Jyoti malhotra: పాక్ కోసం గూఢచర్యం.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై ప్రశ్నల వర్షం
Jyoti malhotra: పాక్ కోసం గూఢచర్యం.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై ప్రశ్నల వర్షం"
Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ఐఏ,
ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు వివిధ కోణాల్లో ఆమె నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్‌ల్లో ఆమె చేసిన పర్యటనలపై వారు ప్రధానంగా
దృష్టిసారించారు. ‘‘నిందితురాలిని విచారించేందుకు ఎన్ఐఏ బృందం ఇక్కడికి వచ్చింది’’ అని హిస్సార్ ఎస్పీ శశాంక్‌కుమార్ సావన్ మీడియాకు వెల్లడించారు. ‘‘ఇప్పటివరకు సేకరించిన సమాచారం ప్రకారం 2018లో
ఆమెకు పాస్‌పోర్టు వచ్చింది. 2028 వరకు దానికి గడువు ఉంది. పాస్‌పోర్టు వచ్చినప్పటినుంచి ఆమె పాకిస్థాన్, చైనా, దుబాయ్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇండోనేసియాల్లో
ప్రయాణించింది. ఆ పర్యటనల గురించి సమాచారం సేకరిస్తున్నాం’’ అని ఓ అధికారి వివరాలు వెల్లడించారు. * కీలక సమాచారం శత్రువుకు ‘‘ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి అప్పగించే
అంశాన్ని హోంశాఖ పరిగణనలోకి తీసుకోవచ్చు. పాక్ హైకమిషన్ అధికారులు, పాక్ ఇంటిలిజెన్స్ విభాగానికి చెందిన వ్యక్తులు.. ప్రచారం కోసం, సమాచారాన్ని సేకరించడానికి ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లను
ఉపయోగించుకుంటున్న కుట్ర కోణాన్ని దర్యాప్తు చేసేందుకు ఆ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది’’ అని ఇంకో అధికారి తెలిపారు. తాజా అరెస్టులతో భారత్‌లో గూఢచర్యం నెట్‌వర్క్‌ను నిర్వహించడానికి
సాంకేతికతను ఉపయోగించుకుంటున్న తీరు బయటపడిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పాక్-అఫ్గాన్ సరిహద్దు వరకు జ్యోతికి సంబంధాలు ఉన్నాయని తెలిపాయి. ఆ సరిహద్దు ప్రాంతం ఉగ్రవాద కార్యకలాపాలకు పేరు
పొందింది. అలాగే మనుషుల సంచారంపై ఆంక్షలు ఉన్నాయి. పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్వర్క్ (Spy Network)పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి
మల్హోత్రా సహా 12 మందిని అరెస్టు చేశారు. పంజాబ్‌లో ఆరుగురు, హరియాణాలో ఐదుగురు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈమేరకు చర్యలు
తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందన్నారు. వారి ఆర్థిక లావాదేవీలను సునిశితంగా
పరిశీలిస్తున్నామని, ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా జరుగుతోందని చెప్పారు.
Trending News
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ(C...
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Stock market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 25 వేల ఎగువన నిఫ్టీStock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో, మెటల్ స్టాక్స్ అండతో సూచీల...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని తల్లి, కుమారుడు మృతిఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటున్న వారిపైకి కారు దూసు...
Latests News
Jyoti malhotra: పాక్ కోసం గూఢచర్యం.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై ప్రశ్నల వర్షంఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Ma...
Malavika mohanan gives us bandhani dupatta and gold-toned jewellery goalsHome Fashion Bollywood wardrobe Bollywood Wardrobe Devika Tripathi on July 28, 2020 Malavika Mohanan's Instagram fe...
Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...
మే 11న తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు2025 Results | తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. By Features Desk Updated : 09 May 2025 17:22 IST Ee ...
Bhadradri news | latest bhadradri news - eenaduభద్రాచల రాముడికి పేటెంట్ తీసుకుంటాం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పేరుతో ఎలాంటి అనుమతి లేకుండా కల్యాణా...