Iran: ఇరాన్‌లో కిడ్నాప్‌ అయిన భారత యువకులు క్షేమం.. ఎంబసీ పోస్ట్‌

Eenadu

Iran: ఇరాన్‌లో కిడ్నాప్‌ అయిన భారత యువకులు క్షేమం.. ఎంబసీ పోస్ట్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌ (Iran)లో గత నెల అదృశ్యమైన ముగ్గురు భారత యువకుల ఆచూకీ లభించింది. దుండగుల చెరలో ఉన్న బాధిత యువకులను (Indians) టెహ్రాన్‌ పోలీసులు కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఈ


విషయాన్ని భారత్‌లోని ఇరాన్‌ ఎంబసీ ‘ఎక్స్‌’ పోస్ట్‌లో వెల్లడించింది. పంజాబ్‌కు చెందిన సంప్రీత్, అమృత్‌పాల్, జస్పాల్‌.. ఉద్యోగాల కోసం ఏజెంట్ల సాయంతో దిల్లీ మీదుగా డంకీ  ఆస్ట్రేలియాకు


బయల్దేరారు. వారిని తీసుకువెళ్లిన ఏజెంట్లు తాత్కాలికంగా బస చేద్దామని నమ్మించి ఇరాన్‌ తీసుకెళ్లారు. అక్కడ వీరు కిడ్నాప్‌నకు గురైనట్లు బాధిత యువకుల కుటుంబ సభ్యులు పంజాబ్‌లోని అధికారులను


ఆశ్రయించారు. విడుదల చేయాలంటే డబ్బు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. * పాకిస్థాన్‌ జైల్లోంచి 216 మంది ఖైదీల పరారీ దీంతో దీంతో పంజాబ్‌ ప్రభుత్వం ఈ విషయాన్ని ఇరాన్‌లోని


భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లింది. వారు సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన టెహ్రాన్‌ పోలీసులు యువకుల కోసం గాలింపు చేపట్టారు. దక్షిణ టెహ్రాన్‌లోని


వెరామిన్‌ ప్రాంతంలో బందీలుగా ఉన్న వీరిని విడిపించారు. ప్రస్తుతం ఈ కేసును ఇరాన్‌ విదేశీ వ్యవహారాల శాఖలోని కాన్సులర్ విభాగం పరిశీలిస్తోందని, సంబంధిత న్యాయ అధికారులతో చర్చలు జరుపుతోందని ఎంబసీ


పేర్కొంది. ఈ కేసు న్యాయ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు టెహ్రాన్‌లోని భారత ఎంబసీతో పంచుకుంటున్నట్లు తెలిపింది. మోసపూరిత వ్యక్తులు, అక్రమ ఏజెన్సీలు చెప్పే మాటలు నమ్మి ఉద్యోగాల


కోసం చట్టవ్యతిరేక మార్గాల్లో ఇతర దేశాలకు రావొద్దని ఎంబసీ సూచించింది.


Trending News

Honda Amaze: తక్కువ ధరకే లగ్జరీ కారు.. అబ్బురపరిచే ఫీచర్స్! లాంచింగ్ ఎప్పుడంటే

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Popular comedian Bithiri Sathi assaulted for alleged ‘anti-Telangana’ statements

Comedian Chevella Ravi, popularly known as Bithiri Satti after the name of his character in the show Teenmaar News, was ...

Polavaram-banakacharla: ‘పోలవరం-బనకచర్ల’పై కేంద్రం ముందుకు ఏపీ ప్రతిపాదనలు

అమరావతి: ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకెళ్లనుంది. పోలవరం నుంచి బనకచర్లకు ...

Peddapalli: పిల్లలకి ఇవి ఖచ్చితంగా తినిపించాలట.. డాక్టర్ మాటలు విందామా!

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Telangana rains: godavari reaches third flood warning mark at bhadrachalam

The Godavari river reached the third level flood warning at Bhadrachalam in Telangana on Monday, July 11, prompting auth...

Latests News

Iran: ఇరాన్‌లో కిడ్నాప్‌ అయిన భారత యువకులు క్షేమం.. ఎంబసీ పోస్ట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌ (Iran)లో గత నెల అదృశ్యమైన ముగ్గురు భారత యువకుల ఆచూకీ లభించింది. దుండగుల చెరలో ఉన్న బాధిత యువక...

Jagdeep dhankhar: ‘ఆపరేషన్‌ సిందూర్‌.. ’ ఉగ్రమూకలు ఎక్కడున్నా ఏరివేస్తామనే సందేశం ఇచ్చాం: ఉపరాష్ట్రపతి

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (operation Sindoor)పై ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖ...

Nara lokesh: ఏపీ మంత్రి వాట్సాప్ బ్లాక్.. సమస్యలను ఈమెయిల్ ద్వారా పంపమని ప్రజలకు రిక్వెస్ట్

పాదయాత్రలో యువతకు తనను దగ్గరగా చేర్చిన "హలో లోకేష్" కార్యక్రమం పేరుతోనే ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న మంత్రి...

Variyamkunnath and nuances of the malabar rebellion: author manu s pillai interview

Broadly, we find that first the rebellion focussed on attacking government offices and prominent landlords, not least to...

Shreyas iyer | latest shreyas iyer - eenadu

మా అభిమాన క్రికెటర్లు వీళ్లే! క్రికెట్‌ చూసేవాళ్లకి తప్పకుండా ఓ ఫేవరెట్‌ ఆటగాడు ఉంటాడు. బరిలోకి దిగి ఆడే క్రీడాకారులకు క...

Top