Prahlada rama rao: శత్రుమూకల్ని చీల్చి చెండాడిన ‘ఆకాశ్‌’... ప్రహ్లాద రామారావు ప్రసాదమే

Eenadu

Prahlada rama rao: శత్రుమూకల్ని చీల్చి చెండాడిన ‘ఆకాశ్‌’... ప్రహ్లాద రామారావు ప్రసాదమే"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌లోని (Pakistan) ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ‘ ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) ప్రపంచ వేదికపై మన సత్తాను చాటింది. ఉగ్ర లక్ష్యాలను అత్యంత


కచ్చితత్వంతో ఛేదించడమే కాకుండా.. ప్రత్యర్థి దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. ఇందులో ఆకాశ్‌ క్షిపణులు (Akash Missile) కీలక భూమిక పోషించాయి. శత్రు డ్రోన్లను, క్షిపణులను నేల కూల్చాయి. భూతలం


నుంచి గాల్లోకి ప్రయోగించే ఈ అస్త్రాలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) రూపొందించింది. ఆకాశ్‌ క్షిపణి రూపుదిద్దుకోవడంలోనూ, భారత


గగనతల రక్షణ వ్యవస్థ శత్రుదుర్భేద్యంగా మారడం వెనుక ఓ వ్యక్తి అవిరళ కృషి, పట్టుదల దాగి ఉన్నాయి. ఆయనే.. లెజండరీ డీఆర్‌డీవో శాస్త్రవేత్త ‘ప్రహ్లాద రామారావు’. (Prahlada Ramarao) ఆయన జీవితం


స్ఫూర్తిదాయకం ప్రహ్లాద రామారావు కర్ణాటకలోని పేరున్న కుటుంబంలో 1947లో జన్మించారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత ఆయనకు భారత్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (BEL), విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌


స్టేషన్‌ (VSSC)లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ, ఉద్యోగంలో చేరలేదు. తల్లి సలహా మేరకు ఉన్నత విద్య కోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (IISc)-బెంగళూరులో చేరారు. అక్కడ చదువుతున్న


రోజుల్లోనే డీఆర్‌డీఎల్‌-హైదరాబాద్‌లో ల్యాబ్‌లో పని చేసే అవకాశం వచ్చింది. అక్కడే భారత క్షిపణి పితామహుడిగా పేరొందిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాంను కలిశారు. అప్పటి నుంచి ఆయన్నే తన


మెంటార్‌గా ఎంచుకున్నారు. ఆయన బృందంతోనే కలిసి పని చేశారు. యువకుడైనా అనుభవంలో మిన్న 1970ల చివర్లో 1980ల ప్రారంభంలో అబ్దుల్‌ కలాం బృందం ఓ అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టింది. అదే ఇంటిగ్రేటెడ్‌


గైడెడ్‌ మిసైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (IGMDP). అగ్ని, పృథ్వీ, ఆకాశ్‌, త్రిశూల్‌, నాగ్‌ అనే ఐదు క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అప్పట్లో ఊహించని విధంగా కేంద్రం


దీనికి రూ.300 కోట్లు మేర భారీ బడ్జెట్‌ను కేటాయించింది. 1983లో ఐజీఎండీపీ పూర్తి అనుమతులు పొందింది. అందులో ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థ అభివృద్ధిని ప్రహ్లాద రామారావు తన భుజాలపైకి ఎత్తుకున్నారు. ఆయన


పట్ల అపారమైన నమ్మకంతో అబ్దుల్‌ కలాం ఈ విభాగాన్ని ఆయనకు అప్పగించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైన నాటికి రామారావు ఇంకా ముప్పైల్లోనే ఉన్నారు.  ఈ ఐదు క్షిపణి వ్యవస్థల్లోనూ ఆకాశ్‌కు ప్రత్యేకస్థానం


ఉంది. నేల నుంచి గాల్లోని లక్ష్యాలను ఛేదించే ‘ఆకాశ్‌’పై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్రం నుంచి కూడా ఒత్తిడి తీవ్రంగా ఉండేది. ఐజీఎండీపీ బడ్జెట్‌లోనూ దీనికే ప్రాధాన్యత ఇచ్చారు. క్షిపణి


అభివృద్ధి పూర్తయిన తర్వాత 1990లో ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. దశల వారీగా దానిని మెరుగుపరుస్తూ వచ్చారు. 2005 నాటికి గాల్లో వేగంగా వస్తున్న లక్ష్యాలను గుర్తించడంలో అత్యంత కచ్చితత్వం సాధించిన


ఆకాశ్‌.. భారత్‌ అమ్ములపొదిలో అజేయ అస్త్రంగా నిలిచింది. దీనివెనుక ప్రహ్లాద రామారావు అవిరళ కృషి దాగి ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆకాశ్‌ నా ‘ముద్దు బిడ్డ’ ఆకాశ్‌ క్షిపణిని తన ముద్దు


బిడ్డగా అభివర్ణిస్తారు ప్రహ్లాద రామారావు. అది తన లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఢీ కొట్టడం తన జీవితంలో గర్వించదగ్గ క్షణాల్లో ఒకటిగా చెబుతారు. 2000 సంవత్సరంలో డీఆర్‌డీవో నుంచి పదవీ విరమణ పొందిన


ఆయన.. డిఫెన్స్‌ టెక్నాలజీ యూనివర్సిటీ- పుణె ఉపకులపతిగా సేవలందించారు. ప్రపంచ ఇంధన సవాళ్లకు ఓ విప్లవాత్మకమైన పరిష్కారం కనుగొనేందుకు  కోల్డ్‌ ఫ్యూజన్‌ రియాక్టర్‌పై ప్రస్తుతం పరిశోధనలు


చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్‌పై ఆధిపత్యం చెలాయించడంలో ఆకాశ్‌ క్షిపణి పోషించిన పాత్రతో మరోసారి ఆయన పేరు దేశవ్యాప్తంగా ధ్వనిస్తోంది. భారతదేశంలోని పేరెన్నికగన్న శాస్త్రవేత్తల్లో ఒకరిగా ఆయన


పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. కేవలం ఆకాశ్‌ క్షిపణిలో మాత్రమే కాకుండా బ్రహ్మోస్‌ క్షిపణి తయారీలోనే ఆయన పాత్ర ఎనలేనిది. బ్రహ్మోస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గానూ ఆయన పని చేశారు. ఆయన సేవలకు


మెచ్చిన భారత ప్రభుత్వం 2015లో పద్మశ్రీతో సత్కరించింది.


Trending News

Andhra pradesh: వీర జవాన్ల కుటుంబాలకు అండగా సీఎం జగన్... భారీ ఆర్ధికసాయం

Published by: Last Updated:April 05, 2021 3:06 PM IST ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన...

Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండి

Published by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...

Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు..

Reported by: Published by: Last Updated:January 14, 2025 3:47 PM IST కాకినాడ జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం'...

Vivek plays a retired police officer in 'vellai pookkal'

The technical crew of _Vellai Pookkal_ includes Ramgopal Krishnaraju for music composition, with Jerald Peter cranking t...

Murti latest news in hindi, photos, videos on murti inextlive jagran

देश को दिल देने वाली कविता कृष्णमूर्ति का आज है जन्मदिन bollywood-masala7 years ago बॉलीवुड में अपने जबरदस्त गानों से लो...

Latests News

Prahlada rama rao: శత్రుమూకల్ని చీల్చి చెండాడిన ‘ఆకాశ్‌’... ప్రహ్లాద రామారావు ప్రసాదమే

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌లోని (Pakistan) ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ‘ ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Si...

Tata motors | latest tata motors - eenadu

TATA NEXON: టాటా నుంచి నెక్సాన్‌, నెక్సాన్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌.. ధర, ఫీచర్లు ఇవే..! Tata Nexon, Nexon EV launched: టాటా మో...

Astro tips : ఆదివారం ఈ పని అస్సలు చేయకండి.. చేస్తే ఆర్థికంగా నష్టపోతారు

ఇక మంగళ, గురు వారాల్లో గోళ్లు కత్తిరించకూడదని చాలా మందికి తెలిసే ఉంటుంది. శని, ఆది, మంగళ, గురు వారాల్లో గోళ్లను కత్తిరిస...

పరిశ్రమలకు వేగంగా నీటి కేటాయింపులు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటి కేటాయింపులను పారదర్...

Suresh sonthalia latest news in hindi, photos, videos on suresh sonthalia inextlive jagran

सिंहभूम चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री ने दिया धरना city-buzz12 years ago Jamshedpur: अगर छठ पूजा तक एनएच-33 को दुरुस्त ...

Top