Defence drills: దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్.. విద్యుత్ సరఫరా నిలిపివేత
Defence drills: దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్.. విద్యుత్ సరఫరా నిలిపివేత"
Play all audios:
ఆపరేషన్ అభ్యాస్‌లో భాగంగా దేశ రాజధాని సహా గుజరాత్, బిహార్, యూపీ తదితర రాష్ట్రాల్లో కొంత సమయం పాటు కరెంటు నిలిపివేసి మాక్ డ్రిల్ చేపట్టారు. ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు
దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ అభ్యాస్’ కింద సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ (Mock drill) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దేశ రాజధాని
సహా గుజరాత్, బిహార్, యూపీ తదితర రాష్ట్రాల్లో కొంత సమయం పాటు కరెంటు నిలిపివేసి డ్రిల్స్ చేపట్టారు. గ్రిడ్ సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాల్లో వివిధ సమయాల్లో వీటిని నిర్వహించారు.
దిల్లీలో రాత్రి 8 గంటల నుంచి 8.15 వరకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. దీనికి (Power Blackout) సహకరించాలంటూ అంతకుముందే స్థానికులకు న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) విజ్ఞప్తి చేసింది.
ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, మెట్రో స్టేషన్లు, ఇతర ముఖ్య ప్రదేశాలను మినహాయించారు. * ఆపరేషన్ ‘మేఘ్‌దూత్ నుంచి సిందూర్ ’ వరకు! బిహార్ రాజధాని
పట్నాలోనూ బ్లాక్‌అవుట్ పాటించారు. రాత్రి 7 గంటల నుంచి పదినిమిషాల పాటు కరెంటును నిలిపివేశారు. ఆరు జిల్లాల పరిధిలోని నగరాల్లో దీనిని పాటించారు. అత్యంత రద్దీగా ఉండే డాక్ బంగ్లా ప్రాంతంలో
ట్రాఫిక్ అంతా నిలిచిపోయింది. గుజరాత్‌లోనూ రాత్రి 7.30 నుంచి 8.30 మధ్య పవర్ బ్లాక్‌అవుట్ పాటించారు. రాంచీలోనూ కొన్ని ప్రాంతాల్లో కొంతసేపు కరెంటు నిలిపివేశారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని
శిమ్లాలో మాక్ డ్రిల్ చేపట్టారు. లఖ్‌నవూలోని రిజర్వ్ పోలీస్‌లైన్స్‌లో నిర్వహించిన మాక్ డ్రిల్‌ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షించారు. వీటితోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఇవి
కొనసాగాయి. రాత్రి సమయాల్లో వైమానిక దాడుల నుంచి కాపాడుకోవడంతోపాటు ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీటిని చేపట్టారు.
Trending News
Ed raids siddartha institutions linked to karnataka hm parameshwaraBENGALURU: The Directorate of Enforcement (ED) on Wednesday reportedly raided the premises of educational institutions b...
Ajay bhupathi: rx100 దర్శకుడికి గొల్డెన్ ఛాన్స్... ఏకంగా ఆ స్టార్ హీరో కొడుకుతో పాన్ ఇండియా సినిమా..!CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం.. 35 వేల ఉద్యోగ అవకాశాలుఅమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం పాలస...
Cbse results: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు వచ్చేశాయ్..CBSE Class 12 results: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మీ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుక...
గ్రేటర్‌లో కరోనా విజృంభణ: కీలక నిర్ణయంసాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరు...
Latests News
Defence drills: దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్.. విద్యుత్ సరఫరా నిలిపివేతఆపరేషన్ అభ్యాస్‌లో భాగంగా దేశ రాజధాని సహా గుజరాత్, బిహార్, యూపీ తదితర రాష్ట్రాల్లో కొంత సమయం పాటు కరెంటు నిలిపివేసి మ...
Jasprit bumrah: నా బౌలింగ్ సీక్రెట్ అదే : జస్ప్రీత్ బుమ్రాక్రికెట్లో పదునైన బౌలర్‌గా ఎదగాలంటే మజిల్ మెమొరి ముఖ్యమని టీమ్ ఇండియా తురుపుముక్క జస్ప్రీత్ బుమ్రా వెల్లడించాడు. తన ...
Anurag thakur | latest anurag thakur - eenaduబీఎఫ్‌ఐ ఎలక్టోరల్ కాలేజ్ లిస్ట్ నుంచి అనురాగ్ ఠాకూర్ పేరు తొలగింపు! బీఎఫ్‌ఐ ఎలక్టోరల్ కాలేజ్ లిస్ట్ నుంచి అనురాగ్ ...
Jasprit bumrah: నా బౌలింగ్ సీక్రెట్ అదే : జస్ప్రీత్ బుమ్రాక్రికెట్లో పదునైన బౌలర్‌గా ఎదగాలంటే మజిల్ మెమొరి ముఖ్యమని టీమ్ ఇండియా తురుపుముక్క జస్ప్రీత్ బుమ్రా వెల్లడించాడు. తన ...
Ys sharmila | latest ys sharmila - eenaduమీరు పోషించిన కాలకేయులే వారు ‘మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు. అధికారాన్ని అడ్డం ...