Ipl 2025: దినేశ్ కార్తిక్ మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి: జితేశ్ శర్మ
Ipl 2025: దినేశ్ కార్తిక్ మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి: జితేశ్ శర్మ"
Play all audios:
దినేశ్ కార్తిక్ చెప్పిన మాటలతో ప్రభావితమై అద్భుతంగా బ్యాటింగ్ చేసినట్లు లఖ్‌నవూతో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ అన్నాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025లో
భాగంగా మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ జట్టు 20 ఓవర్లకు మూడు
వికెట్లు నష్టపోయి 227 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 230 రన్స్ చేసింది. లఖ్‌నవూ మీద ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ
మ్యాచ్‌లో 33 బంతుల్లోనే 85 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన జితేశ్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్’గా నిలిచాడు. తాను బ్యాటింగ్‌కు వెళ్లడానికి ముందు తమ మెంటార్ దినేశ్
కార్తిక్ (Dinesh Karthik) చెప్పిన మాటలే స్ఫూర్తిని నింపాయని జితేశ్ అన్నాడు. కొండంత లక్ష్యాన్ని ఛేదిచే క్రమంలో ఆర్సీబీ 123 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది. ఛేజ్ మాస్టర్‌గా పేరున్న
విరాట్ కోహ్లీ (Virat Kohli) 12వ ఓవర్లో తన వికెట్ కోల్పోయాడు. అప్పుడు క్రీజులోకి జితేశ్ వచ్చాడు. అక్కడి నుంచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 257.58 స్ట్రైక్‌రేట్‌తో 85 పరుగులు చేశాడు.
మయాంక్ అగర్వాల్‌తో కలిసి 107 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తన బ్యాటింగ్ ప్రదర్శనపై మ్యాచ్ అనంతరం జితేశ్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. ఇలా ఆడానన్న
విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నా. విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్‌కు వెళ్లాను. మా మెంటార్ దినేశ్ కార్తిక్.. ‘బాగా ఆడి.. జట్టును గెలిపించు’ అని సూచించాడు. ఆ మాటలే నాలో స్ఫూర్తిని
నింపాయి. నేను తర్వాత మ్యాచుల్లో కూడా ఇదే ఆటతీరును కొనసాగించే ప్రయత్నం చేస్తాను’ అని జితేశ్ శర్మ వివరించాడు.
Trending News
Lord shiva: శివ పూజలో పొరపాటున కూడా ఇవి వాడొద్దు.. పరమేశ్వరుడికి కోపం వస్తుందంట..!తామర, మల్లె, కేతకి వంటి పూలను శివుడికి అస్సలు సమర్పించ కూడదంట. ఈ పువ్వులు లైంగిక కోరికలను ప్రేరేపిస్తాయి, కనుక వీటిని శి...
Ktr | సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుCNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Money: PF డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా..? ముందు ఈ కీలక విషయాలు తెలుసుకోండి..Money: PF డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా..? ముందు ఈ కీలక విషయాలు తెలుసుకోండి..Published by:Sunil Boddulanews18-teluguLast ...
Bahubali's kattappa aka sathyaraj joins cast of salman khan-starrer 'sikandar'She captioned the post, "Garma Garam pictures from the sets of SajidNadiadwala's Sikandar!!! With my fave Sath...
BJP alleges preferential treament to Saradha scam accused Madan MitraBJP's state chief Rahul Sinha on Friday slammed Kolkata police for allegedly giving preferential treatment to West Benga...
Latests News
Ipl 2025: దినేశ్ కార్తిక్ మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి: జితేశ్ శర్మదినేశ్ కార్తిక్ చెప్పిన మాటలతో ప్రభావితమై అద్భుతంగా బ్యాటింగ్ చేసినట్లు లఖ్‌నవూతో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ తాత్కాలిక కె...
Assam: sivasagar cjm court grants bail to bir lachit sena leader shrinkhal chaliha in ‘extortion’ caseSIVASAGAR: The court of Sivasagar chief judicial magistrate (CJM) in Assam has granted bail to Bir Lachit Sena leader Sh...
Rohit Sharma: డకౌటైన రోహిత్ ఖాతాలో సెంచరీ రికార్డు.. తొలి మేల్ క్రికెటర్‌గా చరిత్ర.. కోహ్లీ వల్ల కూడా కాలేదు!Rohit Sharma: డకౌటైన రోహిత్ ఖాతాలో సెంచరీ రికార్డు.. తొలి మేల్ క్రికెటర్‌గా చరిత్ర.. కోహ్లీ వల్ల కూడా కాలేదు!Published b...
Zee launches new film: vasudhaiva kutumbakam – the world is my familyZee Entertainment Enterprises Ltd. (ZEE) today unveiled its Corporate Brand film which is based on its brand positioning...
Car reselling tips: పాత కారు అమ్మేయాలా? ఇలా చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి!చాలా మందికి సొంతిల్లు ఉండాలనే కోరికలానే సొంత కారు (Own Car) కూడా ఉండాలనే కల ఉంటుంది. కొందరి కారు కేవలం అవసరం మాత్రమే కాద...