Trump-musk: ఆ విషయంలో మస్క్ కత్తి వాడాలి.. గొడ్డలి కాదు: ట్రంప్
Trump-musk: ఆ విషయంలో మస్క్ కత్తి వాడాలి.. గొడ్డలి కాదు: ట్రంప్"
Play all audios:
వృథా ఖర్చులను అరికట్టే సాకుతో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారంటూ మస్క్‌పై వస్తున్న విమర్శలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో డిపార్ట్మెంట్
ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(DOGE) శాఖ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) నిర్వహిస్తున్నారు. వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ఈ సంస్థ
పనిచేస్తుంది. ఆ సాకుతో ఉద్యోగులను భారీగా తొలగిస్తుండడంతో మస్క్‌పై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. మస్క్ ఈ
విషయంలో గొడ్డలి బదులు కత్తి(ఆపరేషన్లకు వినియోగించేది) వాడాలని చెబుతూ.. సామర్థ్యం గల ఉద్యోగులను తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డోజ్‌కు సూచించారు. ‘‘అవసరం లేనిచోట ఉద్యోగులను తొలగించడం
చాలా ముఖ్యం. కానీ అత్యంత ప్రతిభ, ఉత్పాదకత ఉన్న ఉద్యోగులను కొనసాగించడం కూడా ముఖ్యమే’’ అని ట్రంప్ అన్నారు. డోజ్ తీసుకుంటున్న చర్యలపై ప్రతి రెండు వారాలకు ఒకసారి క్యాబినెట్ సమావేశాలు
ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. ఫెడరల్ ఉద్యోగులను మస్క్ పెద్దఎత్తున తొలగిస్తుండడం దుందుడుకు చర్యగా ఉందని వస్తున్న విమర్శలపై విలేకరులు ఆయనను ప్రశ్నించగా ట్రంప్ వాటిని కొట్టిపడేశారు. మస్క్
సరైనవిధంగానే చర్యలు తీసుకుంటున్నారని.. ఈ నిర్ణయాల వల్ల దేశంలో పెద్ద మొత్తంలో వృథా ఖర్చులను అరికట్టవచ్చని అన్నారు. ఈ విషయంలో డోజ్తో కలిసి పనిచేయాలని తన కార్యదర్శులు, అధికారులకు ఆదేశాలు జారీ
చేశానని తెలిపారు. * సిరియాలో అలజడి.. అసద్ విధేయుల దాడిలో 13 మంది పోలీసులు మృతి ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ వ్యయాలను కట్టడి చేయడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్
గవర్నమెంట్ ఎఫీషియన్సీని ఏర్పాటుచేశారు. దీని పగ్గాలను మస్క్‌కు అప్పగించారు. ఇందులోభాగంగా వేల మంది ఫెడరల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను తొలగించేందుకు మస్క్ సిఫార్సు చేస్తున్నారు. తాను సిబ్బందిని
తగ్గించడంతోపాటు.. బాగా పని చేసేవారిని ఉన్నత స్థానాలకు తీసుకొస్తానని చెప్పారు. పలువురు నిపుణులు, డెమోక్రాట్లు మస్క్ చర్యలు సరైనవి కావని విమర్శలు గుప్పిస్తుండగా ట్రంప్ వాటిని ఖండిస్తూ
వస్తున్నారు.
Trending News
Aadhaar: ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..Aadhaar: ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..Published by:Veera Babutrending deskLast Updated:January 04, 2025 9:...
Prabhas: షూటింగ్లో గాయపడ్డ ప్రభాస్... కాలికి స్వల్పగాయం..!Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...
Pensioners deadline: హెచ్చరిక!.. నవంబర్ 30లోగా ఇది చేయకపోతే మీ పెన్షన్ ఆగిపోతుంది.Published by: Last Updated:November 16, 2024 7:19 PM IST PENSION DEADLINE: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పదవీ విరమణ ఉద్యోగులు...
సీఎం జగన్ దాడిపై సజ్జల కీలక వ్యాఖ్యలుTelugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...
Amar Deep: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ 'నా నిరీక్షణ' మూవీ షురూ...!Amar Deep: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ 'నా నిరీక్షణ' మూవీ షురూ...!Published by:Bhanuprasad Rangaiahgarinews18-teluguLast Up...
Latests News
Trump-musk: ఆ విషయంలో మస్క్ కత్తి వాడాలి.. గొడ్డలి కాదు: ట్రంప్వృథా ఖర్చులను అరికట్టే సాకుతో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారంటూ మస్క్‌పై వస్తున్న విమర్శలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ...
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Gyanesh kumar: నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్.. వెల్లడించిన న్యాయశాఖఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ఎన్నికల ప్రధాన నూతన కమిషనర్ (CEC)గా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్ర...
Bigg boss 7: నీ పేరెత్తితే చెప్పుతో కొట్టు..! హాట్ టాపిక్‌గా రతిక- పల్లవి ప్రశాంత్ యవ్వారం!!ఈ సారి హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. సింగర్ దామిని, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, ఆట సందీప్, షకీలా, శోభా శ...
Thummala nageswara rao: అనుకున్న సమయానికే రైతుభరోసా నిధులు జమ చేస్తాం: మంత్రి తుమ్మలహైదరాబాద్: రైతులకు మంచి రోజులు వస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. చిన్న రాష్ట్రం...