Demat additions: స్టాక్ మార్కెట్ డీలా.. 21 నెలల కనిష్ఠానికి కొత్త డీమ్యాట్ ఖాతాలు
Demat additions: స్టాక్ మార్కెట్ డీలా.. 21 నెలల కనిష్ఠానికి కొత్త డీమ్యాట్ ఖాతాలు"
Play all audios:
Demat accounts | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు డీమ్యాట్ ఖాతాలు తెరవడంలో సరికొత్త మైలురాళ్లు నమోదయ్యేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి
మారింది. స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో కొత్తగా మార్కెట్ వైపు చూసేవారి సంఖ్య తగ్గింది. దాదాపు రెండేళ్ల కనిష్ఠానికి చేరిందంటే మార్కెట్ పరిస్థితి అర్థం
చేసుకోవచ్చు. దీంతో ఫిబ్రవరిలో కొత్తగా కేవలం 22.6 లక్షల డీమ్యాట్ ఖాతాలు మాత్రమే తెరుచుకున్నాయి. 2023 మే తర్వాత ఇదే అత్యల్పం. గతేడాది సెప్టెంబర్ నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర
ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. దీంతో నెలవారీ నమోదయ్యే కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతేడాది డిసెంబర్లో 32.6 లక్షల కొత్త ఖాతాలు యాడ్ అవ్వగా.. జనవరి నాటికి ఆ సంఖ్య
28.3 లక్షలకు పడిపోయింది. ఫిబ్రవరిలో అయితే 22.6 లక్షలకు పరిమితమైంది. ఫిబ్రవరి ముగిసేసరికి ఎన్‌ఎస్‌డీఎల్‌లో నమోదైన డీమ్యాట్ ఖాతాల సంఖ్య 19.04 కోట్లు ఉంటే, సీడీఎస్ఎస్ వద్ద నమోదైన డీమ్యాట్
ఖాతాల సంఖ్య 18.81 కోట్లుగా ఉంది. * ఇక యూపీఐ, రూపే లావాదేవీలపై ఛార్జీలు.. యూజర్లపై ప్రభావమెంత? కారణాలు ఇవే.. * గతేడాది సెప్టెంబర్ చివరిలో నమోదైన గరిష్ఠ స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ
దాదాపు 14 శాతం క్షీణించాయి. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఏకంగా 23 శాతం పడిపోయాయి. ఈక్విటీ మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకోవడంతో దలాల్ స్ట్రీట్‌లో నేరుగా పెట్టుబడులు
పెట్టేందుకు మదుపరుల ఆసక్తి తగ్గింది. ఐపీఓల రాక కూడా తగ్గింది. ఈ కారణంగా కొత్తగా ఖాతాలు తెరిచే వారి సంఖ్య తగ్గుముఖం పట్టేందుకు మరో కారణమని నిపుణులు చెబుతున్నారు. * డెరివేటివ్స్ మార్కెట్లలో
తగ్గిన కార్యకలాపాలు కూడా కొత్త డీమ్యాట్ ఖాతాలు తగ్గుముఖం పట్టేందుకు ఓ కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. డెరివేటివ్స్ విభాగంలో (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) రోజువారీ సగటు టర్నోవర్ 46 శాతం
క్షీణించింది. 2024 సెప్టెంబర్‌లో రూ.537.26 లక్షల కోట్లుగా ఉన్న ఈ టర్నోవర్ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.287.59 లక్షల కోట్లకు పడిపోయింది. * ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్‌లో రిటైల్ మదుపర్ల
ప్రాతినిథ్యం తగ్గించేందుకు సెబీ (SEBI) ప్రవేశపెట్టిన కఠినమైన నిబంధనలు మరో కారణమని అనలిస్టులు చెబుతున్నారు.
Trending News
Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలిమరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...
Kenishaa francis: ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా నాతో చెప్పండి.. : నటుడి భార్య పోస్ట్‌పై స్పందించిన గాయనిజయం రవి, కెనీషా రిలేషన్లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే కెనీషా పెట్టిన ఓ పోస్...
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Kolleru lake must be protected: andhra cm chandrababu naiduVIJAYAWADA: Chief Minister Nara Chandrababu Naidu emphasised the urgent need to protect Kolleru Lake, a vital ecological...
Unnao rerun latest news in hindi, photos, videos on unnao rerun inextlive jagranचिन्मयानंद केस : नहीं चाहते 'उन्नाव रिटर्न'! सुप्रीम कोर्ट में चिन्मयानंद के खिलाफ याचिका दायर crime6 years ag...
Latests News
Demat additions: స్టాక్ మార్కెట్ డీలా.. 21 నెలల కనిష్ఠానికి కొత్త డీమ్యాట్ ఖాతాలుDemat accounts | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు డీమ్యాట్ ఖ...
Shraddha das: కొలంబోలో టాలీవుడ్ బ్యూటీ.. శ్రద్దాదాస్ ఎంజాయ్మెంట్ పిక్స్ వైరల్CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Cpi(m)-led panchayat in kerala resolves to rename 'pakistan mukku' junctionFollow TNM's WhatsApp channel for news updates and story links. A junction in Kerala’s Kollam district, long known ...
Boney kapooor, khushi, janhvi diwali party 2020 photos - filmibeatEmbed Photo By Ghanshyam R | Updated: Saturday, November 14, 2020, 23:30 [IST] Photos of Boney Kapooor, Khushi, Janhvi D...
పంట నష్టం అంచనాలో వ్యవసాయ శాఖపశ్చిమ గోదావరి జిల్లా ముక్కామలలో నీట మునిగిన పంటలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వరదలతో పంట...