Bombs: జర్మనీలో బయటపడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు..

Eenadu

Bombs: జర్మనీలో బయటపడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు.."

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: జర్మనీ (Germany) లోని కొలోన్‌ నగరంలో రెండో ప్రపంచ యుద్ధం (WWII) సమయంలోని మూడు బాంబులను (Bombs) కనుగొన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమయిన


అధికారులు బాంబులు ఉన్న ప్రాంతానికి సమీపంలోని 20వేల మందికి పైగా ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. వారికి నగరానికి సమీపంలోని పలు చర్చిలు, క్రీడా మైదానాల్లో ఆశ్రయం కల్పించినట్టు పేర్కొన్నారు.


కొలోన్‌ నగరానికి కొంత కాలం పాటు రవాణా మార్గాలు కూడా మూసివేసినట్టు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరవ్యాప్తంగా అంబులెన్సులు, భద్రతా బలగాలను మోహరించామన్నారు. రెండో ప్రపంచ యుద్ధం


సమయంలో జర్మనీపై వేసిన బాంబుల్లో పేలని మూడు బాంబులను సోమవారం గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటిని అమెరికా తయారు చేసినట్లుగా భావిస్తున్నారు. వీటిలో రెండు బాంబుల బరువు చెరో 1,000


కిలోలు ఉండగా.. మరొకటి 500 కిలోలు ఉన్నట్లు గుర్తించామన్నారు. బాంబులను నిర్వీర్యం చేయడానికి ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతానికి 1,000 మీటర్ల వరకు డేంజర్‌


జోన్‌గా ప్రకటించామన్నారు. ప్రమాదవశాత్తు ఈ బాంబులు పేలితే..కిలో మీటర్ల మేర తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు.  * అమెరికా న్యూక్లియర్‌ డీల్‌పై ఖమేనీ విమర్శలు 1939లో పోలండ్‌పై జర్మనీ దాడితో రెండో


ప్రపంచ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హిట్లర్‌ ఆధ్వర్యంలోని నాజీ సేనలను అణచివేసేందుకు అమెరికా, బ్రిటన్‌ దళాలు.. జర్మనీపై వేలకొద్ది బాంబులు వేశాయి. ఇప్పటికీ జర్మనీలో


పెద్దసంఖ్యలో పేలని బాంబులు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. 2017లో ఫ్రాంక్‌ఫర్ట్‌లో 1.4 టన్నుల బాంబు లభ్యమైంది. 2024లో 31 బాంబులను కనుగొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో


జర్మన్ నగరాలపై 1.5 మిలియన్ బాంబులు వేయగా..వాటిలో 20శాతం బాంబులు పేలకుండా అలాగే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. 


Trending News

Lord shiva: శివ పూజలో పొరపాటున కూడా ఇవి వాడొద్దు.. పరమేశ్వరుడికి కోపం వస్తుందంట..!

తామర, మల్లె, కేతకి వంటి పూలను శివుడికి అస్సలు సమర్పించ కూడదంట. ఈ పువ్వులు లైంగిక కోరికలను ప్రేరేపిస్తాయి, కనుక వీటిని శి...

Ktr | సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Bahubali's kattappa aka sathyaraj joins cast of salman khan-starrer 'sikandar'

She captioned the post, "Garma Garam pictures from the sets of SajidNadiadwala's Sikandar!!! With my fave Sath...

Jnu’s umar khalid calls slain terrorist burhan wani a revolutionary like che guevara - scoopwhoop

JNU student Umar Khalid who was in the limelight earlier this year for holding a pro-Afzal Guru event inside the campus,...

Money: PF డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా..? ముందు ఈ కీలక విషయాలు తెలుసుకోండి..

Money: PF డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా..? ముందు ఈ కీలక విషయాలు తెలుసుకోండి..Published by:Sunil Boddulanews18-teluguLast ...

Latests News

Bombs: జర్మనీలో బయటపడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: జర్మనీ (Germany) లోని కొలోన్‌ నగరంలో రెండో ప్రపంచ యుద్ధం (WWII) సమయంలోని మూడు బాంబులను (Bombs) కనుగొ...

Ranya rao: గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు.. రన్యారావుకు బెయిల్‌ వచ్చినా జైల్లోనే

బెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసులో (Gold Smuggling Case) అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు (Ranya Rao) స్పెషల్‌ న్యాయస్థా...

Kolleru lake must be protected: Andhra CM Chandrababu Naidu

VIJAYAWADA: Chief Minister Nara Chandrababu Naidu emphasised the urgent need to protect Kolleru Lake, a vital ecological...

Rana daggubati’s 'nene raju nene mantri' does good pre-release business

According to sources, the Telugu Satellite & Digital Rights have been sold for Rs. 8 crore, while the Malayalam Thea...

Sundeep kishan ventures into film production with 'kannadi'

Vista Dream Merchant will be co-producing the film and Anil Sunkura of AK Entertainments will release it. On the film, i...

Top