Hungry in gaza: గాజాలో ఆకలి కేకలు.. 77 ట్రక్కులను వేలాది మంది అడ్డుకొని

Eenadu

Hungry in gaza: గాజాలో ఆకలి కేకలు.. 77 ట్రక్కులను వేలాది మంది అడ్డుకొని"

Play all audios:

Loading...

ఇంటర్నెట్ డెస్క్‌: గాజాలో ఆకలి కేకలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి గోదాములపైనా దాడులు చేసి ఆహార పదార్థాలను తీసుకెళ్తున్న ఘటనలు తరచూ అక్కడ కనిపిస్తున్నాయి. తాజాగా గాజాలోకి


ఆహార పదార్థాలతో వెళ్తున్న అనేక ట్రక్కులను వేలాది మంది పాలస్తీనీయన్లు అడ్డుకున్నారు. ఆ ట్రక్కులు గమ్యస్థానాలు చేరకముందే అందులోని ఆహార పదార్థాలను స్థానికులు తీసుకెళ్లినట్లు ఐరాసకు చెందిన


ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) వెల్లడించింది. ‘‘గాజాలోకి గతరాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు 77 ట్రక్కులను డబ్ల్యూఎఫ్‌పీ తీసుకువచ్చింది. అయితే, ఆహార పదార్థాలతో వెళ్తున్న ఆ ట్రక్కులను మార్గమధ్యలోనే


అడ్డుకున్నారు. దాదాపు 80 రోజుల పాటు సాయం నిలిచిపోవడంతో వేలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో ఆ వాహనాలను ముందుకు వెళ్లనిచ్చేందుకు వాళ్లు సిద్ధంగా లేరు’’ అని డబ్ల్యూఎఫ్‌పీ పేర్కొంది. *


తలుపులు వేసుకోవడం మర్చిపోవద్దు.. మెక్రాన్‌ దంపతుల గొడవపై ట్రంప్‌ కొన్ని రోజులుగా ఈ సాయాన్ని పంపించేందుకు ఇజ్రాయెల్‌ అనుమతించినప్పటికీ.. తగినంత ఆహారం ఇంకా అందుబాటులో లేదని డబ్ల్యూఎఫ్‌పీ


అభిప్రాయపడింది. అక్కడ ఆకలి భయం ఎక్కువగా ఉందని, వారి ఆందోళనలను తగ్గించాలంటే మరింత సాయాన్ని అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే, ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే వేగంగా అనుమతులు ఇవ్వడంతోపాటు


వీటిని తరలించే కాన్వాయ్‌ కూడా సురక్షితంగా వెళ్లే పరిస్థితులు ఉండాలని తెలిపింది. మరోవైపు, గాజాలోని పాలస్తీనీయన్లకు మానవతా సాయం తరలింపునకు ఇజ్రాయెల్‌ పరిమితంగానే అనుమతిస్తోంది. దీంతో ఇటీవల 121


ట్రక్కుల్లో ఆహార పదార్థాలు గాజాలోకి ప్రవేశించాయి. అయితే, తీవ్ర ఆకలి సంక్షోభం ఎదుర్కొంటున్న గాజావాసులకు ఇవి అంతగా సరిపోవడం లేదు. దీంతో ఆహార పదార్థాల గోదాముపై దాడులుచేసి.. గోధుమపిండి, ఇతర


ఆహార పదార్థాలున్న పెట్టెలను లూటీ చేసినట్లు తెలుస్తోంది.


Trending News

20 లక్షలు దాటిన కరోనా టెస్టులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటు కోవిడ్‌ నిర్ధా...

‘Idhem Kharma’: TDP’s new campaign to take on YSRCP, highlight anti-incumbency

The Telugu Desam Party (TDP) is all set to announce a state-wide campaign called ‘Idhem Kharma’. The 45-day campaign wil...

Gold price today: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. రూ. 3,600 ఢమాల్!

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Vijay deverakonda introduces 'the girlfriend' rashmika mandanna, says 'she has been a lucky charm'

Vijay Deverakonda wrote a lengthy note praising the actress Rashmika. Basking in the success of Pushpa 2, actress Rashmi...

Hydraa razes illegal structures on patny nala; rasoolpura residents relieved

HYDRAA on Friday demolished illegal structures on the Patny nala in Rasoolpura, bringing immense relief to local residen...

Latests News

Hungry in gaza: గాజాలో ఆకలి కేకలు.. 77 ట్రక్కులను వేలాది మంది అడ్డుకొని

ఇంటర్నెట్ డెస్క్‌: గాజాలో ఆకలి కేకలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి గోదాములపైనా దాడులు చేసి ఆహార పదార్థ...

Lalu prasad yadav | latest lalu prasad yadav - eenadu

భూ కుంభకోణం కేసు.. లాలూ ప్రసాద్‌, తేజస్వీకి ఈడీ సమన్లు బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, ఆయన తండ్రి, ఆర్జేడీ అధ్యక్...

Ticket prices: సినిమా టికెట్ రేట్ల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వం ఓకే.. ఏ సినిమాకు ఎంత పెంచారంటే..!

Published by: Last Updated:January 01, 2025 6:38 PM IST TICKET PRICES HIKE: సంక్రాంతి పండుగ వేళ మూడు భారీ సినిమాలు విడుద...

Hugging : ఇది సూపర్ బిజినెస్.. కౌగిలించుకుంటూ కోట్లు సంపాదిస్తున్న యువతి.. గంటకు ఎంతంటే..?

Hugging : ఇది సూపర్ బిజినెస్.. కౌగిలించుకుంటూ కోట్లు సంపాదిస్తున్న యువతి.. గంటకు ఎంతంటే..?Published by:gvj srikanthnews1...

Beach Riddle: ఈ ఫోటో చూడండి.. వీరిలో ఎవరు బతికి ఉన్నారో, ఎవరు చనిపోయారో చెప్పగలరా..?

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Top