల్.. టెక్ట్స్ లేదా ఇమేజ్ ప్రాంప్ట్‌ల ఆధారంగా హై క్వాలిటీ వీడియో క్లిప్‌లు రూపొందిచొచ్చు. 3డీ వీడియో కాన్ఫరెన్స్ అనుభూతి మెరుగైన వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని అందించడం కోసం
‘గూగుల్ బీమ్’ కొత్త ప్లాట్‌ఫామ్‌ను గూగుల్ పరిచయం చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు 3డీ అనుభూతిని అందించడం దీని ముఖ్య ఉద్దేశం. అది కూడా ఎలాంటి త్రీడీ గ్లాస్‌లు,
హెడ్‌సెట్ ధరించాల్సిన అవసరం లేకుండానే. బీమ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు హెచ్‌పీతో గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూజర్లను గమనించడానికి వివిధ యాంగిల్స్ నుంచి వివిధ వెబ్‌క్యామ్‌లు
ఉపయోగిస్తుంది. ఆ తర్వాత వీడియో స్ట్రీమ్‌లను కలిపి ఏఐ సాయంతో త్రీడీలో డిస్‌ప్లే చేస్తుంది.
Trending News
Ktr: మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలి: కేటీఆర్మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) డిమాండ్ చ...
Nvidia: మైక్రోసాఫ్ట్‌ను దాటేసిన ఎన్విడియా.. అత్యంత విలువైన కంపెనీల్లో మళ్లీ టాప్Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. Nv...
Uttam kumar reddy: బనకచర్ల ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం: మంత్రి ఉత్తమ్ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది...
Bhatti vikramarka: పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు: భట్టి విక్రమార్కఅన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం: అ...
Vijay: సూర్యుడికి కులం, మతం ఉందా..? విద్యార్థులకు హీరో విజయ్ ప్రశ్నఇంటర్నెట్డెస్క్: కుల, మత అంశాలతో మనసును పాడుచేసుకోవద్దంటూ ‘తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) అధినేత, ప్రముఖ...
Latests News
Google i/o 2025: గూగుల్ మీట్‌లో రియల్ టైమ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్.. ఎలా పని చేస్తుందంటే?Google I/O 2025 | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ కొత్త సదుపాయాలతో ముందుకొచ్చింది. గూగుల్ తన వార్షిక డెవల...
Quad summit : పరస్పర విశ్వాసమే క్వాడ్ బలం: pm modi | మనమే శక్తిమంతులం: bidenPublished by: Last Updated:May 24, 2022 10:28 AM IST నాలుగు దేశాలతో ఏర్పడిన క్వాడ్ కూటమి అనతికాలంలోనే ప్రపంచం ముందు తనదై...
Malayalam cinema for everyone: from 'manjummel boys,' to 'premalu' and 'aavesham'During its exceptional run in Tamil Nadu, _Manjummel Boys_ became the first Malayalam film ever to gross over `50 crores...
Priyanka Chopra Jonas's brother Siddharth ties the knot with Neelam UpadhyayaNewsletters ePaper Sign in HomeIndiaKarnatakaOpinionWorldBusinessSportsVideoEntertainmentDH SpecialsOperation SindoorNew...
Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ మోసం.. జీడిమెట్లలో రూ. 150 కోట్ల స్కామ్భాగ్యనగరంలో మరో భారీ మోసం వెలుగు చూసింది. స్టాక్‌మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ సంస్థ రూ.150 కోట్ల మేర శఠగోపం పెట్టింది....