Virat kohli: విరాట్ కోహ్లీకి టెస్టు పగ్గాలివ్వాలి: మైకేల్ వాన్
Virat kohli: విరాట్ కోహ్లీకి టెస్టు పగ్గాలివ్వాలి: మైకేల్ వాన్"
Play all audios:
ఇంగ్లండ్‌తో టీమ్‌ఇండియా జూన్‌లో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈనేపథ్యంలో విరాట్ కోహ్లీకి టెస్టు పగ్గాలు అప్పగించాలని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్‌వాన్ ‘ఎక్స్’ వేదికగా
బీసీసీఐకి సూచించాడు. ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా (Team India), ఇంగ్లండ్‌తో జూన్‌లో అయిదు టెస్టుమ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈనేపథ్యంలో సెలక్టర్లు భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఇటీవలే
రోహిత్ శర్మ (Rohit Sharma) తన టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో సెలక్టర్లకు జట్టు ఎంపిక కాస్త జఠిలంగా మారింది. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నట్లు
వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ (Michael Vaughan), బీసీసీఐకి (BCCI) ఓ ఆసక్తికర సూచన చేశాడు. రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు
రిటైర్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇంగ్లండ్‌తో భారత్ ఆడే టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీని (Virat Kohli) కెప్టెన్‌గా నియమిస్తే బాగుంటుందని మైకేల్‌వాన్ అభిప్రాయపడ్డాడు. ‘ఒక వేళ నేనే
టీమ్‌ఇండియా సెలక్టర్‌ను అయితే.. ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా, శుభ్‌మన్‌గిల్‌ను (Shubman Gill) వైస్ కెప్టెన్‌గా నియమిస్తాను’ అని మైకెల్ వాన్ ఎక్స్‌లో
పోస్టు చేశాడు. అయితే తన రిటైర్‌మెంట్ గురించి కోహ్లీ, బీసీసీఐకి ఇంకా ఏ విషయమూ తేల్చిచెప్పలేదు. మరోవైపు టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif).. విరాట్ తన రిటైర్‌మెంట్
ఆలోచన గురించి పునఃపరిశీలన చేసుకోవాలని సూచించాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో సత్తా చాటి, ఘనంగా వీడ్కోలు పలకమని సలహా ఇచ్చాడు. విరాట్ కొన్నాళ్లుగా ఆఫ్‌సైడ్ బంతులతో ఇబ్బందిపడుతున్న విషయాన్నీ
ప్రస్తావించాడు. ఈమేరకు కైఫ్... ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశాడు.
Trending News
Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeatTo Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...
మత్తు మాయలో పడి ఇంటికి వచ్చిన స్నేహితురాలి శీలాన్ని తాకట్టు పెట్టి...Last Updated:September 21, 2019 8:30 PM IST నవ్వుతూ మోనాను పలకరించిన దీపక్ ఆమెకు జ్యూస్ కలిపి ఇచ్చాడు. జ్యూస్ తాగిన మోనా...
Delhi capitals | latest delhi capitals - eenaduముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్ జట్టు.. విల్‌జాక్స్, రికెల్‌టన్, కార్బిన్ బాష్ స్థ...
‘aatmanirbharta’ named oxford hindi word of 2020 | dynamite news‘AATMANIRBHARTA’ IMPLYING SELF-RELIANCE HAS BEEN NAMED BY OXFORD LANGUAGES AS ITS HINDI WORD OF THE YEAR 2020 AS IT “VAL...
ఆ కోళ్లు కాసులు కురిపిస్తున్నాయి..రాజశ్రీ రకం కోళ్లు విజయనగరం ఫోర్ట్: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతక...
Latests News
Virat kohli: విరాట్ కోహ్లీకి టెస్టు పగ్గాలివ్వాలి: మైకేల్ వాన్ఇంగ్లండ్తో టీమ్‌ఇండియా జూన్‌లో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈనేపథ్యంలో విరాట్ కోహ్లీకి టెస్టు పగ్గాలు అప్పగ...
కులచిచ్చుల సూత్రధారి చంద్రబాబేరౌండ్టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న మేరుగ నాగార్జున తిరుపతి అర్బన్: తెలుగు రాష్ట్రాల్లో ఆది నుంచి కుల చిచ్చులకు సూత్ర...
నర్సులు కావలెను..సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రులే కాదు.. నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులను సైతం నర్సింగ్ సిబ్బంది కొరత తీవ్రంగ...
Sidharth-alia's 'kar gayi chull' from kapoor & sons crosses 1 million views overnightThe crazy house party number is definitely stuck in people's minds. The much-loved party song, 'Kar Gayi Chull...
Hyper aadi | latest hyper aadi - eenaduHYPER AADI: 2019లో కనీసం ఆయన్ను గెలిపించుకోలేని మనం.. ఇలా అడగొచ్చా: హైపర్ ఆది hyper aadi: పొత్తులో భాగంగా జనసేన పార్టీక...