Uk: పీవోకే ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయాలి: బ్రిటిష్ ఎంపీ
Uk: పీవోకే ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయాలి: బ్రిటిష్ ఎంపీ"
Play all audios:
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ను బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ కొనియాడారు. ఇంటర్నెట్‌డెస్క్: పహల్గాంలో పర్యాటకులపై జరిగిన పాశవిక ఉగ్రదాడిని
బ్రిటిష్ (UK) ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ (Bob Blackman) తీవ్రంగా ఖండించారు. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను కొనియాడిన ఆయన పీవోకేలోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయాలని
వ్యాఖ్యానించారు. ఈ మేరకు యూకేలోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడిన వీడియోను బాబ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ప్రతిస్పందనగా
భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్థాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై కచ్చితమైన వైమానిక దాడులు చేసింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో
ఉగ్రస్థావరాలను పూర్తిగా నేలమట్టం చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈసందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని అధికార ప్రభుత్వాన్ని
బాబ్ కోరారు. దీనికి యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ స్పందించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భయంకరమైనదని లామీ అభివర్ణించారు. ఉగ్రవాదంపై పోరుకు తమ ప్రభుత్వం భారత్, పాక్‌లతో కలసి
పనిచేస్తోందన్నారు. శాశ్వత శాంతి నెలకొనేందుకు ఇరుదేశాల మద్దతు అవసరమన్నారు. ఇక, పహల్గాం ఉగ్రదాడిని బాబ్ గతంలోనూ ఖండించారు. ఆ సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఎలాంటి చర్యలకైనా
తమ మద్దతు ఉంటుందని తెలిపారు. * జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం..! గతనెల 22న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. అందుకు ప్రతీకారంగా భారత్
‘ఆపరేషన్ సిందూర్’ పేరిట మెరుపుదాడులకు దిగింది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అది జీర్ణించుకోలేని పాకిస్థాన్.. జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలపై దాడులకు పాల్పడింది. దీంతో
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇటీవల ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా.. ప్రస్తుతం అది కొనసాగుతోంది.
Trending News
Network18 - sadak suraksha abhiyan: ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు.. నెట్‌వర్క్18 రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో సీవీ ఆనంద్Published by: Last Updated:January 16, 2025 1:50 PM IST SADAK SURAKSHA ABHIYAN 2025: రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ ...
వాట్సాప్‌లో కొత్త రకం మాల్వేర్వాట్సాప్ వినియోగదారులు కొత్త మాల్‌వేర్ బారిన పడుతున్నారనే వార్తలు వినిస్తున్నాయి. వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేస్తున్న ...
Bhopal | latest bhopal - eenaduవిజయ్ షా వ్యాఖ్యలపై విచారణకు సిట్ కర్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా కేసు వి...
Thummala nageswara rao | latest thummala nageswara rao - eenaduరాష్ట్రంలో మరిన్ని గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మాణం తెలంగాణలో రైతుల సౌకర్యార్థం మరిన్ని గోదాములు, శీతల గిడ్డంగులు నిర్మ...
Rajanna sircilla news | latest rajanna sircilla news - eenaduవ్యవసాయానికి సాంకేతికత! నేల స్వభావాన్ని బట్టి వ్యవసాయ పద్ధతులు.. వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగుచర్యలు, ఆధునిక విధానాలు...
Latests News
Uk: పీవోకే ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయాలి: బ్రిటిష్ ఎంపీపహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ను బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ కొనియాడ...
Thummala nageswara rao | latest thummala nageswara rao - eenaduరాష్ట్రంలో మరిన్ని గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మాణం తెలంగాణలో రైతుల సౌకర్యార్థం మరిన్ని గోదాములు, శీతల గిడ్డంగులు నిర్మ...
Rajanna sircilla news | latest rajanna sircilla news - eenaduవ్యవసాయానికి సాంకేతికత! నేల స్వభావాన్ని బట్టి వ్యవసాయ పద్ధతులు.. వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగుచర్యలు, ఆధునిక విధానాలు...
Lalu prasad yadav | latest lalu prasad yadav - eenaduభూ కుంభకోణం కేసు.. లాలూ ప్రసాద్, తేజస్వీకి ఈడీ సమన్లు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఆయన తండ్రి, ఆర్జేడీ అధ్యక్...
వాట్సాప్‌లో కొత్త రకం మాల్వేర్వాట్సాప్ వినియోగదారులు కొత్త మాల్‌వేర్ బారిన పడుతున్నారనే వార్తలు వినిస్తున్నాయి. వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేస్తున్న ...