Amitabh bachchan: ‘ఆపరేషన్ సిందూర్’పై అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ పోస్టు
Amitabh bachchan: ‘ఆపరేషన్ సిందూర్’పై అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ పోస్టు"
Play all audios:
పహల్గాం ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’పై బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తాజాగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి ఘటన అందరినీ
కలచివేసింది. ఆ హృదయవిదారక ఘటనపై ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తాజాగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కళ్ల ముందే భర్తను పోగొట్టుకున్న నవ వధువు శోకాన్ని ఉద్దేశిస్తూ తన తండ్రి
రాసిన పద్యంలోని ఓ లైన్‌ని ప్రస్తావించారు. ‘‘భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన భర్తను ఉగ్రమూక కాల్చి చంపింది. భర్తను చంపొద్దంటూ భార్య ఏడుస్తూ ఎంతగా వేడుకున్నా ఆ ఉన్మాది వినలేదు. ఆమె నుదుట
సిందూరం లేకుండా చేశాడు. కళ్ల ముందే భర్త చనిపోవడాన్ని తట్టుకోలేని ఆమె ‘నన్ను కూడా చంపేయ్’ అంటూ మోకరిల్లింది. అప్పుడు ఆ రాక్షసుడు.. ‘నిన్ను చంపను. వెళ్లి ... చెప్పుకో’’ అంటూ పొగరు చూపించాడు’’
* ఆపరేషన్ సిందూర్ టైటిల్ ప్రకటనపై దర్శకుడి క్షమాపణలు ‘‘కుమార్తెలాంటి ఆమె మానసిక స్థితి చూస్తే.. ‘‘ఆమె వద్ద చితాభస్మం ఉన్నా సిందూరం ఎక్కడని ప్రపంచం అడుగుతుంది’’ అని నాన్న రాసిన పద్యంలోని
లైన్ గుర్తొచ్చింది. ‘అందుకే నేను సిందూరం ఇస్తున్నా.. ఆపరేషన్ సిందూర్’ అని తాజాగా ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యను ప్రస్తావించారు. జైహింద్. భారత సైన్యమా.. నువ్వు ఎప్పటికీ వెనకడుగు వేయవు.
నీ ప్రయాణం ఎప్పటికీ ఆగదు’’ అని పేర్కొన్నారు. అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమాలతోపాటు సామాజిక అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే, పహల్గాం దాడి
నుంచి ఆయన ‘ఎక్స్’లో కేవలం పోస్టు సంఖ్యనే (అమితాబ్ తన ప్రతి పోస్టుకు సీరియల్ నెంబరు ఉంటుంది) ప్రస్తావించారు. దాదాపు 20 రోజులు అలా చేయడంతో ఏమైందోనని అటు అభిమానులు, ఇటు నెటిజన్లు సందేహం
వ్యక్తం చేశారు. ఆ ఘటనపై అమితాబ్ ఎంతగా కలత చెందారో తాజా పోస్టు నిదర్శనం.
Trending News
Kondagattu: కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులుజగిత్యాల: హనుమాన్ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నన...
Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రాహైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...
North korea: కిమ్ ప్రారంభించడానికి వెళ్లిన యుద్ధనౌకకు డ్యామేజీఇంటర్నెట్డెస్క్: ఉత్తరకొరియా (North Korea) ఇటీవల 5వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను రూపొందించిన సంగతి తెలిసిందే....
Canada: అమెరికా ‘గోల్డెన్ డోమ్’ ప్రాజెక్టులో చేరికపై చర్చిస్తున్నాం: కెనడా ప్రధానిఅమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ పేర్...
స్మార్ట్ ఫోన్ల కోసం ఇళ్లల్లో పిల్లల లొల్లి..రామారెడ్డి/దోమకొండ : కరోనా వైరస్ మనిషి జీవన విధానంలో ఏన్నో మార్పులు తెచ్చింది. కరోనా ముందు.. కరోనా తర్వాత.. అన్నట్లుగా ...
Latests News
Amitabh bachchan: ‘ఆపరేషన్ సిందూర్’పై అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ పోస్టుపహల్గాం ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’పై బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తాజాగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియ...
Elon musk: 2035 నాటికి రోడ్లపై డ్రైవర్‌లెస్ కార్లే: టెస్లా ఏఐ సాఫ్ట్‌వేర్ బాస్Elon Musk | ఇంటర్నెట్ డెస్క్: విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఏఐ సాఫ్ట్‌వేర్ వైస్ ప్రెసిడెంట్‌గా భారత సంత...
Sridevi soda center : వెంకటేష్ చేతులు మీదుగా సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే..Published by: Last Updated:August 26, 2021 7:23 PM IST SRIDEVI SODA CENTER : వెంకటేష్ చేతులు మీదుగా సుధీర్ బాబు ‘శ్రీదేవ...
Zen technologies- divis labs: అప్పర్ సర్క్యూట్ తాకిన జెన్ టెక్నాలజీస్ షేర్లు.. దివీస్ ల్యాబ్స్ షేర్లు 4% జంప్Zen Technologies- Divis Labs: జెన్ టెక్నాలజీస్ షేర్లు నేడు ట్రేడింగ్ సెషన్‌లో అప్పర్ సర్క్యూట్ తాకాయి. దివీస్ ల్యాబ...
Horoscope: ఏప్రిల్ 16 రాశిఫలాలు... రావలసిని డబ్బు చేతికి అందుతుంది..!మిథునం: రోజంతా ప్రశాంతంగా, అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల కో...