Badar khan suri: ఆ భారతీయ విద్యార్థిని విడుదల చేయండి: అమెరికా న్యాయస్థానం

Eenadu

Badar khan suri: ఆ భారతీయ విద్యార్థిని విడుదల చేయండి: అమెరికా న్యాయస్థానం"

Play all audios:

Loading...

బదర్‌ఖాన్‌ను తక్షణమే విడుదల చేసి, వర్జీనియా వెళ్లేందుకు అనుమతించాలని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది.  వాషింగ్టన్‌: హమాస్‌ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో భారత విద్యార్థి


బదర్‌ఖాన్‌ సురి అమెరికాలో అరెస్టయిన (Indian Student Arrested) సంగతి తెలిసిందే. ఈక్రమంలో సురికి అమెరికా న్యాయస్థానంలో ఊరట లభించింది. నిర్బంధంలో ఉన్న భారతీయ విద్యార్థిని తక్షణమే విడుదల చేయాలని


ఆదేశాలు ఇచ్చింది. టెక్సాస్‌ నుంచి వర్జీనియా వెళ్లేందుకు అనుమతించాలని డిస్ట్రిక్ట్ జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయమూర్తి మాటలు విన్నప్పుడు తనకు కన్నీళ్లు వచ్చాయని సురి భార్య సంతోషం


వ్యక్తంచేశారు. వాషింగ్టన్‌ డీసీలోని జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ డాక్టోరల్‌గా ఉన్న బదర్‌ ఖాన్‌ సురి (Badar Khan Suri).. విశ్వవిద్యాలయంలో హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడని


డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) అధికారులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉగ్రవాద సంస్థలోని పలువురితో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్నారు. దీంతో అతడి వీసాను రద్దు


చేయడమే గాక.. వర్జీనియాలోని నివాసం నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో తన అరెస్టును సవాల్‌ చేస్తూ సురి కోర్టును ఆశ్రయించారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రపూరిత చర్యేనని తన పిటిషన్‌లో


ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ వర్జీనియా కోర్టు.. అతడికి ఇటీవల తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ఈ వ్యవహారంపై న్యాయస్థానం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు


అతడిని అమెరికా నుంచి పంపించకూడదని స్పష్టంచేసింది. అప్పటినుంచి అతడిని లూసియానాలోని ఇమిగ్రేషన్‌ డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచినట్లు అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియస్‌ వెల్లడించింది. ఇప్పుడు


అక్కడినుంచి విడుదల చేస్తూ కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. 


Trending News

రెడ్‌జోన్లు లాక్‌; ఆ ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు

కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వ సూచనలు మేరకు అధికారులు పకడ్బంధీ చర్యలు చేపడుతున్నారు. అక్కడ ప్రజలు ఇంటికే పరిమితమయ్యేలా క...

Us markets crash: అమెరికా మార్కెట్లూ అతలాకుతలం.. బేర్‌ గుప్పిట్లోకి s&p 500

US markets crash | వాషింగ్టన్‌: అమెరికా స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ట్రంప్‌ టారిఫ్‌ల ప్రకటన మూలంగా...

'సరి'గా.. 'భేషు'గ్గా!

దిల్‌సుఖ్‌నగర్‌లో సరి–బేసి మార్కింగ్‌ చేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది _ఒక అంకానికి తెర పడింది. పట్నం రెక్కలు విచ్చుకుంది....

Nagarkurnool: ప్రియురాలిని చూడటానికి రాత్రి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. బంధువులు చూసి ఏం చేశారంటే..?

Published by: Last Updated:June 12, 2022 12:13 PM IST ఈనెల 5న నాగర్​కర్నూల్​లో చిన్నమ్మ ఇంటికి ప్రియురాలు వెళ్లింది. ప్ర...

Tdp: మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన తెదేపా

అమరావతి: తెదేపాలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు (Ch...

Latests News

Badar khan suri: ఆ భారతీయ విద్యార్థిని విడుదల చేయండి: అమెరికా న్యాయస్థానం

బదర్‌ఖాన్‌ను తక్షణమే విడుదల చేసి, వర్జీనియా వెళ్లేందుకు అనుమతించాలని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది.  వాషింగ్టన్‌: హమాస్...

New movies 2025 – bollywood, hollywood, tamil, telugu, kannada, hindi & malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Health tips: పొట్లకాయ తిన్నాక పొరపాటున కూడా ఈ ఫుడ్స్ తినకండి.. జాగ్రత్త..!

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Astrology: 2023 జనవరి వరకు వీరికి అద్భుతంగా ఉంటుంది.. శని దయతో అన్నీ విజయాలే

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Vangalapudi anitha | latest vangalapudi anitha - eenadu

జగన్‌ తల్లి, చెల్లెళ్లకూ రక్షణ కల్పిస్తాం: హోం మంత్రి అనిత మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర హోం...

Top