Mutual funds: మ్యూచువల్‌ ఫండ్‌లో మదుపు చేసే ముందు ఏం చూడాలి?

Eenadu

Mutual funds: మ్యూచువల్‌ ఫండ్‌లో మదుపు చేసే ముందు ఏం చూడాలి?"

Play all audios:

Loading...

గత దశాబ్దంలో ఎక్కువ మంది మదుపుదారులు..తమ పెట్టుబడి ఎంపికగా మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకున్నారు. ప్రస్తుతం 8 నెలల నుంచి మార్కెట్లు ఊగిసలాట థోరణిలో ఉన్నాయి. మదుపునకు మ్యూచువల్‌ ఫండ్లను


ఎంచుకునేవారు వీటి గురించి ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. వైవిధ్యీకరణ మ్యూచువల్‌ ఫండ్లు సహజంగా వైవిధ్యభరితంగా ఉంటాయి. ఇవి పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారుల నుంచి డబ్బును సమీకరిస్తాయి. ఇలా


సమీకరించిన నిధులను నిర్వాహకులు వివిధ రంగాలు, పరిశ్రమలు, ఆస్తి తరగతులలోని విస్తృత శ్రేణి సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఈ వైవిధ్యీకరణ కారణంగా పెట్టుబడులపై రిస్క్‌ తగ్గుతుంది. ఎందుకంటే,


ఇక్కడ ఫండ్‌కు సంబంధించిన పనితీరు ఒకే స్టాక్‌ లేదా బాండ్‌ పనితీరుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు, మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, అది 40 నుంచి 50 స్టాక్స్‌


పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంటుంది. ఈ విధంగా మదుపుదారుడు వ్యక్తిగత పెట్టుబడుల ద్వారా కలిగే నష్టాన్ని తగ్గించుకోవడమే కాకుండా విభిన్న స్టాక్స్‌, మార్కెట్ ట్రెండ్స్‌ను పరిశోధించడానికి తగిన సమయం


ఉంటుంది. విభిన్న ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడి రకాలకు అనువైన వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. అవి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో బాగా సహాయపడతాయి.


ఉదాహరణకు, మీకు తక్కువ-రిస్క్ సామర్థ్యం ఉన్నా, లేదా స్వల్ప కాలవ్యవధికి మీ మూలధనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నా..మీరు లిక్విడ్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎందుకంటే అవి స్థిరత్వం,


లిక్విడిటీని అందిస్తాయి. అదే విధంగా, పదవీ విరమణ నిధిని నిర్మించుకోవాలనుకునే యువ నిపుణులు దీర్ఘకాలికంగా అధిక రాబడిని సంపాదించడానికి అధిక-రిస్క్ గల ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. సిప్‌


మ్యూచువల్  ఫండ్లలో ప్రతి నెలా సిప్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. SIP మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా, మీరు ఒక ఫండ్‌కు స్థిరంగా, క్రమం తప్పకుండా చెల్లింపులు చేయడానికి కట్టుబడి ఉంటారు. ఇందులో మీరు


ఎంచుకున్న మొత్తం రూ. 500 వరకు కూడా ఉండవచ్చు. కాబట్టి, మ్యూచువల్ ఫండ్స్ SIP ద్వారా పెట్టుబడి పెట్టడానికి సరసమైన మార్గాన్ని అందిస్తాయి. ఈ ప్లాన్‌లు కూడా సరళంగా ఉంటాయి. అంటే, మీ ఆర్థిక


పరిస్థితి మారినప్పుడు సిప్‌ మొత్తాన్ని కూడా మార్చుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో, చాలా ఫండ్లు SIPను తాత్కాలికంగా నిలిపివేసే ఎంపికను కూడా అందిస్తున్నాయి. రిస్క్‌, సమయం మీకు ఉండే లక్ష్యాలను


బట్టే కాకుండా..మీరు భరించే శక్తిని బట్టి ఎంత రిస్క్‌ తీసుకోగలుగుతారో చూసుకోవాలి. మీ వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితులు ఎంత రిస్క్‌ తీసుకోవడానికి అనుమతిస్తాయో తెలుసుకోవాలి. ఈ రిస్క్‌ సామర్థ్యం


అంచనా వేసేటప్పుడు..వయసు, బాధ్యతలు, పొదుపు వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. లిక్విడ్ ఫండ్లు, డెట్-హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లు వంటి డెట్ ఫండ్‌లు కన్జర్వేటివ్(రిస్క్ సామర్థ్యం తక్కువగా


ఉన్న) ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటాయి. బ్యాలెన్స్‌డ్ ఫండ్లు, హైబ్రిడ్ ఫండ్లు మితమైన రిస్క్ తీసుకోగలిగే పెట్టుబడిదారులకు తగినవి. మిడ్, స్మాల్-క్యాప్ ఫండ్లు దూకుడుగా ఉండే పెట్టుబడిదారులకు


అనువైనవి. ప్రతి మ్యూచువల్ ఫండ్ పథకం రిస్కోమీటర్‌తో వస్తుంది, ఇది ఆ నిర్దిష్ట ఫండ్‌తో కలిగి ఉన్న రిస్క్ స్థాయిని సూచిస్తుంది. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు దాన్ని తనిఖీ చేయండి. లిక్విడిటీ


లిక్విడిటీ అంటే, మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను నగదుగా మార్చుకునే సౌలభ్యం. చాలా మ్యూచువల్ ఫండ్లు అధిక లిక్విడిటీని అందిస్తాయి. కొన్ని రోజుల్లోనే ప్రస్తుత NAV వద్ద మీ యూనిట్లను రిడీం


చేసుకోవడానికి అనుమతిస్తాయి. గమనిక: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. వీటి ఫలితాలు ఎల్లకాలం ఒకేలా ఉండవు. మార్కెట్‌ పరిస్థితుల కారణంగా కొన్ని సార్లు నష్టాలు


రావచ్చు. కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి కూడా తగ్గిపోవచ్చు. కాబట్టి, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేముందు SEBI రిజిస్టర్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిది.  


Trending News

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగు

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Latests News

Mutual funds: మ్యూచువల్‌ ఫండ్‌లో మదుపు చేసే ముందు ఏం చూడాలి?

గత దశాబ్దంలో ఎక్కువ మంది మదుపుదారులు..తమ పెట్టుబడి ఎంపికగా మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకున్నారు. ప్రస్తుతం 8 నెలల నుంచి మార్క...

Amit shah: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఉగ్రవాదానికి దీటైన జవాబు: అమిత్‌ షా

పహల్గాం దాడులతో అన్ని హద్దులూ దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి.. వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేస...

Amritsar: అమృత్‌సర్‌లో బాంబు పేలుడు.. అనుమానిత ఉగ్రవాది మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. నగర బైపాస్‌కు సమీపంలో ఓ వ్యక్తి బాంబు పెట్...

Supreme court: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు మూడు రోజుల్లో భారత్‌కు రావాలని సుప్రీం ఆదేశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచా...

Rapo22: ట్రెండింగ్ టైటిల్‌తో వచ్చేసిన రామ్‌.. కొత్త సినిమా పేరిదే..

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో రామ్‌ నటిస్తోన్న సినిమా (#RAPO22) పేరు ఖరారైంది. నేడు ఈ యంగ్‌ హీరో పుట్టినర...

Top