Kkr - ipl 2025: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌కు చుక్కెదురు.. అయినా ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌ ఇలా

Eenadu

Kkr - ipl 2025: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌కు చుక్కెదురు.. అయినా ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌ ఇలా"

Play all audios:

Loading...

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KOLKATA KNIGHT RIDERS)కు చెన్నై సూపర్ కింగ్స్‌ చెక్ పెట్టింది. కీలక సమయంలో ఓటమిపాలు కావడం కేకేఆర్‌కు ఇబ్బందిగా మారింది.


ప్లేఆఫ్స్‌ నుంచి ఇప్పటికే మూడు టీమ్‌లు ఎలిమినేట్ కాగా.. టాప్ -4లో ఉండేందుకు ఏడు జట్లు రేసులో నిలిచాయి. మరి ఇప్పుడీ ఓటమితో కేకేఆర్‌పై ఎలాంటి ప్రభావం పడింది? కోల్‌కతాతోపాటు మిగతా జట్ల అవకాశాలు


ఎలా ఉన్నాయనేది ఓసారి చూద్దాం. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 12 మ్యాచులు ఆడగా వాటిలో 5 గెలిచింది. ఆరింట్లో ఓడి, ఒక మ్యాచ్‌ రద్దు కావడంతో 11 పాయింట్లు కేకేఆర్ ఖాతాలో ఉన్నాయి. మరో రెండు


మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మే 10న సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ ఉంది. అయితే, హైదరాబాద్‌లో వర్షం పడే సూచనలు ఉండటంతో మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడిన గత


మ్యాచ్‌ వర్షం కారణంగానే రద్దైంది. ఒకవేళ కేకేఆర్‌ సన్‌రైజర్స్‌తో పోరులో ఓడినా.. మ్యాచ్ రద్దైనా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లే. ఒకవేళ గెలిచినా.. మే 17న ఆర్సీబీతో మ్యాచ్‌ కూడా


కోల్‌కతాకు కీలకమే. రెండింట్లోనూ విజయం సాధించినా నాకౌట్‌కు చేరుకుంటుందనే భరోసా లేదు. మిగితా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. గుజరాత్ - బెంగళూరును దాటడం కష్టమే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో


గుజరాత్ టైటాన్స్ (16), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (16) చెరో పదకొండేసి మ్యాచులు ఆడేశాయి. ఇందులో ఎనిమిదేసి విజయాలు నమోదు చేశాయి. అంటే కోల్‌కతా ఈ రెండు టీమ్‌లను అధిగమించడం కష్టం. ఎందుకంటే


కేకేఆర్‌ మిగిలిన రెండింట్లోనూ గెలిచినా 15 పాయింట్లకు మించవు. అంటే టాప్‌-2లోకి వచ్చే ఛాన్స్‌ కోల్‌కతాకు లేదు. ఆర్సీబీ, జీటీ తమకున్న మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా చాలు ప్లేఆఫ్స్‌కు


వెళ్లిపోయినట్లే. అంతకుమించి విజయం సాధిస్తే టాప్‌-2లో కొనసాగడం ఖాయమవుతుంది.  పంజాబ్ - ముంబయి సరసన పంజాబ్ కింగ్స్‌కు ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సిఉంది. ప్రస్తుతం ఆ జట్టు 15 పాయింట్లతో మూడో


ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇందులో ఒక్కటి గెలిచినా చాలు. నాకౌట్‌కు వెళ్లకుండా పీబీకేఎస్‌ను ఆపలేం. ఇవాళ దిల్లీ క్యాపిటల్స్‌తో పంజాబ్ తలపడనుంది. ఇందులో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరువైనట్లే. అప్పుడు


కోల్‌కతా కన్ను ఇక ముంబయి ఇండియన్స్‌ పైనే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ముంబయి 12 మ్యాచుల్లో ఏడు విజయాలు సాధించి 14 పాయింట్లతో ఉంది. ఇంకా రెండు మ్యాచులు మాత్రమే మిగిలిఉన్నాయి. ఇందులో ఓడినా..


కేకేఆర్‌ తన రెండు మ్యాచుల్లో గెలిస్తే నాలుగో స్థానానికి చేరుకోవచ్చు. అలా జరగాలంటే కేవలం ముంబయి, పంజాబ్‌ జట్లవే కాదు మరో రెండు టీమ్‌ల ఫలితాలూ కేకేఆర్‌కు ముఖ్యమే. దిల్లీ - లఖ్‌నవూ కూడా..


దిల్లీ క్యాపిటల్స్‌ కూడా ఈ ప్లేఆఫ్స్‌ రేసులో ఉంది. ముంబయి, లఖ్‌నవూ, కోల్‌కతాతో పోలిస్తే దిల్లీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ జట్టు 11 మ్యాచుల్లో 13 పాయింట్లతో కొనసాగుతోంది. మిగిలిన మూడు


మ్యాచుల్లో కనీసం రెండు గెలిచినా చాలు నాకౌట్‌కు చేరుకోవడం డీసీకి ఈజీ అవుతుంది. ఇవాళ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌ ఫలితమూ కీలకమే. ఇందులో ఓడినా అవకాశం ఉంటుంది. లఖ్‌నవూ 11 మ్యాచుల్లో 10 పాయింట్లతో ఆరో


స్థానంలో ఉంది. మూడు మ్యాచులు గెలిస్తేనే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇందులో ఒక్కటి ఓడినా ఇబ్బందికరమే. అప్పుడు కోల్‌కతాకు చెక్‌ పడినట్లే. _- ఇంటర్నెట్ డెస్క్‌_


Trending News

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Delhi capitals | latest delhi capitals - eenadu

ముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్‌ జట్టు.. విల్‌జాక్స్‌, రికెల్‌టన్‌, కార్బిన్‌ బాష్‌ స్థ...

Punjab news | latest punjab news - eenadu

ప్రభుత్వ మార్పు ఊహాగానాల వేళ.. కేజ్రీవాల్‌- పంజాబ్ సీఎం భేటీ Arvind Kejriwal-Bhagwant Mann: దిల్లీలో పరాజయం, పంజాబ్‌లో ప...

‘aatmanirbharta’ named oxford hindi word of 2020 | dynamite news

‘AATMANIRBHARTA’ IMPLYING SELF-RELIANCE HAS BEEN NAMED BY OXFORD LANGUAGES AS ITS HINDI WORD OF THE YEAR 2020 AS IT “VAL...

ఆ కోళ్లు కాసులు కురిపిస్తున్నాయి..

రాజశ్రీ రకం కోళ్లు విజయనగరం ఫోర్ట్‌: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతక...

Latests News

Panchangam news: ఈరోజు పంచాంగం.. ఈ సమయంలో ఎలాంటి పనులు చేయొద్దు!

నేడు 2023 శుక్రవారం (భృగువాసరే) నవంబర్ 3, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, బహుళ పక్షం, దక్షిణాయణం, శరదృతువు. ఇవా...

Payyavula keshav | latest payyavula keshav - eenadu

ఏపీ బడ్జెట్‌.. ఆస్తుల సృష్టికి అత్యంత ప్రాధాన్యం మనకు వచ్చిన రాబడితో ఒక ఇల్లు కొన్నా.., స్థలం కొన్నా.. అది ఆస్తిగా ఉంటుం...

పేజి దొరకలేదు

Telugu Newsతెలుగుहिन्दीENGLISHবাংলাગુજરાતીঅসমীয়াಕನ್ನಡதமிழ்മലയാളംਪੰਜਾਬੀاردوଓଡ଼ିଆNews18 APP DOWNLOADfacebooktwitterinstag...

Hanamakonda: ఇప్ప పువ్వు లడ్డు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..!!

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Pm modi | latest pm modi - eenadu

ఉగ్రవాదుల అంతమే.. మన సంకల్పం ‘ప్రపంచంలోని ఉగ్రవాదుల అంతమే... మన సంకల్పం. పహల్గాం పేరు వింటేనే భారతీయుల్లో కోపం, ఉద్వేగం ...

Top