Usa: హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రవేశాలు.. ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకున్న న్యాయమూర్తి
Usa: హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రవేశాలు.. ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకున్న న్యాయమూర్తి"
Play all audios:
అమెరికా: ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి (Harward University) వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు (Donald Trump) చెక్‌పడింది. హార్వర్డ్
యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతి ట్రంప్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకుంటూ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి నిధుల్లో కోత వేసిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్.. ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని గురువారం రద్దు చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని
వ్యతిరేకిస్తూ ఆ యూనివర్సిటీ కోర్టుకెక్కింది. ఈ మేరకు బోస్టన్ ఫెడరల్ కోర్టులో యూనివర్సిటీ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయమూర్తి అలిసన్ బరోస్ అమెరికా ప్రభుత్వం తీసుకున్న
నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నారు. తమ విద్యాసంస్థలో ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు అవసరమైన పత్రాల జారీకి
స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్‌తో విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. ఎస్ఈవీపీ వ్యవస్థ
నుంచి విశ్వవిద్యాలయాన్ని తొలగించడం అనైతికమని, నిబంధనలు ఉల్లంఘించడం అవతుందని హార్వర్డ్ తన తాజా పిటిషన్లో పేర్కొంది. ‘‘ఒక్క సంతకంతో యూనివర్సిటీలోని మొత్తం విద్యార్థుల్లో పావువంతు వారిని
తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని’’ హార్వర్డ్ పేర్కొంది. 140కి పైగా దేశాల్లోని విద్యార్థులు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న, త్వరలో రాబోయే విదేశీ విద్యార్థుల
సంఖ్య సుమారు 7,000 మంది. ఈ మొత్తం సంఖ్య యూనివర్సిటీలో చదువుతున్న వారిలో 27 శాతానికి సమానం. హార్వర్డ్ పాలన, పాఠ్యాంశాలు, సిబ్బంది, విద్యార్థుల భావజాలంను నియంత్రించాలనే ప్రభుత్వ డిమాండ్లను
తిరస్కరించడానికి యూనివర్సిటీ తన మొదటి సవరణ హక్కులు ఉపయోగించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగిందని హార్వర్డ్ తన పిటిషన్లో పేర్కొంది. ప్రభుత్వ చర్యతో అనేక అకాడమిక్
ప్రోగ్రామ్‌లు, పరిశోధన ప్రయోగశాలలు, క్లినిక్‌లు, యూనివర్సిటీ తరఫున ఎఫ్-1, జే-1 వీసాదారుల కోర్సులు ఒక్కసారిగా గందరగోళానికి గురైనట్లు తెలిపింది. తమకు వెంటనే ప్రభుత్వ చర్యల నుంచి ఉపశమనం
కలిగించాలని హార్వర్డ్ తాజా పిటిషన్లో కోరింది.
Trending News
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
కరోనా నేర్పిన పాఠాలుకరోనా వైరస్ మహమ్మారిపై మన దేశం ఎడతెగకుండా పోరు సాగిస్తున్నా ఆ కేసుల సంఖ్య 2,07,000 దాటిపోయింది. ఆ వైరస్ దండయాత్ర మొదలె...
‘దేవుడి అనుగ్రహం కలగాలంటే బిడ్డను బలివ్వాల్సిందే’న్యూఢిల్లీ: డాక్టర్లు, సైంటిస్టులు కన్నా బాబాలు, సాధువులపైనే మన జనాలకు నమ్మకం ఎక్కువ. వారు చెప్తే ఎలాంటి కష్టమైన పని అయి...
Operation sindoor: ఆపరేషన్ సిందూర్.. ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ పోర్టు దిగ్బంధంఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా...
Usa: హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రవేశాలు.. ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకున్న న్యాయమూర్తిఅమెరికా: ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి (Harward University) వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్...
Latests News