Operation sindoor: భారత వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Eenadu

Operation sindoor: భారత వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం"

Play all audios:

Loading...

భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసే సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచాలని పలు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్‌డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో దేశ వ్యతిరేక


ప్రచారంపై నిఘా ఉంచాలని కేంద్ర హోంశాఖ (MHA) పలు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) పేరుతో పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిన సంగతి


తెలిసిందే. ఈ ఆపరేషన్‌ అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) పలు రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఆ సమావేశంలో హోం మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు


చేసినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి.   ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం పాక్‌ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌ వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తోంది.


ఈక్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోంశాఖ పలు సూచనలు చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి, భారత్‌ భద్రత గురించి తప్పుడు కథనాలు వ్యాప్తి చేసే ఖాతాలపై కఠిన చర్యలు


తీసుకోవాలని ఆదేశించింది. దేశం నుంచి లేదా విదేశాల నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఆయా సోషల్ మీడియా (Social Media) ఖాతాలను వెంటనే బ్లాక్‌ చేయాలని పేర్కొంది. ఈసందర్భంగా సరిహద్దు


ప్రాంతాల్లోని ప్రభుత్వాలకు, భద్రతా దళాలకు మధ్య కమ్యూనికేషన్‌ సంబంధాలు పెంచాలని పిలుపునిచ్చింది. * రాజస్థాన్‌లో పాక్‌ బోర్డర్‌ సీల్‌.. పంజాబ్‌లో హైఅలర్ట్‌..! మంగళవారం అర్ధరాత్రి వేళ..


పాకిస్థాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్‌ విరుచుకుపడింది. అక్కడి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 80 మంది ఉగ్రవాదులను హతమార్చి పహల్గాం దాడికి భారత్‌


ప్రతీకారం తీర్చుకుంది.


Trending News

Ekadanta sankashti chaturthi 2023: date, timings, significance and rituals

Krishna Paksha Chaturthi tithi of Jyeshtha month is called 'Ekadanta Sankashti Chaturthi'. Worshipping Lord Ga...

Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris

“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...

Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bail

KOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...

Operation sindoor: భారత్‌కు సహనం నశించింది.. పాక్‌కు లెక్క సరిచేసింది..

ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌కు సహనం నశించింది. ఉగ్రమూక అమాయకుల ప్రాణాలు తీయడమే కాక..  మీ ప్రధానికి వెళ్ల...

Pawan kalyan - shruti hassan: ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ విష‌యంలో తోపు అంటున్న శ్రుతి!

Published by: Last Updated:February 27, 2021 9:59 PM IST PAWAN KALYAN - SHRUTI HASSAN: మీరేమైనా చెప్పండి! ఎన్న‌యినా చెప్...

Latests News

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Thopudurthi prakash reddy: పోలీసు విచారణకు హాజరైన వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (Thopudurthi Prakash Reddy) శ్రీసత్యసాయి జిల్లా సీకేపల్లి పీఎస్‌లో పోలీస...

Modi on operation sindoor: ఆపరేషన్ సిందూర్.. మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే

ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడులు చేసింది. దీనికి సంబంధించి బుధవారం క్యాబినెట్ సమావేశం జరిగింద...

Operation sindoor: భారత వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసే సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచాలని పలు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదే...

Costly color: ఈ రంగు గోల్డ్ కంటే ఖరీదైనది.. దాని పేరు, ప్రత్యేకత తెలిస్తే షాక్ అవుతారు

రంగుల పండుగ హోలీలో అందరూ రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలంతో సహా ఇతర రంగులు మార్కెట్లో ...

Top