Ipl 2025: ఐపీఎల్‌లో అతిపెద్ద వయస్కుడు vs అతి పిన్న వయస్కుడు

Eenadu

Ipl 2025: ఐపీఎల్‌లో అతిపెద్ద వయస్కుడు vs అతి పిన్న వయస్కుడు"

Play all audios:

Loading...

నేడు జరగనున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన అంశం చోటుచేసుకోనుంది ఇంటర్నెట్‌ డెస్క్‌: నేటి రాత్రి 7:30 గంటలకు దిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో


చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings), రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన అంశం చోటుచేసుకోనుంది! ఐపీఎల్‌ (IPL) 2025లో అతిపెద్ద వయస్కుడైన


ధోనీ (MS Dhoni) చెన్నై తరఫున, అతి పిన్న వయస్కుడైన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) రాజస్థాన్‌ తరఫున తలపడనున్నారు. దీంతో అభిమానులు ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఐపీఎల్‌


పునఃప్రారంభం తర్వాత మిగిలిన మ్యాచ్‌లను కేవలం 6 వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ (BCCI) నిర్ణయించింది. ఈనేపథ్యంలో చెపాక్‌ స్టేడియంలో జరగాల్సిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌


మ్యాచ్‌ దిల్లీకి తరలిపోయింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో భారీగా అభిమానులు స్టేడియానికి తరలివచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లోనే ఐపీఎల్‌


2025 సీజన్‌లో అతి పెద్ద వయస్కుడైన ధోనీ (43), ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలోనే అతిపిన్న వయస్కుడైన వైభవ్ సూర్యవంశీ (14) తలపడనున్నారు. మరో విశేషం ఏంటంటే ధోనీకి ఇప్పటికే గ్రేట్‌ ఫినిషర్‌గా


పేరుంది. వైభవ్‌ సూర్యవంశీ ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. అంటే ఒకరికి మ్యాచ్‌ను ఎలా ఘనంగా ముగించాలో తెలిస్తే.. మరొకరికి ఎలా అద్భుతంగా ప్రారంభించాలో తెలుసన్నమాట! ఇంతకుముందు గువాహటి వేదికగా మార్చి


30న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై తరఫున ధోనీ పాల్గొన్నప్పటికీ, రాజస్థాన్‌ తుదిజట్టులో వైభవ్‌ సూర్యవంశీ స్థానం సంపాదించలేకపోయాడు. వైభవ్‌ ఈ


సీజన్‌ మధ్యలో తన ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. తన దూకుడైన ఆటతీరుతో ఇప్పటివరకు తాను ఆడిన ఆరు మ్యాచుల్లో 219 స్ట్రైక్‌రేట్‌తో 195 పరుగులు చేశాడు. ఇందులో ఒక రికార్డు సెంచరీ ఉంది. రాజస్థాన్‌


రాయల్స్‌కు మాత్రం ఈ సీజన్‌ ఓ పీడకలే. ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడితే అందులో కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన ఈ జట్టుకు నేడు జరగనున్న మ్యాచే.. ఈ


సీజన్‌లో ఆఖరుది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కూడా మే 25న అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో (Gujarat Titans) తమ చివరి మ్యాచ్‌ ఆడనుంది. 


Trending News

Rahul gandhi: గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరం: రాహుల్‌ గాంధీ

చార్మినార్‌ పరిధిలోని గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాద ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ దిగ్భ్రాం...

Mi vs dc: దిల్లీ ఇంటికి.. చివరి ప్లే ఆఫ్స్‌ బెర్తు ముంబయిదే

ముంబయి: ఐపీఎల్‌ (IPL) 2025లో ప్లే ఆఫ్స్‌ చివరి బెర్తును ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) సొంతం చేసుకుంది. సొంతగడ్డపై ది...

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. దేశ ఆత్మగౌరవం, ధైర్యాన్ని పెంచింది: ఆరెస్సెస్‌ చీఫ్‌

పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’(Operation Sindoor) విజయవంతంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆర...

Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (25-05-2025) బంధు,మిత్రుల సాయంతో కొత్త ప్రణాళికలు రూపొందిస...

Stock market: ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. 25 వేల దిగువకు నిఫ్టీ

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్ఠ...

Latests News

Ipl 2025: ఐపీఎల్‌లో అతిపెద్ద వయస్కుడు vs అతి పిన్న వయస్కుడు

నేడు జరగనున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన అంశం చోటుచేసుకోనుంది ఇంటర్నెట్‌ డెస్క్...

Assam: agp, aasu reject asom sanmilita mahasangha’s allegations over nrc

The Asom Gana Parishad (AGP) and All Assam Students’ Union (AASU) have expressed their strong resentment over the allega...

Rana daggubati replaces nana patekar in housefull 4, starts shooting today

Rana Daggubati &nbsp | &nbspPhoto Credit:&nbspTwitter MUMBAI: Actor Rana Daggubati, who has replaced veteran...

After sexual harassment allegations, 'baahubali' actor rana daggubati to replace nana patekar in 'housefull 4'

After Tanushree Dutta accused Nana Patekar of sexual harassment, the actor quit the film Rana Daggubati and Nana Patekar...

ఖరీఫ్‌ లక్ష్యం 62 లక్షల మెట్రిక్‌ టన్నులు

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో 62 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. గ...

Top