Murali naik: శ్రీసత్యసాయి జిల్లా జవాను జమ్మూకశ్మీర్‌లో వీరమరణం
Murali naik: శ్రీసత్యసాయి జిల్లా జవాను జమ్మూకశ్మీర్‌లో వీరమరణం"
Play all audios:
గోరంట్ల: శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన జవాను జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు చెందిన మురళీనాయక్ మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు శుక్రవారం ఉదయం
సమాచారం అందింది. సరిహద్దులో చొరబాటు దారుల కాల్పుల్లో ఆయన మృతిచెందినట్లు అధికారులు వారికి తెలిపారు. 2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరిన మురళీనాయక్.. రెండు రోజుల క్రితం వరకు నాసిక్‌లో
విధులు నిర్వర్తించారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆయన్ను నాసిక్ నుంచి జమ్మూకశ్మీర్‌కు పిలిపించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చొరబాటు దారుల కాల్పుల్లో
మురళీనాయక్ మరణించారు. ఈ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు మురళీ నాయక్ తల్లిదండ్రులను సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. మంత్రి సవిత
కల్లితండాకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5లక్షల చెక్కును మురళీనాయక్ తల్లిదండ్రులకు ఆమె అందజేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ దిగ్భ్రాంతి దేశ
రక్షణలో సైనికుడు మురళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీనాయక్‌కు
నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు, సైనికుడు మురళీ నాయక్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం
చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన ఆయన.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది: బండి సంజయ్ జవాన్ మురళీ నాయక్ మృతి పట్ల కేంద్రమంత్రి
బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ తండ్రి శ్రీరామ్‌తో ఫోన్లో మాట్లాడి ఓదార్చి, ధైర్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ త్యాగం
చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మురళీ వీరమరణాన్ని యావత్ భారత్ గుర్తుంచుకుంటుందని వ్యాఖ్యానించారు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
Video: revanth reddy sworn in as cm of telangana, bhatti vikramarka his deputyAnumula Revanth Reddy on Thursday took oath as Chief Minister of Telangana, becoming the first Congress CM of the younge...
20 వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్డౌన్ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...
Latests News
Murali naik: శ్రీసత్యసాయి జిల్లా జవాను జమ్మూకశ్మీర్‌లో వీరమరణంగోరంట్ల: శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన జవాను జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు...
Ap liquor scam: ఏపీ మద్యం కుంభకోణం.. కీలక నిందితుడు అరెస్ట్అమరావతి: ఏపీ మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప...
ప్రకృతి అందాల మధ్య కొలువైన రామలింగేశ్వర స్వామి శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం!Reported by: Published by: Last Updated:June 26, 2023 5:47 PM IST ANDHRA PRADESH: ఈ కాలపు ఆలయాలు చుట్టూ ప్రహరీతో కట్టు ద...
Raj bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో హార్డ్ డిస్క్ చోరీపంజాగుట్ట: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ ఘటన చోటుచేసుకుంది. అందులోని సుధర్మ భవన్లో హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు రాజ్‌భవన్ ...
Suzuki avenis: సుజుకీ నుంచి 2025 అవెనిస్.. ధర, అప్డేట్స్ ఇవే..Suzuki Avenis | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ 2025 అవెనిస్ (Suzuki Avenis) మోడల్‌ను మార్క...