Pakistani intruder: చొరబాటుకు యత్నం.. పాక్ జాతీయుడిని కాల్చివేసిన బీఎస్ఎఫ్
Pakistani intruder: చొరబాటుకు యత్నం.. పాక్ జాతీయుడిని కాల్చివేసిన బీఎస్ఎఫ్"
Play all audios:
సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో చొరబాటుకు యత్నించిన దుండగుడిని బీఎస్ఎఫ్ (BSF) జవాన్లు కాల్చివేశారు. (ప్రతీకాత్మక చిత్రం) Operation Sindoor| ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌లోకి
చొరబాటుకు యత్నించిన పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని సరిహద్దు భద్రతా దళానికి (BSF) చెందిన జవాన్లు కాల్చివేశారు. బుధవారం అర్ధరాత్రి పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ సెక్టార్లో ఈ ఘటన జరిగింది. చీకటిలో
ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యక్తి దూసుకురావడాన్ని గమనించి ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. తర్వాత మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. అతని దగ్గర నుంచి పాకిస్థాన్‌లో తయారైన వ్యవసాయ రసాయనాలను
స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతున్నవేళ.. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ విరుచుకుపడింది. సరిహద్దుకు
ఆవల 100 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ తరుణంలో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకొంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు పెంచారు. * ఉగ్రమూకపై రుద్రతాండవం రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల
వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే.. కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. పంజాబ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకొంది. సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది. జమ్మూకశ్మీర్‌లో నేడు కూడా
పాకిస్థాన్ దళాలు శతఘ్ని గుండ్లను కాలుస్తున్నాయి. దీంతో మన సైన్యం దీటుగా బదులిస్తోంది. పౌర నివాసాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. ఇప్పటికే వీటిల్లో ఒక జవాన్ సహా 13 మంది
చనిపోయారు. ఈ పరిణామాల వేళ భారత వాయుసేన అత్యంత అప్రమత్తత పాటిస్తోంది.
Trending News
20 వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్డౌన్ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...
Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగోAP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...
నేత కార్మికులకు అండగా సీఎం జగన్'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...
నాలుగేళ్ల ప్రేమ విషాదాంతంశిరీష, వెంకటేష్ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...
Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...
Latests News
Pakistani intruder: చొరబాటుకు యత్నం.. పాక్ జాతీయుడిని కాల్చివేసిన బీఎస్ఎఫ్సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో చొరబాటుకు యత్నించిన దుండగుడిని బీఎస్ఎఫ్ (BSF) జవాన్లు కాల్చివేశారు. (ప్ర...
Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeatTo Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...
‘Aatmanirbharta’ named Oxford Hindi word of 2020‘Aatmanirbharta’ implying self-reliance has been named by Oxford Languages as its Hindi word of the year 2020 as it “val...
మహాత్మా గాంధీ హత్య: కోర్టులో గాడ్సే ఏం చెప్పారు? సర్దార్ పటేల్ మీద ఆరోపణలేమిటి? హత్యకు ముందు పరిణామాలేమిటి? - bbc news తెలుగుమహాత్మా గాంధీ హత్య: కోర్టులో గాడ్సే ఏం చెప్పారు? సర్దార్ పటేల్ మీద ఆరోపణలేమిటి? హత్యకు ముందు పరిణామాలేమిటి? కథనం * రచయిత...
Saif ali khan: సైఫ్‌పై దాడి.. నిందితుడు బంగ్లాదేశీయుడుబాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు శనివారం పట్టుకున్నారు. ప్రాథమిక ...