Nota: ‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
Nota: ‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు"
Play all audios:
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై ఎన్నికల సంఘానికి (Election Commission)
సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ
సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలయ్యింది. దీనిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. ఈ అంశంపై భారత ఎన్నికల సంఘానికి (Election Commission) నోటీసులు జారీ చేసింది. శివ్ ఖేరా అనే రచయిత
పిల్ (PIL) ద్వారా లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం అంగీకరించింది. నోటా
కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను తదుపరి ఎన్నికల్లో (ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో) పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు రూపొందించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా నోటాను ‘కల్పిత
అభ్యర్థి’గా తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలను రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇటీవల సూరత్‌లో పోలింగ్
జరగకుండానే ఓ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన తీరును ప్రస్తావించారు. పిటిషనర్ చేసిన ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. ఈసీకి నోటీసులు పంపించింది. ఇది కూడా ఎన్నికల ప్రక్రియలో
భాగమేనని, దీనిపై ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దామని పేర్కొంది. 100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL)
వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈవీఎంలలో నోటా (Non Of The Above) ఆప్షన్ కల్పించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే.. ఈ ‘నోటా’ మీట
నొక్కే సదుపాయం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఉండవు. ఇటువంటి సందర్భంలో ఎవరికి ఎక్కువగా ఓట్లు వస్తే ఆ అభ్యర్థినే విజేతగా
ప్రకటిస్తారు.
Trending News
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
కరోనా సెకండ్ వేవ్ వస్తోందిబుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందని, ఇప్పటికే...
Gallstones: 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయంలో 8,125 రాళ్లుదేశ రాజధాని దిల్లీలోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. 70 ఏళ్ల వృద్ధుడి ప...
వేలి ముద్రలు పడకపోయినా రేషన్సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి...
‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగుసాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రె...
Latests News
Nota: ‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులుఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని క...
Iphone | latest iphone - eenaduవిజువల్ లుక్ అప్ వాడుతున్నారా? గూగుల్ లెన్స్ తరహాలో యాపిల్ సంస్థ తమదైన విజువల్ లుక్ అప్ వర్షన్‌ను తీసుకొచ్చింది...
Non veg | recipes, dishes and items - eenaduముంతాజ్ హరియాలీ చికెన్ బిర్యానీ కావాల్సినవి: బాస్మతి బియ్యం- అర కిలో, చికెన్- కిలో, పెరుగు- పావుకిలో, అల్లంవెల్లుల్లి...
Priyanka chopra left bharat latest news in hindi, photos, videos on priyanka chopra left bharat inextlive jagranतस्वीरें : 'लवरात्री' के प्रमोशनल इवेंट पर 'भारत' को मिली लाइम लाइट, सलमान ने प्रियंका के लिए कही ये...
Priyanka chopra twitter latest news in hindi, photos, videos on priyanka chopra twitter inextlive jagranबॉलीवुड स्टार्स का ट्विटर स्टेटस नहीं है किसी पहेली से कम, खुद ही देख लीजिए bollywood-masala8 years ago ट्विटर पर अक्स...