Exhibitors producers meet: థియేటర్ల బంద్.. తుది నిర్ణయం ఆరోజే
Exhibitors producers meet: థియేటర్ల బంద్.. తుది నిర్ణయం ఆరోజే"
Play all audios:
మరోసారి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సంయుక్తంగా సమావేశం కావాలని నిర్మాతలు నిర్ణయించారు. అప్పుడే తుది నిర్ణయం ప్రకటించనున్నారు. హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన
నిర్మాతల సమావేశం ముగిసింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై చర్చలు జరిపారు. ఈ నెల 23న మరోసారి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సంయుక్తంగా సమావేశం కావాలని నిర్మాతలు నిర్ణయించారు.
అప్పుడే తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. పర్సంటేజీ విధానంపై కొందరు నిర్మాతలు మొగ్గు చూపగా.. కొందరు అనాసక్తి కనబరిచారు. నిర్మాతలు దిల్ రాజు, సురేశ్‌బాబు, డీవీవీ దానయ్య, సాహు గారపాటి,
బాపినీడు, నాగవంశీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అద్దె ప్రాతిపదికన
సినిమాల్ని ప్రదర్శిస్తుండడంతో తమకు ఆదాయం సరిపోవడం లేదని, మల్టీప్లెక్స్ తరహాలోనే వసూళ్లలో పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాలంటూ సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు పట్టుబట్టాయి. మల్టీప్లెక్స్‌ల్లో
పర్సెంటేజీల ప్రకారం ప్రదర్శనలు జరుగుతుండగా, తాము మాత్రం అద్దె ప్రాతిపదికన ఎందుకు సినిమాల్ని ప్రదర్శించాలని పలువురు యజమానులు తమ వాదనను ఇటీవల జరిగిన సమావేశంలో వినిపించారు.
Trending News
China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనావిదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది. ఇంటర్నె...
Game changer: ‘గేమ్‌ఛేంజర్’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్ కీలక వ్యాఖ్యలురామ్చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...
Isi: పాక్ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్..ISI ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...
Crime news: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టుహైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...
Vaibhav suryavanshi: ప్రధాని మోదీని కలిసిన ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ, ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆశీర్వాదాలు అందుకున్నా...
Latests News
Exhibitors producers meet: థియేటర్ల బంద్.. తుది నిర్ణయం ఆరోజేమరోసారి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సంయుక్తంగా సమావేశం కావాలని నిర్మాతలు నిర్ణయించారు. అప్పుడే తుది నిర్ణయం ప్రకటిం...
Harish kumar gupta: ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాప్రస్తుతం ఏపీ ఇన్‌ఛార్జి డీజీపీగా ఉన్న హరీశ్ కుమార్ గుప్తా పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్...
Chandrababu: డిజిటల్ కరెన్సీ వచ్చాక పెద్దనోట్లు అవసరం లేదు: చంద్రబాబుదేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కడప: దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు ...
Tourist family: ‘టూరిస్ట్ ఫ్యామిలీ’కి మరో హీరో ఫిదా.. చిత్రబృందంపై ప్రశంసలుఇంటర్నెట్ డెస్క్: వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చి విజయాన్ని అందుకుంది ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family). అభి...
Allu arjun: ‘గద్దర్ అవార్డ్స్’: తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ కృతజ్ఞతలుహైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కృతజ్ఞతలు తెలిపారు. గురువారం తెలంగాణ ప్రభుత్వ...