Colonel sofiya qureshi: ‘ముందెళ్లి క్షమాపణ చెప్పండి’: కర్నల్ సోఫియాపై మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్
Colonel sofiya qureshi: ‘ముందెళ్లి క్షమాపణ చెప్పండి’: కర్నల్ సోఫియాపై మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్"
Play all audios:
Colonel Sofiya Qureshi: కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంటర్నెట్‌డెస్క్: పాకిస్థాన్‌తో పోరుకు
సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ వచ్చిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sofiya Qureshi)పై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా (Madhya Pradesh minister Vijay
Shah) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది. హైకోర్టు ఆదేశాలపై ఆయన అత్యున్నత
న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి పిటిషన్‌ను రేపు విచారించేందుకు కోర్టు అంగీకరించింది. అంతేగాకుండా ఆయన తీరును తప్పుపట్టింది. ‘‘ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ముందు వెళ్లి హైకోర్టులో
క్షమాపణలు చెప్పండి. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండి’’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి మీడియాకు వివరాలను వెల్లడించిన కర్నల్ ఖురేషీని ఉద్దేశిస్తూ ఆమెను
‘ఉగ్రవాదుల సోదరి’ అని విజయ్ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదికాస్త తీవ్ర దుమారం రేగడంతో మంత్రి వ్యాఖ్యలను హైకోర్టు బుధవారం సుమోటోగా తీసుకుంది. శత్రుత్వం, విద్వేషాన్ని
ప్రోత్సహించినందుకు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలని జస్టిస్ అతుల్ శ్రీధరణ్, జస్టిస్ అనురాధా శుక్లాలతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తమకు నివేదించాలని రాష్ట్ర
డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ... దేశంలో ఇంకా ‘సమగ్రత, క్రమశిక్షణ, త్యాగం, నిస్వార్థం, గౌరవం,
అజేయమైన ధైర్యం నిండి ఉన్న సంస్థ ఒక్క సైన్యం మాత్రమే’నని పేర్కొన్నారు. * భారత్ ఓవైపు.. పాక్ సైబర్ మంద మరోవైపు..! అటు జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా
ఖండించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది. మంత్రి చేసిన వ్యాఖ్యలపై భాజపా సీనియర్ నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. విజయ్
షాను ‘మూర్ఖుడు’ అని ఆయన సంబోధించారు. మరోవైపు విజయ్ షాపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.
Trending News
Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeatTo Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...
మత్తు మాయలో పడి ఇంటికి వచ్చిన స్నేహితురాలి శీలాన్ని తాకట్టు పెట్టి...Last Updated:September 21, 2019 8:30 PM IST నవ్వుతూ మోనాను పలకరించిన దీపక్ ఆమెకు జ్యూస్ కలిపి ఇచ్చాడు. జ్యూస్ తాగిన మోనా...
Delhi capitals | latest delhi capitals - eenaduముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్ జట్టు.. విల్‌జాక్స్, రికెల్‌టన్, కార్బిన్ బాష్ స్థ...
Punjab news | latest punjab news - eenaduప్రభుత్వ మార్పు ఊహాగానాల వేళ.. కేజ్రీవాల్- పంజాబ్ సీఎం భేటీ Arvind Kejriwal-Bhagwant Mann: దిల్లీలో పరాజయం, పంజాబ్‌లో ప...
Kkr - ipl 2025: డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌కు చుక్కెదురు.. అయినా ప్లేఆఫ్స్ ఛాన్స్ ఇలాడిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (KOLKATA KNIGHT RIDERS)కు చెన్నై సూపర్ కింగ్స్ చెక్ పెట్టి...
Latests News
Colonel sofiya qureshi: ‘ముందెళ్లి క్షమాపణ చెప్పండి’: కర్నల్ సోఫియాపై మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్Colonel Sofiya Qureshi: కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఆయన సుప్...
Vijay deverakonda : ఖుషి సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లకు కొన్నదో తెలుసా..ఇక ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు...
Vijayshanthi:‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు... చిరంజీవిని కూడా అన్నట్లే!భారత్‌లో అసహనం పెరిగిపోయిందని, ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల యక్రమంలో...
Astrology ఈ రాశుల వారికి త్వరలో విదేశి యానం యోగం.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Top ten news @ 5pm: ఈనాడు. నెట్‌లో టాప్ 10 వార్తలు @ 5pm (nov 17)1. ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు: మంత్రి పొన్నం తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వాహనాలకు రిజిస్ట్రే...