Ipl top 2 race: టాప్‌ 2 రేసు రసవత్తరం.. ఆ టీమ్స్‌కు ఎలిమినేటైన జట్లు షాకిస్తే?

Eenadu

Ipl top 2 race: టాప్‌ 2 రేసు రసవత్తరం.. ఆ టీమ్స్‌కు ఎలిమినేటైన జట్లు షాకిస్తే?"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్: ఐపీఎల్‌ (IPL)లో ప్లేఆఫ్స్‌ రేసు ముగిసింది. ఇక మిగిలింది టాప్‌ 2 కోసం పోరు మాత్రమే. ప్లేఆఫ్స్‌ చేరిన గుజరాత్‌ టైటాన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌,


ముంబయి ఇండియన్స్‌ జట్లు.. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచేందుకు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడికి చేరిన జట్లకు క్వాలిఫయర్‌లో ఓడినా..  మరో అవకాశం ఉంటుంది. మరోవైపు


టేబుల్‌లో అట్టడుగున ఉన్న జట్లు.. టాప్‌ 2 రేసుపై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగానే  ఉన్నాయి. దీంతో ఈ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. గుజరాత్‌ (GUJARAT TITANS) కు ఇలా.. * పాయింట్ల పట్టికలో


టాప్‌లో కొనసాగుతున్న గుజరాత్‌కు.. ప్లేఆఫ్స్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన లఖ్‌నవూ గత మ్యాచ్‌లో షాకిచ్చింది. దీంతో ఆ జట్టు టాప్‌ 2 అవకాశాలు క్లిష్టంగా మారాయి. * గుజరాత్‌ మరో మ్యాచ్‌ మాత్రమే ఆడాల్సి


ఉంది. అందులో గెలిచినా ఆ జట్టు ఖాతాలో చేరేవి 20 పాయింట్లు. * అప్పుడు గుజరాత్‌ టాప్‌ 2 భవితవ్యాన్ని ఆర్సీబీ, పంజాబ్‌ తేల్చనున్నాయి. * ఒకవేళ అట్టడుగున ఉన్న చెన్నై.. చివరి మ్యాచ్‌లో గుజరాత్‌కు


షాకిస్తే శుభ్‌మన్‌ గిల్‌ సేన మూడో స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆర్సీబీ  (ROYAL CHALLENGERS BENGALURU) భవితవ్యం ఇలా.. * 17 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్న బెంగళూరు..


తదుపరి మ్యాచ్‌లు సన్‌రైజర్స్‌, లఖ్‌నవూతో ఆడనుంది. * ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. టాప్‌ 1లోకి వచ్చే అవకాశం ఉంది.  * ఒకవేళ సన్‌రైజర్స్‌, లఖ్‌నవూ షాకిస్తే మాత్రం.. ఆర్సీబీ టాప్‌ 2 అవకాశాలు


గల్లంతే. * సన్‌రైజర్స్‌ ఇప్పటికే లఖ్‌నవూను ప్లేఆప్స్‌నకు దూరం చేసింది. ఇక గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌కు లఖ్‌నవూ షాకిచ్చింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. పంజాబ్‌ (PUNJAB KINGS)


కింగ్స్‌ దూసుకెళ్తుందా..? * 11 ఏళ్ల తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టు పంజాబ్‌.. 17 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. * దిల్లీ, ముంబయితో తదుపరి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ


రెండింటిలో గెలిస్తే.. 21 పాయింట్లతో టాప్‌ 2లోకి వెళ్లే అవకాశం ఉంది.   * ఒక్కటి ఓడినా.. పైనున్న జట్ల ఫలితాలపై దీని టాప్‌ 2 భవితవ్యం ఆధారపడి ఉంది. ముంబయి (MUMBAI INDIANS)కి కష్టమే.. * ముంబయి


ఆడాల్సింది ఒక మ్యాచ్‌ మాత్రమే.. అదీనూ టాప్‌ 3లో ఉన్న పంజాబ్‌తో. * పంజాబ్‌పై ఓడితే పాండ్య సేన నాలుగో స్థానంలోనే ఉంటుంది. * పంజాబ్‌పై గెలిచినా.. ముంబయి ఖాతాలో చేరేవి 18 పాయింట్లు. అప్పుడు


టాప్‌ 2లోకి చేరాలంటే.. మిగతా మూడు జట్లు రాబోయే అన్ని మ్యాచ్‌లు ఓడిపోవాలి. _ఇక ఇప్పటికే ఎలిమినేటై పరువు కోసం చెన్నై, హైదరాబాద్‌, లఖ్‌నవూ, దిల్లీ ఆడుతున్నాయి. ఆఖరి మ్యాచ్‌ల్లో ఆ జట్లు


విజృంభిస్తే.. ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లకు కష్టాలు తప్పవు. దీంతో ప్రతి మ్యాచ్‌ ఫలితం. నెట్‌ రన్‌రేట్‌ టాప్‌ 4 జట్లకు కీలకంగా మారనుంది._ __


Trending News

Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండి

Published by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...

Who: ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరం.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: గాజాపై ఇజ్రాయెల్‌ తీవ్ర స్థాయిలో  (Israel-Hamas Conflict) దాడులతో విరుచుకుపడుతోంది. సామాన్య పౌరులు పె...

Bunny vasu: పవన్‌ కల్యాణ్‌ ప్రకటనపై స్పందించిన సినీ నిర్మాత బన్నీ వాసు

హైదరాబాద్‌: తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan...

Qwrap: sc decriminalises adultery; tanushree speaks out on patekar

5. AIB’S ASHISH SHAKYA AND ROHAN JOSHI DECODE INDIAN NEWS COVERAGE Indian media houses have always been famous for drama...

Dhanush-starrer naane varuven’s new poster unveiled

_Naane Varuven's _new poster_ _was unveiled today. The film stars Dhanush in a leading role. The poster features Dh...

Latests News

Ipl top 2 race: టాప్‌ 2 రేసు రసవత్తరం.. ఆ టీమ్స్‌కు ఎలిమినేటైన జట్లు షాకిస్తే?

ఇంటర్నెట్‌ డెస్క్: ఐపీఎల్‌ (IPL)లో ప్లేఆఫ్స్‌ రేసు ముగిసింది. ఇక మిగిలింది టాప్‌ 2 కోసం పోరు మాత్రమే. ప్లేఆఫ్స్‌ చేరిన గ...

Ind vs nep : దంచి కొట్టిన భారత ఓపెనర్లు.. నేపాల్‌పై ఈజీ విక్టరీ.. సూపర్ 4లో ఎంట్రీ

Published by: Last Updated:September 04, 2023 11:31 PM IST IND VS NEP : పసికూన నేపాల్ (NEPAL)పై టీమిండియా (TEAM INDIA) ఈ...

Ejs interviews: ఈనాడు జర్నలిజం స్కూలు ఇంటర్వ్యూలకు 228 మంది ఎంపిక.. ఇంటర్వ్యూ తేదీలివీ

EJS Interviews: ఈనాడు జర్నలిజం స్కూలు ఇంటర్వ్యూలకు 228 మంది ఎంపికయ్యారు. వారి ఇంటర్వ్యూ తేదీలు ఇవీ! By Features Desk Pub...

Mancherial news | latest mancherial news - eenadu

MANCHERIAL: ఎడ్లబండి, ఆటో, అంబులెన్స్‌.. గర్భిణి ఆస్పత్రి తరలింపునకు అష్టకష్టాలు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఓ గర్భ...

ఈ పెయింటింగ్ ఖరీదు ఎంతో తెలుసా?

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ గర్ల్ ఫ్రెండ్ సింగర్ గ్రైమ్స్ ఇటీవల ఒక కళా ఖండాన్ని వేలం వేశారు. సింగర్ గ్రైమ్స్ వేసిన పెయింటింగ...

Top