Rcb vs kkr: కోల్‌కతా ఆశలపై నీళ్లు.. బెంగళూరుతో మ్యాచ్‌ వర్షార్పణం

Eenadu

Rcb vs kkr: కోల్‌కతా ఆశలపై నీళ్లు.. బెంగళూరుతో మ్యాచ్‌ వర్షార్పణం"

Play all audios:

Loading...

బెంగళూరు: తొమ్మిది రోజుల తర్వాత ఐపీఎల్ (IPL) 2025 పునఃప్రారంభం కావడంతో మళ్లీ ధనాధన్ వినోదాన్ని ఆస్వాదిద్దామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ


(Royal Challengers Bengaluru), కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయింది. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మ్యాచ్‌కు


వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ ముందే అంచనా వేయగా.. అందుకు తగ్గట్టుగానే సాయంత్రం నుంచి వర్షం మొదలైంది. తొలుత చిన్నపాటి జల్లుగా మొదలై క్రమంగా జోరందుకుంది. తర్వాత వరుణుడు కొద్దిసేపు


శాంతించడంతో మ్యాచ్‌ నిర్వహణకు వీలుగా మైదానాన్ని సిద్ధం చేయడానికి సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే, కాసేపటికే మళ్లీ వాన మొదలైంది. వర్షం తగ్గితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌నైనా నిర్వహించాలని చూశారు.


కానీ, ఎడతెరిపి లేకుండా వాన కురువడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.  కోల్‌కతా ఔట్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనుకున్న కోల్‌కతా (Kolkata


Knight Riders) ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న కేకేఆర్‌ ఈ మ్యాచ్‌ రద్దవడంతో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ప్రస్తుతం కేకేఆర్ 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో ఉంది.


చివరి లీగ్ మ్యాచ్‌లో (హైదరాబాద్‌తో) గెలిచినా కోల్‌కతాకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇక, కేకేఆర్‌పై గెలిచి అధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుందామనుకున్న ఆర్సీబీకి నిరాశే ఎదురైంది.


అయితే, 12 మ్యాచ్‌లు ఆడి 17 పాయింట్లతో ఉన్న బెంగళూరు.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు ఛాన్స్‌ ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానంలో ఉంది.


Trending News

Royal challengers bengaluru | latest royal challengers bengaluru - eenadu

ముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్‌ జట్టు.. విల్‌జాక్స్‌, రికెల్‌టన్‌, కార్బిన్‌ బాష్‌ స్థ...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Etv news | latest etv news - eenadu

వేటగాళ్ల ఉచ్చులో వన్య ప్రాణాలు! రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రధానంగా ...

Anant ambani and radhika merchant's wedding: అనంత్, రాధిక పెళ్లి వేళ.. ధీరూభాయ్ అంబానీకి ముఖేష్ అంబానీ నివాళులు

ధీరూభాయ్ అంబానీ జూలై 6, 2002న కన్నుమూశారు. ముఖేష్ అంబానీ, ఆయన సోదరుడు అనిల్ అంబానీ తరచుగా కుటుంబ ప్రత్యేక సందర్భాలలో తమ ...

Sunday katha | latest sunday katha - eenadu

తనదాకా వస్తే స్కూల్‌ నుంచి అలసటగా ముభావంగా వచ్చిన నా కూతురు ఐశ్వర్యను చూస్తూ ‘‘ఏం ఐశూ, అంత డల్‌గా ఉన్నావు, క్లాసులో వర్క...

Latests News

Rcb vs kkr: కోల్‌కతా ఆశలపై నీళ్లు.. బెంగళూరుతో మ్యాచ్‌ వర్షార్పణం

బెంగళూరు: తొమ్మిది రోజుల తర్వాత ఐపీఎల్ (IPL) 2025 పునఃప్రారంభం కావడంతో మళ్లీ ధనాధన్ వినోదాన్ని ఆస్వాదిద్దామనుకున్న అభిమా...

Assam govt extends ‘apon ghor’ scheme

The Assam government has extended the special interest subvention scheme ‘Apon Ghar’ till March 31, 2020. The aim of ‘Ap...

Ramgopalpet fire accident: 10 గంటల పాటు తగలబడటానికి కారణం అదేనా? ఆ భవనం లోపల ఏమున్నాయి?

Published by: Last Updated:January 19, 2023 10:10 PM IST RAMGOPALPET FIRE ACCIDENT: డెక్కన్ నైట్ వేర్ షాప్‌లో టీ షర్ట్స్...

Allu aravind: మనవడితో నిర్మాత అల్లు అరవింద్‌ క్రికెట్‌.. వీడియో వైరల్‌

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విభిన్నమైన చిత్రాలు నిర్మించి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు అల్లు ...

Nagar kurnool: ఏసీబీ వలకు చిక్కిన రెవెన్యూ ఉద్యోగి

Published by: Last Updated:January 31, 2023 6:32 PM IST TELANGANA: రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించేందుకు ...

Top