Operation sindhoor: పాక్‌కు గుణపాఠం చెప్పడమే.. ప్రతి భారతీయుడి సంకల్పం: యోగి ఆదిత్యనాథ్
Operation sindhoor: పాక్‌కు గుణపాఠం చెప్పడమే.. ప్రతి భారతీయుడి సంకల్పం: యోగి ఆదిత్యనాథ్"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పడం ప్రతి భారతీయుడి సంకల్పమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు (Yogi Adityanath). తాజాగా లఖ్‌నవూలో జరిగిన మహారాణా ప్రతాప్ జయంతి
కార్యక్రమంలో మాట్లాడిన ఆయన శత్రుదేశంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ - పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి
పోషిస్తోందన్నారు. ‘‘ఇటీవల దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు పాల్గొనడం అందరం చూశాం. ఇది వారి సిగ్గులేని చర్యకు నిదర్శనం. దాయాది దేశం
(Pakistan) ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించడం మాత్రమే కాదు దాన్ని పెంచి పోషిస్తోంది. ఈ విషయం ప్రపంచం మొత్తం కళ్లారా చూసింది. ఉగ్రవాదంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న పాక్.. ఇప్పుడు దాని ఉనికి కోసం
పోరాడుతోంది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దారుణం అందరినీ కదిలించింది. ఆ అనాగరిక చర్యకు పాల్పడిన వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకూడదని నరేంద్రమోదీ నిర్ణయించుకున్నారు. ఆ ఘటన జరిగిన నాటినుంచి
పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పడమే ప్రతి భారతీయుడి సంకల్పంగా మారింది. మన సాయుధ దళాలు పాక్‌కు తగిన బుద్ధి చెప్పాయి. ప్రపంచం ముందు పాకిస్థాన్ ఒంటరిగా విలపిస్తోంది’’ అని యోగి అన్నారు. భారీగా
చొరబాట్లను అడ్డుకొన్న బీఎస్‌ఎఫ్.. ఏడుగురు హతం ఈ పరిస్థితుల్లో అందరూ ఐక్యంగా ఉండాలని సాయుధ దళాలకు మద్దతు ఇవ్వాలని పౌరులను ఆదిత్యనాథ్ కోరారు. ‘‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో భారతీయులంతా
బాధ్యతాయుతంగా ఉండాలి. ఇలాంటి సమయంలో వదంతులు వ్యాప్తించే అవకాశాలు ఉన్నాయి. వాటిపై అప్రమత్తంగా ఉంటూ ప్రధాని మోదీ (PM Modi) నాయకత్వంపై పూర్తి నమ్మకంగా ఉండాలి. ఈ పోరులో భారత్ కచ్చితంగా విజయం
సాధిస్తుంది’’ అని యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తంచేశారు. మరోవైపు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindhoor) దెబ్బకు పాక్ అతలాకుతలం అవుతోంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి కూడా అత్యంత దారుణంగా తయారైనట్లు
తెలుస్తోంది. అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వెంపర్లాడుతోంది. తమకు ఆర్థికసాయం చేయాలని వేడుకుంటోంది. దీనిపై పాక్ పెట్టిన పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Trending News
Virat kohli: విరాట్ కోహ్లీ.. లక్షల మందికి స్ఫూర్తి: రిటైర్మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందనటెస్టు క్రికెట్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవం...
Cm chandrababu: రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే: సీఎం చంద్రబాబురికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధికారులకు దిశానిర్...
Jp nadda | latest jp nadda - eenaduసార్వత్రిక ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా సార్వత్రిక ఎన్నికలకు ‘సంకల్ప పత్రం’ పేరుతో భాజపా మేనిఫెస్టోను విడుద...
Murali naik: అమర వీరుడు మురళీనాయక్‌కు నివాళులర్పించిన మంత్రులు లోకేశ్, అనగానిదేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, అనిత నివాళులర్పించారు గో...
Jammu and kashmir: పాక్ షెల్లింగ్‌కు విరుగుడుగా.. జమ్మూకశ్మీర్లో 9,500 బంకర్లు..Jammu and Kashmir ఇంటర్నెట్‌డెస్క్: పాక్ సైన్యం షెల్లింగ్ నుంచి సరిహద్దు గ్రామాల వారిని కాపాడేందుకు దాదాపు 9,500 బంకర్...
Latests News
Operation sindhoor: పాక్‌కు గుణపాఠం చెప్పడమే.. ప్రతి భారతీయుడి సంకల్పం: యోగి ఆదిత్యనాథ్ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పడం ప్రతి భారతీయుడి సంకల్పమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు (Yog...
Srikakulam news | latest srikakulam news - eenaduతెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఓఎస్‌డీ పేరిట మోసాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శినని, ఓఎస్‌డీనంటూ...
Ap grama sachivalayam 2019 qualified candidates list released on gramasachivalayam. Ap. Gov. In- check list hereAP GRAMA SACHIVALAYAM 2019 QUALIFIED CANDIDATES LIST RELEASED ON SEPTEMBER 25, 2019. ALL THE APPEARED CANDIDATES CAN CHE...
Telegram | latest telegram - eenaduTELEGRAM: ఫేస్‌బుక్, ఇన్‌స్టా తరహాలో టెలిగ్రామ్ స్టోరీస్.. ఎప్పటినుంచంటే? టెలిగ్రామ్ (Telegram) యూప్ కొత్తగా మరో ఫీ...
Ntr biopic: as ap cm chandrababu naidu, rana daggubati shares glimpse of his relationship with former cmThe NTR biopic, directed by Krish, will see Nandamuri Balakrishna, Rana Daggubati and Vidya Balan in pivotal roles One o...