Credit cards: ఈ 7 సందర్భాల్లో మీ క్రెడిట్‌ కార్డును జాగ్రత్తగా వాడండి

Eenadu

Credit cards: ఈ 7 సందర్భాల్లో మీ క్రెడిట్‌ కార్డును జాగ్రత్తగా వాడండి"

Play all audios:

Loading...

క్రెడిట్‌ కార్డు ఒక ప్రముఖ ఆర్థిక సాధనమని మనందరికీ తెలిసిందే. ఇది స్వల్పకాలిక రుణ అవకాశాన్నిస్తూ, కార్డుదారుడి కొనుగోలు శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా, క్రెడిట్‌ కార్డుల ద్వారా


చెల్లింపులు..సురక్షితమైన, వేగవంతమైన ప్రక్రియగా ఉండడం వల్ల చాలా మంది ఇలాంటి లావాదేవీలపై ఆసక్తి చూపుతుంటారు. క్రెడిట్‌ కార్డులు అందించే కొన్ని ఆకర్షణీయ ప్రయోజనాల వల్ల చాలా మంది అన్ని రకాల


ఖర్చులకు..రెండవ ఆలోచన లేకుండా కార్డు స్వైప్‌ చేయడానికే మొగ్గుచూపుతారు. దీనివల్ల కొనుగోళ్లకు క్రెడిట్‌ కార్డులపై పూర్తిగా ఆధారపడతారు. అయితే, ఇది కచ్చితంగా అన్ని రకాల ఖర్చులకు, చెల్లింపులకు


ఉత్తమమైంది కాదు. క్రెడిట్‌ కార్డును కొన్ని ఖర్చులకు/చెల్లింపులకు ఉపయోగించకూడని సందర్భాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. ఇంటి ఖర్చులు అనేక ఆన్‌లైన్ స్టోర్స్‌/సంస్థలు మీకు రివార్డ్


పాయింట్లను సంపాదించగల కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను అందిస్తుంటాయి. దీనివల్ల చాలా మంది వ్యక్తులు క్రెడిట్ కార్డులతో తమ రోజువారీ షాపింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. చాలా మంది, తమకు


కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ లేకపోయినా, సాధారణ క్రెడిట్ కార్డ్ కనీస కొనుగోలు పరిమితిని సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఒక మంచి క్రెడిట్ కార్డు వార్షిక ఛార్జీలను మాఫీ చేయగలదు లేదా మంచి


రివార్డులను సంపాదించగలదు. అయితే, కిరాణా సామాగ్రి, ఇంటి అద్దె మొదలైన మీ నెలవారీ ఖర్చులను కూడా కార్డుతో చెల్లించడం వల్ల మీ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది, అన్ని ఖర్చులకు


క్రెడిట్ కార్డును ఉపయోగించే అలవాటును కూడా పెంచుతుంది. సమయానికి బిల్లు చెల్లించలేకపోతే ఇలాంటివి దీర్ఘకాలంలో భారీ రుణాన్ని సృష్టిస్తాయి. ఈ రుణాలను తిరిగి చెల్లించడం సవాలుగా మారుతుంది.


అందువల్ల, మీ ఇంటి ఖర్చులన్నింటికీ మీ క్రెడిట్ కార్డును ఉపయోగించడం మంచిది కాదు. కొన్నింటికి నగదును ఉపయోగించడమే ఆర్థికంగా మేలు చేస్తుంది. ఈఎంఐలు మీ నెలవారీ రుణ చెల్లింపులను క్రెడిట్ కార్డ్‌తో


చెల్లించడం సర్వసాధారణం కానప్పటికీ, అనేక ఫిన్‌టెక్ కంపెనీలు, యాప్ ఆధారిత రుణ సంస్థలు, తక్షణ రుణ సౌకర్యం కల్పించే సంస్థలు..క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రుణ చెల్లింపులను చేసే సౌకర్యాన్ని అందించడం


ప్రారంభించాయి. కొన్ని సందర్భాల్లో మీకు నగదు కొరత ఉండొచ్చు. అలాంటప్పుడు క్రెడిట్ కార్డ్ సహాయంతో మీ EMIలను చెల్లించడం సౌకర్యంగా ఉంటుందని మీరు తప్పక భావిస్తారు. అయితే, మీరు క్రెడిట్ కార్డ్


బిల్లును గడువు తేదీలోపు తిరిగి చెల్లించలేకపోతే, ఇలాంటి రుణ చెల్లింపులు మీకు చాలా ఖరీదైనదిగా మారతాయి. ఇది రుణం కాబట్టి, మీరు ఇప్పటికే దానిపై వడ్డీని చెల్లిస్తుంటారు. మీ క్రెడిట్ కార్డ్


బకాయిలను తిరిగి చెల్లించలేకపోవడం వల్ల దానిపై కూడా వడ్డీ పెరుగుతుంది. దీనివల్ల రుణ బాధ్యతలు మరింతగా పెరిగిపోతాయి. కాబట్టి, రుణ చెల్లింపులకు క్రెడిట్‌ కార్డును ఉపయోగించకపోవడమే మేలు. ఖరీదైన


కొనుగోళ్లు కొంత మంది కార్డుదారులు తక్షణ ఆర్థిక ఒత్తిడి లేకుండా ఉండడానికి క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఖరీదైన కొనుగోళ్లు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే, తిరిగి చెల్లించే సమయం దగ్గరకు


వచ్చేసరికి వారికి టెన్షన్‌ తప్పదు. వాస్తవానికి, మీరు నిర్ణీత సమయంలో తిరిగి చెల్లించలేని ఖరీదైన కొనుగోళ్లు చేయడం వల్ల రుణ ఉచ్చులో చిక్కుకుంటారు. అందుచేత, మీ క్రెడిట్ కార్డులను తెలివిగా


ఉపయోగించడం చాలా ముఖ్యం. సకాలంలో చెల్లింపులు చేస్తారని మీరు కచ్చితంగా భావించినప్పుడు లేదా అవకాశం ఉన్నప్పుడు మాత్రమే కార్డు ద్వారా ఖరీదైన కొనుగోళ్లకు వెళ్లాలి. మరికొంత మంది కార్డుదారులు ఖరీదైన


ఉత్పత్తులు, సేవలకు ఖర్చులు చేసి, వాటిని తిరిగి చెల్లించలేకపోయినా, క్రెడిట్ కార్డ్ EMI సౌకర్యాన్ని ఎంచుకోవాలని ప్లాన్‌ చేస్తుంటారు. క్రెడిట్ కార్డులపై అధిక వడ్డీ రేటు ఉంటుందని గమనించాలి. 


కాబట్టి, ఖరీదైన కొనుగోళ్లు చేసినప్పుడు దాన్ని తీర్చడానికి తగిన ప్లాన్‌ కూడా ముందు నుంచి సిద్ధం చేసుకోవాలి లేదా ఇలాంటి కొనుగోళ్లకై క్రెడిట్ కార్డును వాడకూడదు. నగదు అడ్వాన్స్ క్రెడిట్ కార్డ్


ద్వారా నగదు ఉపసంహరించడం..తక్షణమే డబ్బు పొందడానికి ఒక మార్గం. కొంత మంది కార్డుదారులు క్రెడిట్ కార్డుపై క్యాష్ అడ్వాన్స్, డెబిట్ కార్డులా కార్డును స్వైప్ చేయడం లాంటిదని అనుకుంటారు. కానీ,


క్రెడిట్ కార్డు సంస్థ అడ్వాన్స్‌ మొదటి రోజు నుంచే వడ్డీని వసూలు చేస్తుంది. వడ్డీతో పాటు, క్యాష్ అడ్వాన్స్ రుసుము కూడా వసూలు చేస్తుంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించడం ద్వారా మీరు తీసుకున్న దానికంటే


చాలా ఎక్కువ, అంటే నెలకు 3% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతుంది. కాబట్టి, క్రెడిట్ కార్డుతో క్యాష్ అడ్వాన్స్ తీసుకోవడం అర్ధవంతం


కాదు. మీకు ఏదైనా అత్యవసర పరిస్థితికి డబ్బు అవసరమైతే, క్యాష్ అడ్వాన్స్‌కు బదులు వెంటనే పొందగలిగే వ్యక్తిగత రుణాల కోసం బ్యాంకులు, NBFCలను సంప్రదించి తక్కువ వడ్డీ రేటుకు రుణాన్ని తీసుకోవడం


మేలు. ఇలాంటి వ్యక్తిగత రుణాలకై ఎల్లప్పుడు మంచి క్రెడిట్‌ స్కోరును నిర్వహించడం ఇంకా మంచిది. అంతర్జాతీయ ప్రయాణాలు అంతర్జాతీయ ప్రయాణ ఖర్చులకు క్రెడిట్‌ కార్డును ఉపయోగించవచ్చు. అయితే, మీ


క్రెడిట్ కార్డ్‌ను భారతదేశం బయట స్వైప్ చేసినప్పుడల్లా, కార్డు ప్రొవైడర్ మీ వద్ద విదేశీ లావాదేవీ రుసుమును వసూలు చేస్తారని తెలుసుకోవాలి. అది స్థిరంగా లేదా లావాదేవీ మొత్తంలో ఒక శాతంగా ఉండవచ్చు.


ఈ ఛార్జీలు మీ అంతర్జాతీయ ఖర్చులను మరింత ఖరీదైనవిగా చేస్తాయి. అందువల్ల, విదేశీ లావాదేవీల రుసుములను నివారించడానికి, మీ లావాదేవీలను మరింత సురక్షితంగా ఉంచడానికి, ఫారెక్స్ కార్డులను ఉపయోగించడం


మంచిది. ఈ ప్రీ-లోడెడ్ కార్డులు పోయినా లేదా చోరికి గురయినా, కార్డులో లోడ్ చేసిన మొత్తం మాత్రమే రిస్క్‌లో ఉంటుంది. అదే క్రెడిట్‌ కార్డు అయితే, కార్డు పరిమితి మేరకు కోల్పోయే అవకాశముంటుంది.


వైద్య బిల్లులు వైద్య అత్యవసర పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు. మీకు ఆరోగ్య బీమా పాలసీ లేకపోతే, వైద్య బిల్లులను నిర్వహించడం సవాలుగానే ఉంటుంది. అయితే,, మీ వైద్య బిల్లులను చెల్లించడానికి క్రెడిట్


కార్డును ఉపయోగించడం మంచి ఎంపిక కాదు. వైద్య చికిత్సలు ఖరీదైనవి కాబట్టి, తదుపరి బిల్లింగ్ చక్రంలో మీ బకాయిలను పూర్తిగా క్లియర్ చేయలేకపోవచ్చు. ఇలాంటప్పుడు క్రెడిట్ కార్డ్‌లో అధిక బకాయి


బ్యాలెన్స్, అధిక వడ్డీ రేటు..ఖర్చును మరింతగా పెంచుతాయి. అందువల్ల ఏదో ఒక అత్యవసర సందర్భంలో తప్ప వైద్య బిల్లులకు క్రెడిట్‌ కార్డును తరచూ వాడకపోవడమే మంచిది. ఇందుకు గానూ, సరైన ఆరోగ్య బీమా


పాలసీతో మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడం ఉత్తమం. బీమా కవర్ లేనివారికి అత్యవసరంగా డబ్బు అవసరమైతే, వ్యక్తిగత రుణాన్ని తీసుకోవడం మేలు. సాధారణంగా, క్రెడిట్ కార్డులతో పోలిస్తే ఇవి తక్కువ వడ్డీ


రేట్లను కలిగి ఉంటాయి. డౌన్‌ పేమెంట్‌ ఇల్లు, కారు లాంటి రుణాలకు డౌన్‌ పేమెంట్‌ తప్పనిసరి. కొన్నిసార్లు డౌన్ పేమెంట్‌ మొత్తం చెల్లించడం కూడా కొంత మందికి ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా. గృహ రుణం


వంటి పెద్ద రుణాలకు నగదు కొరతలో ఉండి డౌన్ పేమెంట్ చెల్లించడానికి ఇబ్బంది పడుతుంటే, కొందరు వ్యక్తిగత రుణం లేదా క్రెడిట్ కార్డ్ క్యాష్ అడ్వాన్స్‌ను ఎంచుకోవాలని భావిస్తారు. అయితే, డౌన్‌ పేమెంట్‌


చెల్లించడానికి..క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా ఇతర రుణం తీసుకున్నా అది మంచిది కాదు. అధిక వడ్డీతో తీసుకున్న డబ్బుతో డౌన్ పేమెంట్ చెల్లించడం వల్ల అది కూడా మీకు భారమవుతుంది. ముఖ్యంగా, డౌన్ పేమెంట్


కూడా మీరు చెల్లించలేకపోతున్నారంటే మీకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లే. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రుణాల అసలు, వడ్డీ మీకు మరింత భారమవుతాయి. కాబట్టి, డౌన్‌పేమెంట్‌కు సరిపడా నగదు మీ వద్ద


సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే పెద్ద రుణాలకు వెళ్లడం మేలు.


Trending News

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

రూపాయి.. రూపాయి నువ్వేం చేస్తావు..? ఎంతటి ఘోరానికి కారణమైందో చూడండి

Reported by: Published by: Last Updated:April 12, 2023 10:04 PM IST గొడ్డలి, రోకలిబండలతో ఆయన కుటుంబ సభ్యులు చేసిన దాడిలో...

Delhi: దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ బీసీ నేతల సభ

దిల్లీ : తెలంగాణ కాంగ్రెస్‌ బీసీ నేతల సభ దిల్లీలో జరిగింది. కులగణనపై రాహుల్‌ గాంధీకి అభినందనలు తెలుపుతూ ఈ సభను నిర్వహించ...

Nadendla manohar: రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసరాలు.. డీలర్లు సిద్ధం కావాలి: మంత్రి నాదెండ్ల

విజయవాడ: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ ...

Anasuya bharadwaj: ‘ఆంజనేయస్వామి మా ఇంటికి వచ్చారు’.. కొత్త ఇంట్లో అనసూయ ఎమోషనల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: యాంకర్‌గా, నటిగా వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న అనసూయ (Anasuya Bharadwaj) కొత్...

Latests News

Credit cards: ఈ 7 సందర్భాల్లో మీ క్రెడిట్‌ కార్డును జాగ్రత్తగా వాడండి

క్రెడిట్‌ కార్డు ఒక ప్రముఖ ఆర్థిక సాధనమని మనందరికీ తెలిసిందే. ఇది స్వల్పకాలిక రుణ అవకాశాన్నిస్తూ, కార్డుదారుడి కొనుగోలు ...

Srisailam: ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం.. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రుల సమీక్ష

శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రులు కీలక సమీక్ష నిర్వహించారు. మల్లన్నను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఇబ్...

Neha bhandari: కళ్లెదుటే శత్రువున్నా వెరవని నారీమణి.. ‘సిందూర్‌’కు సిసలైన అర్థం నేహా భండారి

జమ్మూ: కంటికి కన్పించేంత దూరంలో శత్రువు.. దాడుల రూపంలో ముంచుకొస్తున్న ముప్పు.. అలాంటి సమయంలో ప్రత్యర్థికి ఎదురొడ్డి పోరా...

Ed raids: అన్ని హద్దులూ దాటుతున్నారు.. ఈడీ సోదాలపై సుప్రీం సీరియస్‌

ED Raids: సమాఖ్య పాలన భావనను ఈడీ ఉల్లంఘిస్తోందని, అది సోదాల విషయంలో అన్ని హద్దులను దాటుతోందని సుప్రీంకోర్టు ఆగ్రహించింది...

Ghulam nabi azad: పాక్‌ ఉగ్రవాదుల పుట్ట.. ప్రపంచంలో మరెక్కడా అంత మంది లేరు: గులాం నబీ ఆజాద్‌

ప్రపంచం మొత్తంతో పోల్చితే పాకిస్థాన్‌లోనే అత్యధిక ఉగ్రవాదులు ఉన్నారని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌ విమర్శించ...

Top