Ipl 2025: ఆర్సీబీకి గుడ్‌న్యూస్‌.. తిరిగి రానున్న జోష్‌ హేజిల్‌వుడ్‌

Eenadu

Ipl 2025: ఆర్సీబీకి గుడ్‌న్యూస్‌.. తిరిగి రానున్న జోష్‌ హేజిల్‌వుడ్‌"

Play all audios:

Loading...

ఐపీఎల్ పునఃప్రారంభమవుతున్న వేళ ఆర్సీబీకి ఓ శుభవార్త. జోష్‌ హేజిల్‌వుడ్‌ తిరిగి జట్టుతో చేరనున్నాడని సమాచారం.  ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌ (IPL)


వారంరోజులపాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి, పరిస్థితులు సద్దుమణిగాయి. దీంతో మే 17 నుంచి తిరిగి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ


నేపథ్యంలో ఆర్సీబీకి (Royal Challengers Bengaluru) ఓ తీపి కబురు అందింది. ఐపీఎల్‌ వాయిదా పడగానే స్వదేశానికి వెళ్లిపోయిన ఆస్ట్రేలియన్‌ స్టార్‌ బౌలర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ (Josh Hazlewood)


ఐపీఎల్‌లో పాల్గొనేందుకు భారత్‌ రానున్నాడని సమాచారం. హేజిల్‌వుడ్‌ కచ్చితంగా ఏ తేదీన వచ్చే విషయం తెలియకున్నా.. త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీ ఆడిన చివరిమ్యాచ్‌లో హేజిల్‌వుడ్‌


పాల్గొనలేదు. భుజం గాయమే దీనికి కారణం. అలాగే వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (ICC World Test Championship) ఫైనల్‌ నేపథ్యంలో అతడు ఆర్సీబీ తరఫున మళ్లీ బరిలోకి దిగే విషయంపై పలు అనుమానాలు


వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఈ వార్తతో అవన్నీ పటాపంచలయ్యాయి. అతడి రాక ఆర్సీబీకి నిజంగా మేలు చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే హేజిల్‌వుడ్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు తన


ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో ఆర్సీబీని ప్లేఆఫ్స్‌నకు చేరువయ్యేలా చేశాడు. అలాగే ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్ స్టాయినిస్ (Marcus Stoinis), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లిస్‌


(Josh Inglis)కూడా పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) జట్టులోకి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. వీరు జైపుర్‌లో మే 24న దిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరగనున్న మ్యాచ్‌లో పాల్గొననున్నట్లు


సమాచారం. అలాగే మార్క్‌ ఎన్సన్‌, జేవియర్‌ బ్రెట్‌లెట్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, మిచెల్‌ ఓవెన్‌కూడా పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో చేరనున్నారు.  


Trending News

Row over KS Bhagawan’s anti-Vokkaliga remark, BJP and JD(S) condemn

Bharatiya Janata Party (BJP) leader CT Ravi condemned rationalist KS Bhagwan's recent comments targeting the Vokkaliga c...

T20 World Cup 2024 : అద్భుత అవకాశాన్ని మిస్ చేసుకున్న హిట్ మ్యాన్.. ఇప్పటికైతే రైనా మాత్రమే

T20 World Cup 2024 : అద్భుత అవకాశాన్ని మిస్ చేసుకున్న హిట్ మ్యాన్.. ఇప్పటికైతే రైనా మాత్రమేPublished by:N SUJAN KUMAR RE...

ఎలక్ట్రిక్ ఆటోలకు పెరుగుతున్న డిమాండ్.. కొనుగోళ్లు ఫుల్..

ఎలక్ట్రిక్ ఆటోలకు పెరుగుతున్న డిమాండ్.. కొనుగోళ్లు ఫుల్..Reported by:KOTHA HARIBABUnews18-teluguPublished by:Veera BabuL...

Optical illusion: మీ కంటి చూపుకు చిన్నటెస్ట్.. ఈఫోటోలో speak కాకుండా వేరే పదం ఉంది.. 5 సెకన్లలో కనిపెట్టండి

Published by: Last Updated:November 28, 2024 10:41 PM IST OPTICAL ILLUSION:మిమ్మల్ని రిఫ్రెష్ చే చియడానికి ఇదో చిన్న గేమ...

Ipl 2025: శ్రేయాస్‌ను పట్టించుకోని kkr.. అయ్యర్‌పై ఆ ఫ్రాంచైజీ కన్ను..!

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Latests News

Ipl 2025: ఆర్సీబీకి గుడ్‌న్యూస్‌.. తిరిగి రానున్న జోష్‌ హేజిల్‌వుడ్‌

ఐపీఎల్ పునఃప్రారంభమవుతున్న వేళ ఆర్సీబీకి ఓ శుభవార్త. జోష్‌ హేజిల్‌వుడ్‌ తిరిగి జట్టుతో చేరనున్నాడని సమాచారం.  ఇంటర్నెట్‌...

Jobs: భరోసా కేంద్రంలో ఉద్యోగ అవకాశాలు.. పూర్తి వివరాలిలా..

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Puzhu & Malayankunju: Casteist Anti-Heroes Represent the Norm, Not the Exception

Malayalam cinema’s engagement with caste over the years has been oppressive to say the least, with its narratives merely...

vodaphone | TechCrunch

vodaphoneHeadlines Only Load MoreFintechPalmPay launches in Nigeria on $40M round led by China’s TranssionJake BrightNov...

Nara lokesh: ఏపీ మంత్రి వాట్సాప్ బ్లాక్.. సమస్యలను ఈమెయిల్ ద్వారా పంపమని ప్రజలకు రిక్వెస్ట్

పాదయాత్రలో యువతకు తనను దగ్గరగా చేర్చిన "హలో లోకేష్" కార్యక్రమం పేరుతోనే ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న మంత్రి...

Top